Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ర‌ష్యా కు బయలుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తాను ర‌ష్యా లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

“ర‌ష్యా లోని స్నేహ‌శీలురైన ప్ర‌జ‌ల‌కు ఇవే శుభాకాంక్ష‌లు. రేప‌టి సోచీ ప‌ర్య‌ట‌న‌ కోసం మరియు అధ్య‌క్షులు శ్రీ పుతిన్ తో నా యొక్క భేటీ కోసం నేను ఎదురు చూస్తూ వున్నాను. ఆయ‌నను క‌లుసుకోవ‌డమంటే అది ఎప్ప‌టికీ సంతోష‌దాయ‌క‌మే.

అధ్య‌క్షులు శ్రీ పుతిన్ తో చ‌ర్చ‌లు భార‌త‌దేశానికి మ‌రియు ర‌ష్యాకు మ‌ధ్య ఉన్న‌టువంటి ప్ర‌త్యేక‌మైన మ‌రియు విశేషాధికారం క‌లిగిన వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత‌గా బ‌ల‌ప‌ర‌చ‌ గ‌లుగుతాయ‌ని నేను నమ్ముతున్నాను.”

***