Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రోమ్ లో జ‌రుగుతున్న జి 20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మారియో డ్రాఘిని క‌లుసుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

రోమ్ లో జ‌రుగుతున్న జి 20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మారియో డ్రాఘిని క‌లుసుకున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , రోమ్‌లో జి20 శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 29 ,2021న ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి , హిజ్ ఎక్స‌లెన్సీ, మారియో డ్ర‌ఘితో స‌మావేశ‌మ‌య్యారు. వీరిరువురూ క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. జి 20 స‌మావేశాన్ని , ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయంగా కోవిడ్ మ‌హమ్మారి ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి విజ‌య‌వంతంగా జి 20 స‌మ్మేళ‌నం నిర్వ‌హించినందుకు , ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌ను అభినందించారు. గ్లాస్‌గోవ్‌లో కాప్ -26 స‌మావేశాన్ని నిర్వ‌హించ‌డంలో యుకె తో ఇట‌లీ భాగ‌స్వామ్యం వ‌హిస్తోంది.

ఇరువురు నాయ‌కులు, వాతావ‌ర‌ణ మార్పుల నుంచి ఎదురౌతున్న స‌వాళ్ల‌ను చ‌ర్చించారు. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ స‌మాజం క‌ల‌సి క‌ట్టుగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రాన్ని గురించి వారు చ‌ర్చించారు.
ఇండియా వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించి ఇండియా చేప‌ట్టిన ప‌రివ‌ర్త‌నాత్మ‌క వాతావ‌ర‌ణ చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. అలాగే అభివృద్ధి చెందిన దేశాల వాతావ‌ర‌ణ ఆర్ధిక చెల్లింపు హామీల‌కు సంబంధించిన ఆందోళ‌న గురించి కూడా ప్ర‌స్తావించారు.

ఇటీవ‌లి అంత‌ర్జాతీయ‌, ప్రాంతీయ ప‌రిణామాల‌పై ఇరువురు నాయ‌కులు త‌మ అభిప్రాయాల‌ను ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకున్నారు. ఆప్ఘ‌నిస్థాన్ , ఇండొ ప‌సిఫిక్ తో స‌హా ప‌లు అంశాలు వీరి మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఇండియా- యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య బ‌హుముఖ స‌హ‌కారానికి మ‌రింత స‌న్నిహితంగా క‌ల‌సి ప‌నిచేయాల‌ని ఇరువురు నాయ‌కులు పున‌రుద్ఘాటించారు.

ద్వైపాక్షిక అంశాల విష‌యంలో ఇరువురు నాయ‌కులు 2020 నవంబ‌ర్‌లో జరిగిన ఇండియా- ఇట‌లీ వ‌ర్చువ‌ల్ శిఖ‌రాగ్ర స‌మ్మేళ‌నం నుంచి జ‌రిగిన ప‌రిణామాల‌ను స‌మీక్షించారు. ఆ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో చేప‌ట్టిన 2020-25 కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లులో పురోగ‌తిపై ఇరువురు నాయ‌కులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ఆర్ధిక రంగాల‌లో వ్యూహాత్మ‌క ల‌క్ష్యాల‌కు సంబంధించి, అలాగే సైన్సు,టెక్నాల‌జీ, సాంస్కృతిక రంగాల‌లో రాగ‌ల ఐదు సంవ‌త్స‌రాల‌లో సాధించాల్సిన ల‌క్ష్యాల‌ను ఈ వ‌ర్చువ‌ల్ స‌మ్మిట్‌లో నిర్ణ‌యించారు.

ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమోటివ్ పునరుత్పాదక ఇంధన రంగాలలో వాణిజ్యం పెట్టుబడి సంబంధాలను మరింత విస్తరించేందుకు తమ చిత్త‌శుద్ధిని ఇరువురు నాయ‌కులు పునరుద్ఘాటించారు. పునరుత్పాదక , ప‌రిశుద్ధ ఇంధ‌నం విష‌యంలో ద్వైపాక్షిక సహకారానికి తాజా ప్రేరణను అందించడానికి ఇండియా, ఇట‌లీ ఒక సంయుక్త ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశాయి. ఇంధ‌న ప‌రివ‌ర్త‌న విష‌యంలో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి సంబంధ‌ఙంచి ఈ ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. భారీ గ్రీన్ కారిడార్ ప్రాజెక్టులు, స్మార్ట్ గ్రిడ్‌లు, ఇంధ‌న నిల్వ ప‌రిష్కారాలు, గ్యాస్ ర‌వాణా, స‌మీకృత వృధా నిర్వ‌హ‌ణ‌, ( వేస్ట్ టు వెల్త్‌), గ్రీన్ హైడ్రోజ‌న్ అభివృద్ధి, వాడ‌కం, బ‌యో ఫ్యూయ‌ల్స్ ప్ర‌మోష‌న్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇండియా , ఇట‌లీలు టెక్స్ టైల్ రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌పై ఈ స‌మావేశం సందర్భంగా సంత‌కాలు చేశారు.

ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి డ్రాఘిని ఇండియాలో అధికారికంగా ప‌ర్య‌టించేందుకు వీలైనంత త్వ‌ర‌లో రావ‌ల‌సిందిగా భార‌త ప్ర‌దాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు.