Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రైతుల సంక్షేమాన్ని మరింత పెంచడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది: ప్రధానమంత్రి


నూతన సంవత్సరం 2025లో నిర్వహించిన మొట్టమొదటి మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాల్ని తీసుకున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, రైతులకు మరింతగా మంచి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఈ కింది విధంగా రాశారు:

‘‘మా ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. మన దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి ఆరుగాలం కష్టపడుతున్న మన రైతు సోదరులను, మన రైతు సోదరీమణులను చూసుకొని మనమందరం గర్విస్తున్నాం. కొత్త సంవత్సరం 2025లో నిర్వహించిన మొట్టమొదటి మంత్రిమండలి సమావేశాన్ని, మన కిసానుల సమృద్ధిని పెంపొందింపచేయడానికి అంకితం చేశాం. ఈ విషయంలో ప్రధాన నిర్ణయాల్ని తీసుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను’’.