ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్‌ను ప్రకటించింది.
ఆ పధకం సమీక్ష, కేబినెట్ ఆమోదం ఆధారంగా పిఎల్‌బి పధకం ప్రధాన లక్షణాలు ఇలా ఉన్నాయి…
ఎ) ఏడాదిలో సాధించిన నికర టన్ను కిలోమీటర్ల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తారు.
i) నికర టన్ను కిలోమీటర్లకు ఆర్జించిన మొత్తం ఆదాయం
ii) నాన్ సబర్బన్ ప్రయాణికుల దూరం కిలోమీటర్లను 0.076 వంతున లెక్కింపు.
iii) సబర్బన్ ప్రయాణికుల దూరం కిలోమీటర్లను 0.053 వంతున లెక్కింపు.
బి) నాన్ గెజిటెడ్ స్టాఫ్ బలాన్ని (ఆర్‌పిఎఫ్/ఆరనపిఎస్ఎఫ్ మినహా) మూలధనం పెరుగుదల/ తరుగుదల (మూడు సంవత్సరాల సగటు) ఆధారంగా లెక్కిస్తారు. రైళ్ళ ప్రయాణ దూరం ఆధారంగా మూలధన వృధ్ధిని మదింపు చేస్తారు. ట్రాక్టివ్ ఎఫర్ట్ 0.50, వ్యాగన్ సామర్థ్యాన్ని
0.20, సీటింగ్ సామర్థ్యాన్ని 0.30గా లెక్క కడతారు. కార్మికుల ఉత్పత్తిని (నాన్ గెజిటెడ్ ఉద్యోగుల శక్తి) పెరిగిన మూలధనం ఆధారంగా లెక్క కడతారు.
2010-11, 2011-12, 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాల్లో గరిష్ఠ పిఎల్‌బి 78 రోజుల వేతనాన్ని చెల్లించారు. భవిష్యత్తులో కూడా ఉద్యోగులు చక్కని పనితీరు ప్రదర్శించి ఆర్థికంగా మెరుగైన రాబడులు అందించేందుకు ఈ ఏడాది కూడా చక్కని పనితీరు
ఆధారంగా అదే 78 రోజుల పిఎల్‌బి అందించాలని నిర్ణయించారు.
రైల్వే శాఖపై ఉద్యోగులకు 78 రోజుల పిఎల్‌బిగా చెల్లిస్తున్న బోనస్ భారం 1030.02 కోట్ల రూపాయలని అంచనా. పిఎల్‌బి కోసం వేతనాల లెక్కింపును నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు నెలకి 3500 రూపాయలుగా నిర్ణయించారు. 78 రోజుల వేతనం కింద అర్హులైన రైల్వే
ఉద్యోగులకు 8975 రూపాయలు అందుతుంది.
ఈ నిర్ణయం వల్ల 12.58 లక్షల నాన్ గెజిటెడ్ ఉద్యోగులు లాభపడతారు.
దేశవ్యాప్తంగా పని చేస్తున్న నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ (ఆర్‌పిఎఫ్/ఆర తపిఎస్ఎఫ్ మినహా) ఈ ఉత్పాదకత ఆధారిత బోనస్ వర్తిస్తుంది.
నేపథ్యం:
2015 అక్టోబర్‌లో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం 2014-15 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ (ఆర్‌పిఎఫ్/ఆరసపిఎఫ్ మినహా) 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్ (పిఎల్‌బి) చెల్లించాలని నిర్ణయించింది.
The Union Cabinet chaired by the Prime Minister ShriNarendraModi, has approved the Production Linked Bonus for Railway Employees.
— PMO India (@PMOIndia) October 7, 2015