ప్రపంచ సంస్కృతి సంగమంలో పాల్గొనేందుకు వచ్చిన రిపబ్లిక్ ఆఫ్ సురినేమ్ ఉపాధ్యక్షుడు మైకెల్ ఏ అధిన్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలిశారు. సురినేమ్ అభివృద్ధితోపాటు భారత్-సురినేమ్ దేశాల మధ్య చారిత్రక బంధాన్ని బలోపేతం చేసేందుకు ముందుచూపుతో ప్రయత్నిస్తున్న ఆ దేశంలోని భారత సంతతి ప్రజలను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి అభినందించారు. రిపబ్లిక్ ఆఫ్ సురినేమ్‌లో సామర్థ్య నిర్మాణం, మానవ వనరుల అభివృద్ధి విషయంలో పురోగతి సాధించేందుకు కావాల్సిన సహాయాన్నిఅందిస్తామని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సురినేమ్ ఉపాధ్యక్షునికి హామీ ఇచ్చారు.
Mr. Ashwin Adhin, Vice President of Suriname met PM @narendramodi. pic.twitter.com/lmggamn3Cp
— PMO India (@PMOIndia) March 11, 2016