Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపటి నుండి పార్ల‌మెంటు శీత‌కాల స‌మావేశాలు ఆరంభ‌మ‌వుతుండగా అంత‌ క‌న్నా ముందు జరిగిన అఖిల ప‌క్ష నాయ‌కుల స‌మావేశాని కి హాజరైన ప్ర‌ధాన మంత్రి


రాజ్య స‌భ యొక్క 250వ స‌మావేశాల కు నాంది ప‌లుకుతూ ఉండ‌టం వ‌ల్ల పార్ల‌మెంటు తాలూకు ఈ స‌మావేశాలు ఒక ప్ర‌త్యేక సంద‌ర్భం గా ఉంటాయన్న ప్ర‌ధాన మంత్రి

 
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో జ‌రిగిన అఖిల ప‌క్ష నాయ‌కుల స‌మావేశాని కి హాజ‌ర‌య్యారు.  ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలన్నిటి నేత‌ లు ఈ సమావేశం లో పాలు పంచుకొని, రాబోయే పార్ల‌మెంట్ స‌మావేశాల ప‌ట్ల వారి యొక్క అభిప్రాయాల ను వెల్ల‌డించారు.

ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, పార్లమెంట్ యొక్క ఈ స‌మావేశాలు ఒక ప్ర‌త్యేక ఘ‌ట్ట‌ం అని, రాజ్య స‌భ యొక్క 250వ స‌మావేశాలు దీని లో భాగం గా జ‌రుగుతూ ఉండ‌ట‌మే దీని కి కారణమన్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్కరించుకొని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల ను మరియు కార్యకలాపాల ను నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న‌ట్లు కూడా ఆయన తెలిపారు.  ఎగువ స‌భ యొక్క 250వ స‌మావేశాలు భార‌త రాజ్యాంగ‌ం తో పాటు భార‌త‌దేశపు పార్ల‌మెంట్ విశిష్ట బ‌లాల ను నొక్కి వ‌క్కాణించే ఒక విశిష్టమైనటువంటి అవ‌కాశాన్ని ప్రసాదించడం తో పాటు భార‌త‌దేశం వంటి ఒక వైవిధ్య‌భ‌రిత దేశం లో పాల‌క సంస్థ‌ల కోసం ఒక అతి మహత్వపూర్ణమైన రూపురేఖల ను కూడా అందిస్తాయని ఆయ‌న చెప్పారు.  భార‌త‌దేశం జాతి పిత గాంధీ మహాత్ముని 150వ జ‌యంతి ని జ‌రుపుకొంటున్న ఘ‌డియ‌ లు సైతం ఈ స‌మావేశాల కు ఒక చ‌క్క‌ని నేప‌థ్యాన్ని సంత‌రిస్తున్నాయ‌ని, ఈ కారణం గా ఈ సమావేశాలు అపూర్వమైనటువంటివి మరియు విశేషమైనటువంటివి గా మారగలవని ప్రధాన మంత్రి వివరించారు.

వివిధ రాజ‌కీయ ప‌క్షాల ప్ర‌తినిధులు ప్ర‌స్తావించిన విశేష అంశాల ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి ప్ర‌తిస్పందిస్తూ, ప‌రిశీల‌న లో ఉన్న చ‌ట్టాల స‌త్వ‌ర ప‌రిష్కారాని కి ప్ర‌భుత్వం అన్ని ప‌క్షాల తో క‌ల‌సి ఒక నిర్మాణాత్మ‌క‌మైన రీతి లో కృషి చేస్తుంద‌న్నారు. తద్వారా నిలిచివున్న బిల్లుల కు సత్వర పరిష్కారం లభించగలదని, అంతే కాకుండా వ్యవసాయ రంగం, రైతులు, మ‌హిళ ల హ‌క్కు లు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, కాలుష్యం, ఇంకా ప‌ర్యావ‌ర‌ణాని కి సంబంధించిన విషయాలు, యువ‌త కు, సమాజం లో ఆద‌ర‌ణ కు నోచుకోని వ‌ర్గాల కు సంబంధించిన ప్రత్యేక అంశాల పట్ల పాలన పరమైనటువంటి రూపు రేఖల ను సైతం సిద్ధం చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ గ‌త స‌మావేశాల ను శాంతియుతం గా నిర్వ‌హించినందుకు గాను ఉభ‌య స‌భ‌ ల అధ్యక్ష స్థానాల లో అసీనులైన వారి కి ప్ర‌ధాన మంత్రి అభినందన లు తెలిపారు.  దీని తో ప్ర‌భుత్వం యొక్క శాస‌న సంబంధిత విభాగం ప‌ని చేసే తీరు ప‌ట్ల ప్ర‌జ‌ల లో ఒక స‌కారాత్మ‌కమైన‌టువంటి ప్ర‌భావాన్ని ఏర్ప‌ర‌చ‌డం లో తోడ్పాటు లభించినట్లయిందని ఆయ‌న అన్నారు.  ఈ సంద‌ర్భం లో వివిధ అంశాల పై జరిగిన చర్చ లో పార్ల‌మెంట్ కు ఒక‌టో సారి ఎన్నికైన స‌భ్యు లు ఉత్సాహం గా పంచుకోవ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌త్యేకం గా ప్ర‌స్తావించారు.  అధికార పక్ష సభ్యుల కు మ‌రియు ప్ర‌తిప‌క్షాల కు చెందిన స‌భ్యుల కు మ‌ధ్య బంధం నిర్మాణాత్మ‌క‌మైంది గా ఉంటే వర్తమాన స‌మావేశాలు కూడా సఫలమై, లాభదాయకం గా ముగుస్తాయనే ఆశాభావాన్ని కూడా ప్ర‌ధాన మంత్రి వ్యక్తం చేశారు.

***