రీవా అల్ట్రా మెగా సోలర్ పావర్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అంకితం చేశారు. ఇది ఆసియా లో అతి పెద్ద విద్యుత్తు ప్రాజెక్టు గా ఉన్నది.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రీవా ప్రాజెక్టు ప్రస్తుత దశాబ్దం లో ఈ ప్రాంతాన్ని అంతటిని స్వచ్ఛమైన మరియు పరిశుద్ధమైన శక్తి కి ఒక ప్రధాన కేంద్రం గా మార్చివేస్తుందన్నారు. ఇది రీవా పరిసర ప్రాంతాలన్నింటి తో పాటు, ఢిల్లీ మెట్రో కు కూడా విద్యుత్తు ను సరఫరా చేస్తుందంటూ ప్రధాన మంత్రి ప్రశంసల ను కురిపించారు.
మధ్య ప్రదేశ్ అతి త్వరలో భారతదేశం లో సౌర శక్తి కి ప్రధాన కేంద్రం గా అవుతుంది, ఎందుకంటే నీమచ్ లో, శాజాపుర్ లో, ఛతర్ పుర్ లో, ఇంకా ఓంకారేశ్వర్ లో ఇటువంటి అనేక ప్రముఖ ప్రాజెక్టుల పనులు పురోగమిస్తున్నాయి అని ఆయన తెలిపారు.
మధ్య ప్రదేశ్ లోని పేదలు, మధ్యతరగతి, ఆదివాసీలు మరియు రైతులు ఈ ప్రాజెక్టు తాలూకు అతి పెద్ద లాభితులు అవుతారు అని ఆయన చెప్పారు.
ఇరవై ఒకటో శతాబ్ది లో ఓ మహత్త్వాకాంక్షభరిత భారతదేశం యొక్క శక్తి అవసరాల ను తీర్చడం కోసం సౌర శక్తి ప్రధాన మాధ్యమం కాగలదు అని ప్రధాన మంత్రి అన్నారు.
సౌర శక్తి ని ‘నిశ్చితమైంది, స్వచ్ఛమైంది, ఇంకా సురక్షితమైంది కూడా’ అంటూ ఆయన అభివర్ణించారు. సునిశ్చితమైంది ఎలాగంటే సూర్యుని నుండి శక్తి నిరంతరం గా సరఫరా అవుతూవుంటుంది కాబట్టి; స్వచ్ఛం ఎలాగంటే ఇది పర్యావరణ స్నేహపూర్వకమైంది కనుక; ఇంకా దీనికి అదనం గా, ఇది మన శక్తి ఆవశ్యకతల కు ఒక సురక్షితమైనటువంటి వనరు గా కూడా ఉన్నది- అని ఆయన వివరించారు.
సౌర శక్తి పథకాలు ఆత్మనిర్భర్ భారత్ (స్వ-విశ్వసనీయ భారతదేశం) కు సరైన ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ఆర్థిక వ్యవస్థ అనేది స్వయంసమృద్ధి లో మరియు ప్రగతి లో ఒక ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థ పైన దృష్టి ని కేంద్రీకరించాలా, లేక పర్యావరణం పట్ల శ్రద్ధ వహించాలా అని ఎప్పుడూ ఎదురుపడే సందిగ్ధావస్థ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, భారతదేశం అటువంటి సందిగ్ధావస్థల ను- సౌర శక్తి పథకాల పైన మరియు ఇతర పర్యావరణ మైత్రీపూర్వక చర్యల పైన దృష్టి ని సారించడం ద్వారా- పరిష్కరించింది అని వివరించారు. ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణం పరస్పరం విరుద్ధమైనవి కాదని, అవి ఒకదాని కి మరొకటి పూరకం గా ఉంటాయని శ్రీ మోదీ అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలన్నిటి లో, జీవించడం లో సౌలభ్యానికి తోడు పర్యావరణ పరిరక్షణ కు కూడాను ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన స్వచ్ఛ్ భారత్, పేద కుటుంబాల కు ఎల్ పిజి సిలిండర్ ల సరఫరా, సిఎన్ జి నెట్ వర్క్ లను అభివృద్ధిపరచడం వంటి కార్యక్రమాల ను గురించి ప్రస్తావించి, ఆ కార్యక్రమాలు జీవించడం లో సౌలభ్యం పై దృష్టి ని సారించిన కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు పేద ప్రజ మరియు మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాల ను మెరుగుపరుస్తున్నటువంటి కార్యక్రమాలు అని పేర్కొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించడం కేవలం కొన్ని పథకాల కు పరిమితం కాదు, అది జీవించడం లో ఒక పద్ధతి అని ప్రధాన మంత్రి అన్నారు.
అక్షయ శక్తి తాలూకు పెద్ద పథకాల ను ప్రారంభించేటప్పుడు, స్వచ్ఛ శక్తి దిశ గా దృఢ సంకల్పాన్ని జీవనం యొక్క ప్రతి ఒక్క రంగం లో కనపడే విధం గా పూచీ పడడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దీని యొక్క లాభాలు దేశం లోని ప్రతి ఒక్క మూల కు, సంఘం లోని ప్రతి ఒక్క వర్గాని కి, ప్రతి ఒక్క పౌరుని కి అందేటట్టు ప్రభుత్వం సునిశ్చితపరుస్తోంది అని ఆయన అన్నారు. దీని ని ఆయన సోదాహరణం గా వివరించారు. ఎల్ఇడి బల్బుల ను పరిచయం చేయడం ద్వారా ఇలెక్ట్రిసిటి బిల్లు ఎలా తగ్గిందో చెప్పారు. ఎల్ఇడి బల్బు ల తో సుమారు 40 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను పర్యావరణం లోకి వెళ్లకుండా ఆపడం జరుగుతోందన్నారు. ఇది ఇలెక్ట్రిసిటి వినియోగాన్ని 6 బిలియన్ యూనిట్ ల మేర తగ్గించివేసింది, దీనితో ప్రభుత్వ ఖజానా కు 2,400 కోట్ల రూపాయలు మిగిలాయి అని కూడా ఆయన తెలిపారు.
మన పర్యావరణాన్ని, మన గాలి ని, మన జలాన్ని కూడా నిర్మలం గా ఉండేటట్టు చూడడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది మరి ఈ విధమైనటువంటి ఆలోచనలే సౌర శక్తి సంబంధి విధానంలో, సౌర శక్తి సంబంధి వ్యూహం లో ప్రతిఫలిస్తోంది అని ఆయన అన్నారు.
సౌర శక్తి రంగం లో భారతదేశం యొక్క అనుకరణీయ పురోగతి ప్రపంచానికి కుతూహలం తాలూకు ఒక పెద్ద కారణం అవుతుంది అని శ్రీ మోదీ అన్నారు. అటువంటి ప్రధానమైన చర్యల కారణం గా, భారతదేశాన్ని స్వచ్ఛ శక్తి తాలూకు అత్యంత ఆకర్షణీయమైన విపణి గా భావించడం జరుగుతున్నది అని ఆయన చెప్పారు.
సౌర శక్తి సంబంధి అంశం లో యావత్తు ప్రపంచాన్ని ఏకం చేయాలన్న ధ్యేయం తో ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) ను ప్రారంభించడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. దీని వెనుక ‘ఒక ప్రపంచం, ఒక సూర్యుడు, ఒక గ్రిడ్’ అనే భావన ఉన్నది అని ఆయన చెప్పారు.
మధ్య ప్రదేశ్ యొక్క రైతులు ప్రభుత్వ ‘కుసుమ్’ (KUSUM)కార్యక్రమాన్ని కూడా ఉపయోగించుకొంటారు, మరి వారి యొక్క పొలాల్లో ఓ అదనపు ఆదాయ మార్గం గా సౌర శక్తి ప్లాంటుల ను నెలకొల్పుతారు అనేటటువంటి విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
అతి త్వరలో భారతదేశం విద్యుత్తు యొక్క ఒక పెద్ద ఎగుమతిదారు దేశం కాగలుగుతుందన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
సోలర్ ప్లాంటుల కు అవసరపడే ఫోటోవోల్టాయిక్ సెల్స్, బ్యాటరీ, ఇంకా స్టోరేజి ల వంటి వివిధ హార్డ్ వేర్ కోసం దిగుమతుల పైన ఆధారపడడాన్ని తగ్గించుకోవడం పైన కూడా భారతదేశం దృష్టి ని కేంద్రీకరిస్తున్నది అని ప్రధాన మంత్రి చెప్పారు.
ఈ దిశ గా పని వేగం గా పురోగమిస్తోంది అని ఆయన అన్నారు. ఈ యొక్క అవకాశాన్ని వదలుకోకుండా ఉండండి, మరి సౌర శక్తి కి కావలసిన అన్ని వస్తువుల ను ఉత్పత్తి చేయడమే కాక వాటి ని మెరుగుపరచండి అంటూ పరిశ్రమ ను, యువత ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను ఇంకా స్టార్ట్- అప్స్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన చెప్పారు.
విశ్వమారి ‘కోవిడ్-19’ వల్ల తలెత్తిన ప్రస్తుత సంక్షోభాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రభుత్వానికి గాని లేదా సంఘానికి గాని ఈ కష్టమైనటువంటి సవాలు కు ఎదురొడ్డి పోరాడడానికి దయాళుత్వం, ఇంకా జాగరూకత.. ఇవే అతి పెద్ద ప్రేరకాలు అని పేర్కొన్నారు. లాక్ డౌన్ ఆరంభం నాటి నుండి పేదల కు మరియు ఆపన్నుల కు ఆహారం మరియు ఇంధనం తగినంత గా సరఫరా అయ్యేటట్టు ప్రభుత్వం పూచీ పడింది అని ఆయన చెప్పారు. ఇదే స్ఫూర్తి తో, ‘అన్ లాక్ డౌన్’ దశ లో సైతం, ఆహారాన్ని మరియు ఎల్ పిజి ని ఉచితం గా సరఫరా చేయడాన్ని ఈ సంవత్సరం లో నవంబర్ వరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన అన్నారు.
ఇది ఒక్కటే కాదు, ప్రైవేటు రంగం లోని లక్షలాది ఉద్యోగుల యొక్క ఇపిఎఫ్ ఖాతాల కు పూర్తి చందా ను కూడా ప్రభుత్వం ఇస్తున్నది. అదే విధం గా, వ్యవస్థ దాకా సమీపించేందుకు అన్నిటి కంటే తక్కువ అందుబాటు మాత్రమే ఉన్న అటువంటి వర్గాల వారు ‘పిఎమ్- స్వనిధి పథకం’ ద్వారా లాభపడుతున్నారు అని ఆయన అన్నారు.
మధ్య ప్రదేశ్ ప్రజలు వారి యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పథం లో ముందుకు తీసుకుపోవడం కోసం ఇళ్ల లో నుండి బయటకు వచ్చేటపుడు- 2 గజాల దూరాన్ని పాటించడం, ముఖాని కి ఒక ముసుగు ను ధరించడం, అలాగే చేతుల ను సబ్బు తో కనీసం 20 సెకనుల పాటు కడగడం అనేటటువంటి నియమాల ను అనుసరించాలి- అని ప్రధాన మంత్రి అన్నారు.
**
आज रीवा ने वाकई इतिहास रच दिया है।
— PMO India (@PMOIndia) July 10, 2020
रीवा की पहचान मां नर्मदा के नाम से और सफेद बाघ से रही है।
अब इसमें एशिया के सबसे बड़े सोलर पावर प्रोजेक्ट का नाम भी जुड़ गया है: PM @narendramodi dedicating Rewa Ultra Mega Solar Power project to the Nation
इसके लिए मैं रीवा के लोगों को, मध्य प्रदेश के लोगों को, बहुत-बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं।
— PMO India (@PMOIndia) July 10, 2020
रीवा का ये सोलर प्लांट इस पूरे क्षेत्र को, इस दशक में ऊर्जा का बहुत बड़ा केंद्र बनाने में मदद करेगा: PM @narendramodi
इस सोलर प्लांट से मध्य प्रदेश के लोगों को, यहां के उद्योगों को तो बिजली मिलेगी ही, दिल्ली में मेट्रो रेल तक को इसका लाभ मिलेगा।
— PMO India (@PMOIndia) July 10, 2020
इसके अलावा रीवा की ही तरह शाजापुर, नीमच और छतरपुर में भी बड़े सोलर पावर प्लांट पर काम चल रहा है: PM @narendramodi
ये तमाम प्रोजेक्ट जब तैयार हो जाएंगे, तो मध्य प्रदेश निश्चित रूप से सस्ती और साफ-सुथरी बिजली का HUB बन जाएगा।
— PMO India (@PMOIndia) July 10, 2020
इसका सबसे अधिक लाभ मध्य प्रदेश के गरीब, मध्यम वर्ग के परिवारों को होगा, किसानों को होगा, आदिवासियों को होगा: PM @narendramodi
सौर ऊर्जा आज की ही नहीं बल्कि 21वीं सदी की ऊर्जा ज़रूरतों का एक बड़ा माध्यम होने वाला है।
— PMO India (@PMOIndia) July 10, 2020
क्योंकि सौर ऊर्जा, Sure है, Pure है और Secure है: PM @narendramodi
जैसे-जैसे भारत विकास के नए शिखर की तरफ बढ़ रहा है, हमारी आशाएं-आकांक्षाएं बढ़ रही हैं, वैसे-वैसे हमारी ऊर्जा की, बिजली की ज़रूरतें भी बढ़ रही हैं।
— PMO India (@PMOIndia) July 10, 2020
ऐसे में आत्मनिर्भर भारत के लिए बिजली की आत्मनिर्भरता बहुत आवश्यक है: PM @narendramodi
जब हम आत्मनिर्भरता की बात करते हैं, प्रगति की बात करते हैं तो Economy उसका एक अहम पक्ष होता है।
— PMO India (@PMOIndia) July 10, 2020
पूरी दुनिया के नीति निर्माता बरसों से दुविधा में है, कि Economy की सोचें या Environment की: PM @narendramodi
आज आप देखेंगे कि सरकार के जितने भी कार्यक्रम हैं, उनमें पर्यावरण सुरक्षा और Ease of Living को प्राथमिकता दी जा रही है। हमारे लिए पर्यावरण की सुरक्षा सिर्फ कुछ प्रोजेक्ट्स तक सीमित नहीं हैं, बल्कि ये Way of Life है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 10, 2020
जब हम renewable energy के बड़े projects लॉन्च कर रहे हैं, तब हम ये भी सुनिश्चित कर रहे हैं कि साफ-सुथरी ऊर्जा के प्रति हमारा संकल्प जीवन के हर पहलू में दिखे।
— PMO India (@PMOIndia) July 10, 2020
हम कोशिश कर रहे हैं कि इसका लाभ देश के हर कोने, समाज के हर वर्ग, हर नागरिक तक पहुंचे: PM @narendramodi
LED बल्ब से बिजली का बिल कम हुआ है।
— PMO India (@PMOIndia) July 10, 2020
इसका एक और महत्वपूर्ण पहलू है।
LED बल्ब से करीब साढ़े 4 करोड़ टन कम कार्बनडाइअकसाइड पर्यावरण में जाने से रुक रही है, यानि प्रदूषण कम हो रहा है: PM @narendramodi
बिजली सबतक पहुंचे, पर्याप्त बिजली पहुंचे। हमारा वातावरण, हमारी हवा, हमारा पानी भी शुद्ध बना रहे, इसी सोच के साथ हम निरंतर काम कर रहे हैं।
— PMO India (@PMOIndia) July 10, 2020
यही सोच सौर ऊर्जा को लेकर हमारी नीति और रणनीति में भी स्पष्ट झलकती है: PM @narendramodi
जिस तरह से भारत में सोलर पावर पर काम हो रहा है, ये चर्चा और बढ़ने वाली है।
— PMO India (@PMOIndia) July 10, 2020
ऐसे ही बड़े कदमों के कारण भारत को क्लीन एनर्जी का सबसे Attractive market माना जा रहा है: PM @narendramodi
दुनिया की, मानवता की, भारत से इसी आशा, इसी अपेक्षा को देखते हुए, हम पूरे विश्व को जोड़ने में जुटे हुए हैं।
— PMO India (@PMOIndia) July 10, 2020
इसी सोच का परिणाम आइसा यानि इंटरनेशनल सोलर अलायंस है।
वन वर्ल्ड, वन सन, वन ग्रिड, के पीछे की यही भावना है: PM @narendramodi
एक प्रकार से सौर ऊर्जा ने आम ग्राहक को उत्पादक भी बना दिया है, पूरी तरह से बिजली के बटन पर कंट्रोल दे दिया है।
— PMO India (@PMOIndia) July 10, 2020
बिजली पैदा करने वाले बाकी माध्यमों में सामान्य जन की भागीदारी ना के बराबर रहती है: PM @narendramodi
जो पहला प्लांट है, जो पारंपरिक खेती है, वो हमारा किसान ऐसी जमीन पर लगाता है जो उपजाऊ होती है।
— PMO India (@PMOIndia) July 10, 2020
लेकिन ये जो दूसरा सोलर एनर्जी प्लांट है, ये ऐसी जमीन पर भी लगेगा जो उपजाऊ नहीं है, फसल के लिहाज से अच्छी नहीं है: PM @narendramodi
मुझे पूरा विश्वास है कि मध्य प्रदेश के किसान साथी भी अतिरिक्त आय के इस साधन को अपनाने और भारत को Power Exporter बनाने के इस व्यापक अभियान को ज़रूर सफल बनाएंगे।
— PMO India (@PMOIndia) July 10, 2020
ये विश्वास इसलिए अधिक है क्योंकि मध्य प्रदेश के किसानों ने संकल्प को सिद्धि में बदलकर दिखाया है: PM @narendramodi
सोलर पावर की ताकत को हम तब तक पूरी तरह से उपयोग नहीं कर पाएंगे, जब तक हमारे पास देश में ही बेहतर सोलर पैनल, बेहतर बैटरी, उत्तम क्वालिटी की स्टोरेज कैपेसिटी का निर्माण ना हो।
— PMO India (@PMOIndia) July 10, 2020
अब इसी दिशा में तेज़ी से काम चल रहा है: PM @narendramodi
अब गरीब परिवारों को नवंबर तक मुफ्त राशन मिलता रहेगा।
— PMO India (@PMOIndia) July 10, 2020
इतना ही नहीं, निजी क्षेत्र के लाखों कर्मचारियों के EPF खाते में भी सरकार पूरा अंशदान दे रही है।
इसी तरह, पीएम-स्वनिधि योजना के माध्यम से उन साथियों की सुध ली गई, जिनकी सिस्टम तक सबसे कम पहुंच होती है: PM @narendramodi
सरकार हो या समाज, संवेदना और सतर्कता इस मुश्किल चुनौती से निपटने के लिए हमारे सबसे बड़े प्रेरणास्रोत हैं।
— PMO India (@PMOIndia) July 10, 2020
आज जब आप मध्य प्रदेश को, पूरे देश को आगे बढ़ाने के लिए घर से बाहर निकल रहे हैं, तो अपनी एक और जिम्मेदारी भी हमेशा याद रखिए: PM @narendramodi
दो गज़ की दूरी, चेहरे पर मास्क और हाथ को 20 सेकेंड तक साबुन से धुलना, इन नियमों का हमें हमेशा पालन करना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 10, 2020