రైతుల జీవనం.. జీవనోపాధి మెరుగు దిశగా రూ.13,966 కోట్ల అంచనా వ్యయంతో 7 కీలక పథకాలకు మంత్రిమండలి ఆమోదం
02 Sep, 2024
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఇవాళ రైతుల జీవనం, జీవనోపాధి మెరుగు దిశగా రూ.13,966 కోట్ల అంచనా వ్యయంతో 7 కీలక పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
1. డిజిటల్ వ్యవసాయ కార్యక్రమం: సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల పునాది ఆధారంగా రైతుల జీవితాల మెరుగుదలకు రూ.2.817 కోట్ల వ్యయంతో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా డిజిటల్ వ్యవసాయ కార్యక్రమం అమలవుతుంది. ఇందులో రెండు మూలస్తంభాలున్నాయి.
1. అగ్రిశ్టాక్ (ప్రభుత్వ-ప్రైవేటు వ్యవసాయ భాగస్వామ్యం)
ఎ. ఫార్మర్స్ రిజిస్ట్రీ
బి. గ్రామీణ భూకమతాల మ్యాపుల రిజిస్ట్రీ
సి. సాగుచేసే పంటల రిజిస్ట్రీ
2. వ్యవసాయ నిర్ణయాల మద్దతు వ్యవస్థ
ఎ. భౌగోళిక-ప్రాదేశిక సమాచార నిధి
బి. కరవు/వరదల పర్యవేక్షణ
సి. వాతావరణం/ఉపగ్రహ సమాచార నిధి
డి. భూగర్భజల/నీటి లభ్యత సమాచార నిధి
ఇ. పంట దిగుబడి, బీమా నమూనాల రూపకల్పన
ఈ కార్యక్రమంలో కింది అంశాలు కూడా ఉంటాయి:
· భూమి స్వరూపస్వభావాలు
· పంటలపై డిజిటల్ అంచనా
· పంట దిగుబడి డిజిటల్ నమూనా
· పంట రుణం కోసం అనుసంధానం
· కృత్రమి మేధ (ఎఐ), బిగ్ డేటా వంటి ఆధునిక సాంకేతికతలు
· కొనుగోలుదారులతో అనుసంధానం
· మొబైల్ ఫోన్‌ల ద్వారా కొత్త పరిజ్ఞాన పరిచయం
2.ఆహార-పౌష్టిక భద్రత దిశగా పంటల విజ్ఞానం: ఈ కార్యక్రమం రూ.3,979 కోట్ల వ్యయంతో అమలు కానుండగా, వాతావరణ ఒడుదొడుకులను తట్టుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తుంది. దేశంలో 2047 నాటికి ఆహార భద్రత లక్ష్యంగా దీనికి కింది అంశాలు మూలస్తంభాలుగా ఉంటాయి.
1. పరిశోధన – అవగాహన
2. మొక్కల జన్యు వనరుల నిర్వహణ
3. ఆహార, పశుగ్రాస పంటల దిశగా జన్యు మెరుగుదల
4. పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మెరుగుదల
5. వాణిజ్య పంటల మెరుగుదల
6. కీటకాలు, సూక్ష్మజీవులు, పరాగ సంపర్క జీవులు వగైరాలపై పరిశోధన
3.వ్యవసాయ విద్య-యాజమాన్యం-సామాజిక శాస్త్రాల బలోపేతం: మొత్తం రూ.2,291 కోట్ల వ్యయంతో అమలయ్యే ఈ కార్యక్రమం కింద ప్రస్తుత సవాళ్లకు ఎదుర్కొనగలిగేలా వ్యవసాయ విద్యార్థులు, పరిశోధకులను సిద్ధం చేస్తారు. ఇందులో కింది అంశాలు మూలస్తంభాలుగా ఉంటాయి
1. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) పర్యవేక్షణ
2. వ్యవసాయ విద్య-పరిశోధనల ఆధునికీకరణ
3. కొత్త విద్యావిధానం-2020కి అనుగుణంగా అమలు
4. డిజిటిల్ డిపిఐ, ఎఐ, బిగ్ డేటా, రిమోట్ తదితర అత్యాధునిక సాంకేతికతల వినియోగం
5. ప్రకృతి వ్యవసాయం, వాతావరణ ప్రతిరోధకతలూ అంతర్భాగం.
4. పశుగణ సుస్థిర ఆరోగ్యం-ప్రజననం: మొత్తం రూ.1,702 కోట్ల వ్యయంతో పశుపోషణ, పాడి పరిశ్రమ ద్వారా రైతుల ఆదాయం పెంచడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో కింది అంశాలు మూలస్తంభాలుగా ఉంటాయి.
1. పశుగణ ఆరోగ్య నిర్వహణ, పశువైద్య విద్య
2. పాడి ఉత్పాదన – సాంకేతికతల అభివృద్ధి
3. పశుగణ జన్యు వనరుల నిర్వహణ, ప్రజననం, మెరుగుదల
4. జంతు పౌష్టికత, నెమరువేసే చిన్న జంతువుల ఉత్పత్తి-అభివృద్ధి
5. ఉద్యాన సాగు సుస్థిర ప్రగతి: మొత్తం రూ.860 కోట్ల వ్యయంతో ఉద్యాన పంటల సాగు ద్వారా రైతు ఆదాయం పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందులో కింది అంశాలు మూలస్తంభాలుగా ఉంటాయి.
1. ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ఉద్యాన పంటలు
2. వేరుదుంప, గడ్డ దుంప, గుండ్రని దుంప, తక్కువ నీటితో పండే పంటలు
3. కూరగాయలు-పూల సాగు, పుట్టగొడుగుల పెంపకం
4. తోటలు, సుగంధ ద్రవ్యాల సాగు, పరిమళ మొక్కల పెంపకం
అభివృద్ధి
6. వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల బలోపేతం: మొత్తం రూ.1,202 కోట్లతో ఈ కార్యక్రమం అమలు చేస్తారు.
7.సహజ వనరుల నిర్వహణ: మొత్తం రూ.1,115 కోట్లతో ఈ కార్యక్రమం అమలవుతుంది.