రష్యా తో 2018 వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ నాడు కుదుర్చుకున్న ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) మరియు సహకార పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒసి) తాలూకు వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి తెలియజేయడమైంది.
వీటిలో రష్యన్ ఫెడరేశన్ రవాణా మంత్రిత్వ శాఖ తో కుదుర్చుకున్న ఎంఒయు రవాణా విద్య లో సహకారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి సంబంధించింది; కాగా, జాయింట్ స్టాక్ కంపెనీ ‘రష్యన్ రైల్వేస్’ (ఆర్‌జడ్ డి) తో కుదుర్చుకున్న ఎంఒసి రైల్వే రంగం లో సాంకేతిక సహకారానికి సంబంధించింది.
ఈ ఎంఒయు/ఎంఒసి లు రైల్వేల రంగం లో తాజా పరిణామాలను, ఇంకా జ్ఞానాన్ని పంచుకొనేందుకు భారతీయ రైల్వేల కు ఒక వేదిక ను సమకూర్చుతాయి. అలాగే, ఈ ఎంఒయు/ఎంఒసి లు సాంకేతిక నిపుణుల రాక- పోక లు, నివేదిక లు మరియు సాంకేతిక దస్తావేజు పత్రాలు, శిక్షణ, ఇంకా ఎంపిక చేసిన సాంకేతిక విజ్ఞాన రంగాలు మరియు జ్ఞానాన్ని పంచుకొనేందుకు ఉద్దేశించిన సంప్రదింపుల పై దృష్టి సారిస్తూ నిర్వహించే కార్యశాల లకు/చర్చాసభ లకు మార్గాన్ని సుగమం చేస్తాయి.
రవాణా విద్య ను అభివృద్ధి పరచడం కోసం ప్రాధాన్య రంగాల లో సహకారానికి ఎంఒయు దోహద పడుతుంది. దీనితో ఈ రంగం లో నిర్దిష్ట ప్రతిపాదనల ను సిద్ధం చేసేందుకు వీలు కలుగుతుంది. ఆ ప్రతిపాదనలను ఇంటర్ గవర్నమెంటల్ రష్యన్ – ఇండియన్ కమిశన్ ఆన్ ట్రేడ్ -ఎకనామిక్, సైంటిఫిక్- టెక్నికల్ అండ్ కల్చరల్ కోఆపరేశన్ యొక్క ఫ్రేమ్ వర్క్ పరిధి లో అమలుపరచేందుకు కూడా దీని ద్వారా మార్గం ఏర్పడుతుంది.
ఎంఒసి ఈ కింద పేర్కొన్న రంగాల లో సాంకేతిక సహకారానికి అవకాశాలను ఏర్పరుస్తుంది:-
• నాగ్ పుర్ -సికిందరాబాద్ సెక్షన్ లో ప్రయాణికుల రైళ్ళ వేగాన్ని గంటకు 200 కిలో మీటర్ల (సెమీ హై స్పీడ్) వరకు పెంచడం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు లను అమలు చేయడానికి; ఈ సెక్షన్ ను భారతీయ రైల్వే (ఐఆర్) నెట్ వర్క్ లోని ఇతర దిశల కు పొడిగించే అవకాశం కూడా ఏర్పడగలదు;
• ప్రాంతీయ స్థాయి లో, డివిజనల్ రైల్వే లో మరియు / లేదా భారతీయ రైల్వేల లోని అన్ని జోనల్ రైల్వేలను కలిపే ఎగువ నెట్ వర్క్ స్థాయి లో మిశ్రిత రాక పోకల నిర్వహణ కు గాను ఒకే ట్రాఫిక్ నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది;
• విశిష్ట నిర్మాణానికి, సంయుక్త నిర్మాణానికి రంగాన్ని సిద్ధం చేయడం మరియు స్పర్ధాత్మకమైనటువంటి సిగ్నలింగ్, ఇంకా ఇంటర్ లాకింగ్ సిస్టమ్ రూపకల్పన కు అవకాశం;
• సెమీ హై స్పీడ్ మరియు అంతకన్నా ఎగువ స్థాయి కలిగివుండేటటువంటి టర్న్ అవుట్ స్విచ్ ల సరఫరా మరియు వాటిని స్థానికంగా తయారు చేయడానికి అవకాశం;
• భారతీయ రైల్వే ఉద్యోగుల కు రష్యన్ రైల్వే సంబంధిత ఉన్నత విద్య సంస్థల లో శిక్షణ ను అందించడం తో పాటు వారిలో అధునాతన అర్హతల ను మెరుగు పరచడం;
• సరకు రవాణా కార్యకలాపాల్లో ఉత్తమ పద్ధతుల అమలు; ఇంకా
• భారతదేశం లో బహుళ విధ టెర్మినల్స్ ను సంయుక్తంగా అభివృద్ధి పరచడం.