న్యూదిల్లీలోని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రైతులకు యూరియా రాయితీ కోసం రూ.10 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో రూ.3000 ధర ఉన్న యూరియాను రైతులకు రూ.300 చొప్పున, అతి తక్కువ ధరకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లను యూరియా రాయితీగా కేటాయించిందని వెల్లడించారు.
“కొన్ని ప్రపంచ దేశాల్లో రూ.3,000కు విక్రయించే యూరియా బస్తాను రూ.300 ధరకు మించకుండా మన రైతులకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇందుకోసం యూరియాపై రూ.10 లక్షల కోట్ల రాయితీని అందిస్తోంది” అని ప్రధాన మంత్రి ఎర్రకోట పైనుంచి చెప్పారు.
****
गरीबों को यूरिया सस्ता मिले, इसलिए सरकार 10 लाख करोड़ रुपये मेरे किसानों को यूरिया में सब्सिडी दे रही है : PM @NarendraModi जी pic.twitter.com/rMhVbz8We9
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) August 15, 2023