Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లక్షద్వీప్ యొక్క ప్రగతి కి సంబంధించిన అంశాల పైఏర్పాటు చేసిన ఒక సమీక్ష సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

లక్షద్వీప్ యొక్క ప్రగతి కి సంబంధించిన అంశాల పైఏర్పాటు చేసిన ఒక సమీక్ష సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి


లక్షద్వీప్ యొక్క ప్రగతి కి సంబంధించిన అంశాల పై ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక సమీక్ష సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్షద్వీప్ కు ఈ రోజు న చేరుకొన్నారు. వివిధ అభివృద్ధి పథకాల కు రేపటి రోజు న ఆయన శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిస్తారు కూడాను.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘లక్షద్వీప్ యొక్క పురోగతి కి సంబంధించిన అంశాల పై జరిగిన ఒక సమీక్ష సమావేశాని కి అధ్యక్షత వహించాను. లక్షద్వీప్ యొక్క ప్రజల కు ఒక మెరుగైనటువంటి, నాణ్యమైనటువంటి జీవనాని కి పూచీ పడేందుకు గాను మా ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఈ క్రమం లో భాగం గా మౌలిక సదుపాయాల ను పెంచడం పైన, స్థానిక సంస్కృతి ని పరిరక్షించడం పైన దృష్టి ని కేంద్రీకరిస్తూ, ప్రజల సమృద్ధి కి దారి తీసేటటువంటి మార్గాల ను ఏర్పరచేందుకు పూచీ పడుతుంది.’’ అని తెలిపారు.