Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు చండీగ‌ఢ్‌, ఉత్త‌రాఖండ్ లో ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న‌


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు చండీగ‌ఢ్ లో ప‌ర్య‌టిస్తారు. చండీగ‌ఢ్ విమానాశ్ర‌యంలో నూత‌న పౌర విమాన ట‌ర్మిన‌ల్‌ను ఆయ‌న ప్రారంభిస్తారు. పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, రీసెర్చ్ 34వ స్నాతకోత్స‌వంలో పాల్గొంటారు.

చండీగ‌ఢ్‌లో నూత‌న గృహ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు. అనంత‌రం సెక్ట‌ర్ -25లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు.

అదే రోజు సాయంత్రం ఉత్త‌రాఖండ్‌లోని స్వామి ద‌యానంద స‌ర‌స్వ‌తి ఆశ్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శిస్తారు.