Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రూ. 34,300 కోట్లతో ఏడేళ్ల కాలానికి ‘జాతీయ కీలక ఖనిజాల మిషన్’ను ఆమోదించిన క్యాబినెట్..


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రూ. 16,300 కోట్ల వ్యయంతో జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్ సీఎంఎం)ను ప్రారంభించడానికి ఆమోదం తెలిపిందిప్రభుత్వ రంగం.. మరి ఇతర సంస్థల ద్వారా రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.

ఆత్మనిర్భర భారత్ లో భాగంగా.. ఉన్నత సాంకేతిక పరిశ్రమలుహరిత ఇంధనంరక్షణ రంగాల్లో ఈ ఖనిజాల అనివార్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజాల రంగంలో సవాళ్ల పరిష్కారం కోసం రెండేళ్లుగా వివిధ కార్యక్రమాలను చేపట్టింది.

కీలక ఖనిజాల రంగంలో భారత్ స్వావలంబన సాధించడం కోసం ఒక ప్రభావవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందిదీనికి అనుగుణంగా గతేడాది జూలై 23న కేంద్ర బడ్జెట్ లో కీలక ఖనిజాల మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ఖనిజాన్వేషణతవ్వకంమలినాల తొలగింపుశుద్ధికాలం చెల్లిన ఉత్పత్తుల పునరుద్ధరణ సహా విలువ ఆధారిత వ్యవస్థలోని అన్ని దశలూ కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కీలక ఖనిజాల మిషన్ లో ఉంటాయిదేశంలోనుతీరప్రాంతాల్లోనూ కీలక ఖనిజాల అన్వేషణను ఈ మిషన్ ముమ్మరం చేస్తుందిఆయా ఖనిజాల మైనింగ్ ప్రాజెక్టుల నియంత్రణా పరమైన ఆమోద ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడడం దీని లక్ష్యంఅంతేకాకుండా కీలక ఖనిజాల అన్వేషణకు ఈ మిషన్ ఆర్థిక ప్రోత్సాహకాలనూ అందిస్తుందితద్వారా ఖనిజాలకు సంబంధించి అధిక వ్యయంవ్యర్థాల భారాన్ని తగ్గించేలా ప్రోత్సహిస్తుంది.

కీలక ఖనిజాలకు సంబంధించి విదేశీ ఆస్తులను సమకూర్చుకునిఆ వనరులు సమృద్ధంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకునేలా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలుప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యందేశంలో కీలక ఖనిజాల నిల్వ సదుపాయాలను పెంపొందించాలని కూడా ఇది ప్రతిపాదిస్తుంది.

కీలక ఖనిజాలకు సంబంధించి ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకువాటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నిబంధనలు కూడా ఈ మిషన్ లో ఉన్నాయికీలక ఖనిజ సాంకేతికతలో పరిశోధనను ప్రోత్సహించడంతోపాటు అత్యున్నత కేంద్రాన్ని (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ఏర్పాటు చేయాలని కూడా ఇది ప్రతిపాదిస్తుంది.

అన్ని ప్రభుత్వ సంస్థలనూ ఇందులో భాగం చేస్తూ.. సంబంధిత మంత్రిత్వ శాఖలుప్రభుత్వ రంగ సంస్థలుప్రైవేటు కంపెనీలుపరిశోధన సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ మిషన్ లక్ష్యాలను సాధిస్తుంది.

1957 నాటి గనులుఖనిజాల (అభివృద్ధినియంత్రణచట్టాన్ని 2023లో సవరించి కీలక ఖనిజాల అన్వేషణవెలికితీతను పెంచారుఅనంతరం గనుల మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక ఖనిజాలకు చెందిన 24 బ్లాకులను వేలం వేసిందిఅంతేకాకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐగత మూడేళ్లలో 368 కీలక ఖనిజాన్వేషణ ప్రాజెక్టులను చేపట్టిందిప్రస్తుతం 2024-25లో 195 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిజిఎస్ఐ వివిధ కీలకమైన ఖనిజాల కోసం 227 ప్రాజెక్టులను చేపట్టబోతోందిఆవిష్కరణలను పెంపొందించడం కోసం ‘సైన్స్ అండ్ టెక్నాలజీ – అంకుర సంస్థలుఎంఎస్ఎంఈలలో పరిశోధనఆవిష్కరణలకు ప్రోత్సాహం (ఎస్ అండ్ టీ ప్రిజంకార్యక్రమాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ 2023లో ప్రారంభించిందితద్వారా అంకుర సంస్థలుఎంఎస్ఎంఈలకు నిధులందించి పరిశోధన – అభివృద్ధి అంశాల్లోనువాణిజ్యీకరణలోనూ అంతరాలను తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందిఅంతేకాకుండా గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ అయిన కబిల్ అర్జెంటీనాలోని కాటమార్కా ప్రావిన్స్ లో లిథియం అన్వేషణవెలికితీత  కోసం దాదాపు 15703 హెక్టార్ల విస్తీర్ణంలో స్థలాన్ని సమకూర్చుకుందిఇప్పటికే 2024-25 కేంద్ర బడ్జెట్ లో అనేక కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం తొలగించిందిదీనివల్ల దేశంలో కీలక ఖనిజాల లభ్యత పెరగడమే కాకుండాదేశంలో ప్రాసెసింగ్ సదుపాయాల ఏర్పాటు దిశగా పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందిఈ కార్యక్రమాలు కీలక ఖనిజాలను పొందడంపట్ల భారత నిబద్ధతను చాటుతాయి.  

 

***