అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు (ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజుల వేతనం తో సమానమైనటువంటి ఉత్పత్తి తో ముడిపడ్డ బోనస్ (పిఎల్‌బి) చెల్లింపు నకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పిఎల్‌బి చెల్లింపు తాలూకు వ్యయం 2044.31 కోట్ల రూపాయల మేరకు ఉండవచ్చని అంచనా. అర్హులైన నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు పిఎల్‌బి చెల్లింపునకై నిర్దేశించినటువంటి వేతన గణన గరిష్ఠ పరిమితి నెలకు 7000 రూపాయలు గా ఉంది. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగి కి ప్రతి ఒక్కరికి 78 రోజుల కు గాను గరిష్ఠం గా చెల్లించే సొమ్ము 17,951 రూపాయలు గా ఉంది. ఈ నిర్ణయం ఫలితం గా దాదాపు 11.91 లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
యావత్తు దేశం లో పని చేస్తున్న నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు అందరికీ (ఆర్‌పిఎఫ్/ఆర్‌పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) రైల్వేల లో ఉత్పత్తి తో ముడిపడ్డ బోనస్ వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం దసరా/పూజ సెలవు దినాల కు ముందు అర్హత కలిగిన రైల్వే ఉద్యోగుల కు పిఎల్‌బి చెల్లింపు జరుగుతుంది. మంత్రివర్గం నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా సెలవుల కన్నా ముందే అమలుపరచవలసివుంటుంది. 2017-18 సంవత్సరం లో 78 రోజుల వేతనానికి సమానమైన పిఎల్‌బి ని చెల్లించడం జరుగుతుంది. తద్వారా రైల్వేల పని తీరును మెరుగుపరచే దిశగా ఉద్యోగులలో ప్రేరణ ను రగిలించవచ్చునని ఆశిస్తున్నారు.
పూర్వరంగం:
1979-80 సంవత్సరం లో పిఎల్‌బి ని ప్రారంభించిన భారత ప్రభుత్వ తొలి సంస్థ అనే ఖ్యాతి రైల్వేల కు దక్కింది. అప్పట్లో ఆర్థిక వ్యవస్థ మొత్తంమీది పని తీరు కు మౌలిక మద్ధతును అందించేది గా రైల్వేలు ఓ ముఖ్య భూమిక ను వహిస్తున్నాయని తలపోయడమైంది. ‘1965 నాటి బోనస్ చెల్లింపు చట్టం’ కోవ లో బోనస్ అనే భావన కు బదులు పిఎల్‌బి అనే భావన ను పరిచయం చేయడం వాంఛనీయమని భావించడం జరిగింది.