దేశంలోని రైల్వేస్టేషన్లను పునర్నిర్మాణము చేయడం వల్ల భారీ ఎత్తున ఆధునీకరణకు, రైల్వేలకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, అంతేకాక ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవడానికి వీలవుతుంది. ఇందుకోసం రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ఉన్న భూమిని, గగనతలాన్ని సరళమైన విధానాలు, దీర్ఘకాలిక అంటే దాదాపు 99 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వడమే కాక చాలామందికి సబ్ లీజుకు ఇవ్వడం వంటి మెరుగుపరచిన కార్యక్రమ డిజైన్లను అమలు చేస్తారు. దీని వల్ల దేశవ్యాప్తంగా మినీ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయడానికి , అవన్నీ కూడా మినీ స్మార్ట్ సిటీలుగా పని చేయడానికి వీలవుతుంది. రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం వల్ల కలిగే ఫలితాలు గుణకాలలో ఉంటాయి. దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగేందుకు మరియు ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణానికి భారత రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ (ఐ అర్ ఎస్ డి సి) నోడల్ ఏజెన్సీ గా మరియు ప్రధాన ప్రోజెక్ట్ అభివృద్ధి సంస్థ గా నియామకాన్ని ఆమోదించడం జరిగింది. సరళమైన విధానాలు, 99 ఏళ్ళ వరకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం ద్వారా భారీ ఎత్తున ఆధునీకరణకు మరియు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు దారితీస్తుంది.
రైల్వే స్టేషన్ల లో, ఆ చుట్టుపక్కల ఉండే స్థలాలను వాణిజ్య సరళిలో అభివృద్ధి చేయడం వల్ల రైల్వే మంత్రిత్వ శాఖపై ఆర్ధిక భారం పడకుండా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. పునర్నిర్మాణం వల్ల సమకూరే ఆదాయం, ఖర్చు సరి సమానంగా ఉండి రైల్వే శాఖపై ప్రభావం తటస్థమవుతుంది. అంతేకాక రైల్వే స్టేషను పునర్నిర్మాణం వల్ల దాని ప్రభావం భారీ మార్పులకు దోహదం చేస్తుంది అది ఆర్థిక వ్యవస్థ పై ప్రభావాన్ని చూపుతుంది ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి ఆర్థిక ప్రగతి జరుగుతుంది.
ఐఆర్ఎస్ డిసి నోడల్ ఏజెన్సీగా ఉండటం వల్ల ఒక్కో స్టేషన్ వారీగా మరియు కొన్ని స్టేషన్ల సముదాయాన్ని తీసుకుని అభివృద్ధి ప్రణాళికను తయారుచేసి అమలు చేస్తుంది. తద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ పై ఎలాంటి వ్యయ బారం లేకుండా చూస్తుంది. వాణిజ్య అభివృద్ధి, పునర్నిర్మాణ ప్రణాళికను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించిన తర్వాత ఐఆర్ఎస్ డిసి గాని , ఇతర ప్రోజెక్ట్ అభివృద్ధి సంస్థలు గాని రంగంలోకి దిగుతాయి. రైల్వే భూమికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు రైల్వే/ఆర్ఎల్ డి ఎ/ ఐ ఆర్ఎస్ డిసి సంస్థలు సాధికార సంస్థగా వ్యవహరిస్తాయి. వీరు నగర పాలిక సంస్థలు, స్థానిక సంస్థలు, ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డిడిఎ) లేక కేంద్రపాలిత సంస్థల సహకారంతో రైల్వేలు ఎలాంటి అడ్డంకులు లేకుండా భూమి వినియోగించుకోవడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తారు .
దానివల్ల రైల్వే మంత్రిత్వ శాఖ ప్రధాన స్టేషన్ల పునర్నిర్మాణము వేగవంతం చేయడానికి మొత్తం మీద వ్యయభారం తటస్థం చేసేందుకు వీలు కలుగుతుంది. దేశవ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలు ఉన్న స్మార్ట్ స్టేషన్లు ఆవిర్భావానికి వీలు కలుగుతుంది. మినీ స్టేషన్లు మినీ స్మార్ట్ సిటీస్ వలె పని చేయడానికి వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమం అమలు వల్ల రైల్వే ప్రయాణికులకు మరియు పరిశ్రమకు విస్తృత ప్రయోజనాలు కలుగుతాయి . ఈ కార్యక్రమం వల్ల జరిగే సానుకూల పరిణామాలలో రైల్వే ప్రయాణికులు అంతర్జాతీయ రైల్వే టర్మినల్స్ లలో ఉండే ప్రపంచ స్థాయి సౌకర్యాలను పొందడం మరియు స్థానికంగా చాలామందికి ఉపాధి అవకాశాలు లభించడం ఉంటాయి.
పూర్వరంగం:
దేశంలోని దేశంలోని ‘ఎ1’ మరియు ‘ఏ’ కేటగిరి రైల్వేస్టేషన్లను జోనల్ రైల్వే ల ద్వారా పునరాభివృద్ధి చేయడానికి 2015 జూన్ 24వ తేదీన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం జరిగింది. అయితే అప్పుడు లీజు కాలాన్ని 45 సంవత్సరాలకు పరిమితం చేయడం వల్ల బిడ్డర్లు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత డెవలపర్లు, పెట్టుబడిదారులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో జరిపిన సమావేశాలలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిలో సబ్ లీజుకు ఇవ్వడం, తదితర సులభతరమైన విధానాల గురించి తరచుగా ప్రస్తావించడం జరిగింది. ఫలితంగా ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన ఏజెన్సీ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. దాని ఫలితమే ఐఆర్ఎస్ డి సి కి అప్పగించడం. ఇందుకోసం కార్యక్రమంలో నిర్మాణాత్మక మార్పులు, ప్రక్రియ అమలులో సమూల మార్పులు చేస్తూ కార్యనిర్వహణ బాధ్యతను ఐ అర్ ఎస్ డి సి ఏజెన్సీకి అప్పగించాలని ప్రతిపాదించడం జరిగింది.