Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ర‌ష్యాలో భార‌తీయ మిత్రుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీ

ర‌ష్యాలో భార‌తీయ మిత్రుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీ

ర‌ష్యాలో భార‌తీయ మిత్రుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీ

ర‌ష్యాలో భార‌తీయ మిత్రుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీ

ర‌ష్యాలో భార‌తీయ మిత్రుల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోడీ


త‌న రాక సంద‌ర్భంగా ర‌ష్యాలో ఏర్పాటు చేసిన భార‌తీయ మిత్రులు అనే కార్య‌క్ర‌మంలో భార‌త ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ,భార‌తీయ క‌ళ‌లైన సంప్ర‌దాయ‌, జాన‌ప‌ద న‌`త్యాలను ర‌ష్య‌న్ క‌ళాకారులు ప్ర‌ధాని ముందు ప్ర‌ద‌ర్శించారు. భార‌త్ –ర‌ష్యా మ‌ధ్య ఎంతో కాలంగా ఉన్న మైత్రి సంబంధాల‌ను తెలియ‌జేస్తుంది. భార‌తీయ శ్లోకాల త‌రువాత దేశ భ‌క్తి గీత‌మైన వందే మాత‌రంతో ఈ కార్య‌క్ర‌మం మొద‌లైంది. కూచిపూడి, క‌థ‌క్‌, దండియారాస్ న‌`త్యాలు ఈ కార్య‌క్ర‌మానికి హైలైట్ నిలిచాయి.మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి ర‌చించిన గీత్ న‌యా గాతాహూన్ అనే పద్యం ఆధారంగా క‌ళాకారులు న‌`త్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ర‌ష్య‌న్ క‌ళాకారుల ప్ర‌తిభ‌ను ప్ర‌ధాని శ్లాఘించారు.ర‌ష్యాలోని ఒక ముస్లిం కుటుంబానికి చెందిన క‌ళాకారుడు స‌తి కంజొనోవా, వేదాల‌ను వ‌ల్లించే పాప్ సింగ‌ర్‌ను అభినందించారు.
భార‌తీయ సంస్క్రుతీ సంప్ర‌దాయాల ప‌ట్ల ర‌ష్య‌న్లు మ‌క్కువ చూప‌డాన్నిచూస్తే త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఈద్‌-ఉల్‌-మిలాడీ, క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. డిసెంబ‌రు 25 వాజ్ పేయి జ‌న్మ‌దిన‌మ‌ని గుర్తు చేశారు.

ర‌ష్యాలో భార‌తీయ క‌ల‌ల‌కు ఎక్కువ ఆద‌ర‌ణ‌ ఉంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు చేశారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ర‌ష్యాలోని 200 ప్ర‌దేశాల‌లో పాటించార‌ని తెలిపారు. క‌ష్ట స‌మ‌యాల‌లో భార‌త్‌కు ర‌ష్యా అండ‌గా ఉంద‌ని, ఈ కార‌ణంగాగాఏ భార‌తీయ జ‌వాన్లు యుద్ధాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొని విజ‌యం సాధించార‌ని ప్ర‌ధాని ప్ర‌స్తుతించారు. భార‌త్‌-ర‌ష్యా దేశాల మ‌ధ్య‌ స్నేహ సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయిని, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌లో కూడా ర‌ష్యా భార‌త్ ను స‌మర్థించింద‌ని పేర్కొన్నార‌రు. ర‌ష్య‌న్లు భార‌త్ ప‌ర్యాట‌క కేంద్రాల‌ను సంద‌ర్వించేలా భార‌తీయ విద్యార్థులు ప్రోత్స‌హించాల‌ని సూచించారు.

ఆర్థిక రంగంలో భార‌త్ స‌త్‌ఫ‌లితాల‌ను సాధిస్తున్నందుకు ప్ర‌పంచ‌దేవాలు కొనియాడుతున్నాయ‌ని ప్ర‌ధాని అన్నారు. పలు దేశాలు భార‌త్ వైపు చూస్తున్నాయ‌ని. దేశంలో పెట్టుబ‌డుల‌ను మ‌ళ్ళించేందుకు ముందుకు వ‌స్తున్నాయిన పేర్కొన్నారు. ఇండియాను కేవ‌లం మార్కెట్ కేంద్రంగా విదేశాలు చూడ‌టం లేద‌ని, ఒక శ‌క్తివంత‌మైన నిర్మాణ హ‌బ్ గా చూస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. త‌న ర‌ష్యా ప‌ర్య‌ట‌న పూర్తిగా విజ‌య‌వంత‌మైంద‌ని, ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం అయ్యాయ‌ని భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు.