Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రెండు సార్లు పన్ను విధింపు నివారణకు, ప్రభుత్వ కోశ సంబంధి ఎగ‌వేత‌ నివారణకు భార‌త‌దేశం, సైప్ర‌స్ ల మ‌ధ్య‌ ఒప్పందానికి, ఒడంబడికల ప్రాథమిక పత్రానికి మంత్రిమండలి ఆమోదం


ప‌న్నుల ఎగ‌వేత‌కు , “రౌండ్ ట్రిప్పింగ్‌”, “బేస్ ఇరోషన్ / ప్రాఫిట్ షిప్టింగ్” ల‌కు వ్య‌తిరేకంగా భారతదేశం తాను చేస్తున్న పోరాటంలో ఈ రోజు మరొక ముఖ్య‌మైన అడుగును వేసింది. ఆదాయంపై పన్నులకు సంబంధించి అవాయిడెన్స్ ఆఫ్ డ‌బుల్ టాక్సేష‌న్‌ అండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ఫిస్కల్ ఇవేజన్ కోసం భార‌త‌దేశం, సైప్ర‌స్ ల మ‌ధ్య‌ ఒక అగ్రిమెంట్ అండ్ ప్రోటోకాల్ పై సంత‌కాలు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

మారిష‌స్ దేశంతో ఉన్న ద్వంద్వ పన్ను విదానం నివారక ఒప్పందంలో ఇటీవల సవరణ చేసిన అనంతరం ఈ చర్యను తీసుకున్నారు. మారిష‌న్ తో ఒప్పందం మాదిరిగానే ,సైప్ర‌స్ తో ఒప్పందం కూడా మూలధన లాభాలకు సంబంధించి నివాస ఆధార ప‌న్ను పద్ధతికి ఆస్కారం కల్పించింది. ఒప్పందంలో సవరణను మంత్రిమండలి ఆమోదించినందున సైప్ర‌స్ నివాసంగా గ‌ల ఎన్ టిటీలకు భార‌త‌దేశంలో మూలధన లాభాలపై ప‌న్నును విధించడం జ‌రుగుతుంది. ఫలితంగా ద్వంద్వ ప‌న్నుల‌కు తావు ఉండ‌దు. దీనినే మ‌రికొన్ని మాట‌లలో చెప్పాలంటే, భార‌త‌దేశంలో స‌మ‌కూరే మూలధన లాభాల‌పైన ప‌న్నును విధించే హ‌క్కు భార‌త‌దేశానికి లభిస్తుంది. అయితే గ‌తంలో నివాస‌ ఆధారిత ప‌న్నుకు సంబంధించిన‌ ఒప్పందంలోని అంశాల ప్ర‌కారం చూస్తే ఇలా ఉండేది కాదు. ప‌న్నులు ఎగ్గొట్ట‌డానికి పెట్టుబ‌డుల‌ను వాటి అస‌లు దేశంనుంచి త‌ప్పించి కృత్రిమంగా దారి మ‌ర‌ల్చే వారు. మారిష‌స్ విష‌యంలో ప్ర‌స్త‌ుత ఒప్పందం ప్ర‌కారం అలాంటి చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డుతుంది. ఇటువంటి మార్పుల‌ కోసమే సింగ‌పూర్ తోనూ సంప్రదింపులు కొన‌సాగుతున్నాయి.

***