ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రేపు జమ్మూ కశ్మీర్ లో పర్యటించనున్నారు.
శ్రీనగర్ షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మాట్లాడతారు.
450 మెగావాట్ల బగ్లిహార్ హైడ్రో ఎలక్ర్టిక్ ప్రాజెక్ట్ రెండో దశను ప్రధాని ప్రారంభిస్తారు. రాంబన్ లోని చందర్ కోటెలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాన రహదారి 44లో భాగమైన ఉధమ్ పూర్-రాంబన్, రాంబన్-బనిహాల్ ల మధ్యన నిర్మించబోయే రహదారులకోసం శంకుస్థాపన చేస్తారు. ఇవి నాలుగు రోడ్ల రహదారులు. ఇక్కడ కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు.
Tomorrow I will visit J&K. Shall address a public meeting & lay foundation stone for development projects. https://t.co/Vv4YtbDB6r
— Narendra Modi (@narendramodi) November 6, 2015