Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు (మార్చి 5) ‘ఉద్యోగాలు’ అన్న అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొననున్న ప్రధాని


ఉద్యోగాల అంశంపై బుధవారం మార్చి 5న మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో జరిగే బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారుప్రజలుఆర్థిక వ్యవస్థఆవిష్కరణల్లో పెట్టుబడులు ఈ వెబినార్ లో కీలక ఇతివృత్తాలుగా ఉన్నాయిఈ సందర్భంగా సమావేశాన్నుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది.

ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధానమంత్రి సంకల్పానికి అనుగుణంగా ఉద్యోగ వృద్ధిని ప్రోత్సహించడానికిఎక్కువ ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ వెబినార్ ప్రభుత్వంపరిశ్రమలువిద్యావేత్తలుపౌరుల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. విప్లవాత్మకమైన మార్పులనుద్దేశించిన బడ్జెట్ ప్రకటనల నుంచి సమర్థవంతమైన ఫలితాలను సాధించడానికి దోహదపడే చర్చలను ప్రోత్సహిస్తుందిప్రజలను సాధికారులను చేయడంఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంఆవిష్కరణలను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందిసాంకేతికతఇతర రంగాలకు నేతృత్వం వహించేలా, 2047 నాటికి వికసిత భారత్ సాకారమయ్యే దిశగా నిపుణులైనసమర్థవంతులైన శ్రామిక శక్తి కృషి చేసేలా సుస్థిరసమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయడం ఈ చర్చల లక్ష్యం.  

 

***