దేశం లో రూపే డెబిట్ కార్డుల వినియోగాన్ని, తక్కువ విలువ తో కూడిన (2,000 రూపాయల వరకు ఉండే) బిహెచ్ఐఎమ్-యుపిఐ లావాదేవీల ను ( పర్సన్-టు-మర్చంట్ [పి2ఎమ్] ) పెంచడం కోసం ఉద్దేశించినటువంటి ఒక ప్రోత్సాహక పథకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ పథకం లో భాగం గా ప్రభుత్వం ద్వారా డబ్బు ను పొందే బ్యాంకుల కు రూపే డెబిట్ కార్డులు, ఇంకా తక్కువ విలువ తో కూడినటువంటి బిహెచ్ఐఎమ్-యుపిఐ మాధ్యమం లో జరిపిన లావాదేవీల విలువ (పి2ఎమ్) లో కొంత శాతాన్ని ప్రభుత్వం ప్రోత్సాహకం వలె అందజేసి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పథకం లో 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తించే ఒక సంవత్సర కాలాని కి గాను అంచనా ఆర్థిక వ్యయం దాదాపు 1,300 కోట్ల రూపాయలు గా ఉంది.
ప్రభుత్వం నుంచి డబ్బు గడించే బ్యాంకుల కు పటిష్టమైనటువంటి డిజిటల్ పేమెంట్ ఇకో-సిస్టమ్ ను నిర్మించడానికి మరియు రూపే డెబిట్ కార్డు, ఇంకా భీమ్- యుపిఐ తరహా డిజిటల్ లావాదేవీ ల ను అన్ని రంగాలలోను, జనాభా లోని విభాగాలలోను ప్రేరణ ను నింపేందుకు, దేశం లో డిజిటల్ చెల్లింపులను బలపరచేందుకు ఈ పథకం సాయాన్ని అందించనుంది.
సాంప్రదాయక బ్యాంకింగ్ వ్యవస్థ కు మరియు ఆర్థిక వ్యవస్థ కు వెలుపల ఉండిపోయినటువంటి వర్గాల వారికి, బ్యాంకింగ్ తాలూకు సౌకర్యాల కు నోచుకోని అటువంటి వర్గాల వారికి డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగే చెల్లింపు పద్ధతుల ను అందుబాటు లోకి తీసుకు రావడం లో సైతం ఈ పథకం సహాయకారి కానుంది.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లో అత్యంత నిపుణత కలిగిన చెల్లింపు ల వ్యవస్థ ఉన్నటువంటి దేశాల లో ఒక దేశం గా ఉన్నది. ఈ వికాసం భారత ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మరియు డిజిటల్ పేమెంట్ ఇకో-సిస్టమ్ లో భూమిక కలిగిన వివిధ సంస్థలు తెచ్చిన నూతన ఆవిష్కరణ ల పర్యవసానమే అని చెప్పాలి. ఈ పథకం ఫిన్-టెక్ స్పేస్ లో పరిశోధన మరియు అభివృద్ధి, నూతన ఆవిష్కరణ లు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. దీనితో పాటు గా, ప్రభుత్వానికి దేశం లోని విభిన్న విభాగాల లో డిజిటల్ చెల్లింపుల ను మరింత బలవత్తరం గా మలచడం లో కూడాను సాయపడనుంది.
పూర్వరంగం:
దేశం లో డిజిటల్ లావాదేవీల కు మరింత ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వం చేసినటువంటి బడ్జెట్ ప్రకటనల కు (2021-22 ఆర్థిక సంవత్సరాని కి గాను) అనుగుణం గా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది.
***