Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

లక్షద్వీప్‌లో లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న లక్షద్వీప్‌లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కొద్దిసేపు ముచ్చటించారు.

దీనిపై ‘ఎక్స్’ ద్వారా పోస్ట్ చేసిన సందేశంలో:

‘‘సమాజంలోని అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు చేరడంకన్నా సంతృప్తి కలిగించే విషయం మరేముంటుంది. నిన్నటి నా లక్షద్వీప్ పర్యటనలో సాగిన ఈ ఇష్టాగోష్ఠి ఇందుకు నిదర్శనం…’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే లక్షద్వీప్ ప్రగతికి ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ మేరకు ‘‘గడచిన 9 సంవత్సరాలుగా లక్షద్వీప్ పురోగమన వేగం పెంచడానికి మేమెంతో కృషి చేశాం…

దీంతో ఇవాళ మా సంకల్పం మరింత బలోపేతమైంది!’’ అని ప్రధాని పేర్కొన్నారు.

***

DS