Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2019 విజేత‌ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2019 విజేత‌ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2019 విజేత‌ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి

రాష్ట్రీయ బాల పుర‌స్కార్ 2019 విజేత‌ ల‌తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్స‌రానికి చెందిన ప్ర‌ధాన మంత్రి రాష్ట్రీయ బాల పుర‌స్కార్ విజేత‌ లతో ఈ రోజు భేటీ అయ్యి వారి తో సంభాషించారు.

బాల‌లు వారు సాధించిన‌టువంటి ప్ర‌త్యేక విజ‌యాల‌ ను గురించి, వారి యొక్క ప్రేర‌ణదాయ‌క‌మైన గాథ‌ లను గురించి ఈ సంద‌ర్భం గా పూస‌ గుచ్చిన‌ట్లు వివ‌రించారు.

పుర‌స్కార విజేత‌ లను వారు సాధించిన విజ‌యాల‌ కు గాను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించ‌డమే కాక వారికి అభినందనలు కూడా తెలిపారు.

ఈ పుర‌స్కారాలు ప్ర‌తిభావంతులైన బాల‌ల గుర్తింపున‌కు ఒక అవ‌కాశాన్ని అందిస్తాయ‌ని, ఇతరులకు వారి వ‌లె తయారయ్యేందుకు ఒక ప్రేర‌ణ‌ గా నిలుస్తాయ‌ని ఆయ‌న అన్నారు.

అసాధార‌ణ ప్ర‌తిభాన్వితులైన బాల‌లు ప్ర‌కృతి తో అనుబంధాన్ని పెంచుకొంటూ ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు.

బాల‌ల తో ఆయ‌న మ‌న‌స్సు విప్పి ముచ్చటిస్తూ కొన్ని సరదా సంగతుల ను వెల్లడించారు. బాల‌లు ప్ర‌ధాన మంత్రి వ‌ద్ద నుండి ఆయ‌న సంత‌కాల‌ ను అడిగి తీసుకున్నారు.

పూర్వ‌రంగం

రెండు కేట‌గిరీల లో రాష్ట్రీయ బాల పుర‌స్కారాల‌ ను అంద‌జేశారు. వాటి లో వ్య‌క్తుల‌ కు ఇచ్చే బాల శ‌క్తి పుర‌స్కారాలు ఒక కేటగిరీ కాగా; బాలల కోసం కృషి చేస్తున్న సంస్థ‌ల కు/వ్య‌క్తుల‌ కు ఇచ్చేట‌టు వంటి బాల క‌ళ్యాణ్ పుర‌స్కారాలు రెండో కేటగిరీ గా ఉన్నాయి.

ఈ సంవ‌త్స‌రం బాల శ‌క్తి పుర‌స్కారాల కోసం మొత్తం 783 ద‌ర‌ఖాస్తులు అందాయి. నూతన ఆవిష్క‌ర‌ణ‌, విద్య, క్రీడ‌లు, క‌ళ‌లు, సంస్కృతి, సామాజిక సేవ‌, ఇంకా సాహ‌సం.. ఈ కేట‌గిరీ లో బాల శ‌క్తి పుర‌స్కారాల కోసం 26 మంది ని మ‌హిళ‌లు మ‌రియు శిశు వికాసం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. బాల క‌ళ్యాణ్ పుర‌స్కారాల కోసం ఇద్ద‌రు వ్య‌క్తుల‌ ను మ‌రియు మూడు సంస్థ‌ల‌ ను నేశ‌న‌ల్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఖ‌రారు చేసింది.