Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రియో 2016 పారాలింపిక్స్ లో పాల్గొనే భారతీయ క్రీడాకారులకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెప్టెంబరు 7వ తేదీ నుండి మొదలవుతున్న రియో 2016 పారాలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు చక్కగా రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

“సెప్టెంబరు 7వ తేదీ నుండి మొదలవుతున్న రియో 2016 పారాలింపిక్స్ లో భారతదేశం తరఫున పాలుపంచుకొంటున్న మన క్రీడాకారులు రాణిస్తారని భారతీయులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మనం అందరమూ రియో 2016 పారాలింపిక్స్ లో మన ఆటగాళ్లు నెగ్గాలంటూ వారికి శుభకామనలు అందిద్దాము. మన క్రీడాకారులు వారి సర్వోత్తమ ప్రదర్శననిచ్చి, మనం గర్వపడేటట్లు చేస్తారన్న నమ్మకం నాకు ఉంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***