రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ స్కీము ను ఇఎఫ్ సి సిఫారసు చేసినట్లుగా 1,160 కోట్ల రూపాయల బడ్జెట్ అవుట్ లే తో 2017-18 నుండి 2019-2020 వరకు నడుపుతూ ఉండేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రధాన అంశాలు:
పన్నెండో పంచ వర్ష ప్రణాళిక కాలం లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ ల ను సంప్రదించిన మీదట చేపట్టిన హేతుబద్ధీకరణ కసరత్తు లో భాగం గా ఎనిమిది పథకాల ను రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ లో ఉప పథకాలుగా చేయడం జరిగింది. ఇది పథకాల మధ్య చక్కని సమన్వయాన్ని సాధించడం లో సహాయకారి అయింది. దీని పర్యవసానం గా వాటి ప్రభావశీలత్వం మెరుగుపడటంతో పాటు అందుబాటులో ఉన్న వనరుల తో ఉత్తమ ఫలితాల ను రాబట్టడం సాధ్యపడుతుంది. 2014 వ సంవత్సరంలో రూపుదిద్దిన జాతీయ యువజన విధానం నిర్వచించిన ‘యువత’ అంటే 15-29 ఏళ్ల వయో వర్గం లోని యువతీ యువకులు- ఈ పథకం యొక్క లబ్ధిదారులలో ఉన్నారు. ఇక ప్రోగ్రామ్ కంపొనంట్స్ ను నిర్దిష్టం గా 10-19 ఏళ్ల వయోవర్గానికి చెందిన కిశోరావస్థ లోని వారి కోసం ఉద్దేశించడమైంది.
రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్ లో భాగమైన ఉప పథకాల లో ఈ కింద ప్రస్తావించినటువంటివి ఉన్నాయి:
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్ వైకెఎస్);
నేశనల్ యూత్ కోర్ (ఎన్ వైసి);
నేశనల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్ అడాలసెంట్ డివెలప్ మెంట్ (ఎన్ పివైఎడి);
ఇంటర్ నేశనల్ కోఆపరేశన్;
యూత్ హాస్టల్స్ (వైహెచ్);
స్కౌటింగ్ గైడింగ్ సంస్థలకు సహాయం;
నేశనల్ డిసిప్లిన్ స్కీమ్ (ఎన్ డిఎస్); ఇంకా,
నేశనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ (ఎన్ వైఎల్ పి).
పూర్వరంగం:
యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అమలుచేస్తున్న సెంట్రల్ సెక్టర్ స్కీమే రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్. ఇది 12వ పంచ వర్ష ప్రణాళిక నాటి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తోంది. యువత లో వ్యక్తిత్వాన్ని మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధిపరచడం తో పాటు వారిని జాతి నిర్మాణ కార్యకలాపాలలో భాగస్తులను చేయడం ఈ పథకం యొక్క ధ్యేయం గా ఉంది.
**