దేశ మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినంగా ( రాష్ట్రీయ ఏక్ తా దివస్) గా పరిగణించి దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న ఉత్సవాలు జరుపుకోనున్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉదయం7.30 గంటలకు న్యూఢిల్లీ, పార్లమెంటు వీధిలోని సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు.
ఆ తర్వాత ఆయన రాజ్‌పథ్ దగ్గర ఏర్పాటైనై ఐక్యతా పరుగు కార్యక్రమం దగ్గర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినవారి చేత ప్రధాని శ్రీ మోదీ స్వయంగా ఐక్యతా ప్రతిజ్ఞ చేయిస్తారు.
ఉదయం 8.15 నిమిషాలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జెండా ఊపి విజయ్ చౌక్ తోట దగ్గర ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో ఎవరైనా సరే స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశముంది.
జాతీయ ఐక్యతా దినం సందర్భంగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని దేశంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రోజే (అక్టోబర్ 30న) చేపట్టారు. సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాలు దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో జరిగే ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు.
Tomorrow, on Rashtriya Ekta Diwas, India will run for unity! https://t.co/bVvF4qsuks
— Narendra Modi (@narendramodi) October 30, 2015