Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌

రాష్ట్రీయ గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధికి ఒక మార్గ‌సూచీ ఆవిష్క‌ర‌ణ‌


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌ధ్య ప్ర‌దేశ్ లోని మండ‌లా లో ఈ రోజు జరిగిన ఒక జ‌న‌ స‌భ‌ లో రాష్ట్రీయ గ్రామ్‌ స్వ‌రాజ్ అభియాన్ ను ప్రారంభించారు. రాగ‌ల అయిదు సంవ‌త్స‌రాల కాలంలో ఆదివాసీ ల స‌ర్వ‌తోముఖ అభివృద్ధి కి ఉద్దేశించిన ఒక మార్గ‌సూచీ ని ఆయ‌న ఈ సందర్భంగా ఆవిష్క‌రించారు.

మండ‌లా జిల్లా మ‌నేరీ లో ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేశన్ యొక్క ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంటు కు ఆయ‌న పునాది రాయి ని వేశారు. స్థానిక ప్ర‌భుత్వ డైరెక్ట‌రి ని కూడా ఆయ‌న ప్రారంభించారు.

100 శాతం పొగ రాని పొయ్యిల ల‌క్ష్యాన్ని, మిశన్ ఇంద్ర‌ధ‌నుష్ లో భాగంగా 100 శాతం టీకా మందుల ల‌క్ష్యాన్ని మ‌రియు సౌభాగ్య స్కీము లో భాగంగా 100 శాతం విద్యుత్తు స‌దుపాయం ల‌క్ష్యాన్ని సాధించిన గ్రామాల యొక్క స‌ర్పంచ్ ల‌ను ప్ర‌ధాన మంత్రి స‌త్క‌రించారు.

మండ‌లా నుండి దేశవ్యాప్త పంచాయ‌తీ రాజ్ ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, గాంధీ మ‌హాత్ముడు గ్రామోద‌య్ నుండి రాష్ట్రోద‌య్ కు మ‌రియు గ్రామ స్వ‌రాజ్ కు పిలుపు ఇచ్చారని గుర్తు చేశారు. జాతీయ పంచాయ‌తీ రాజ్ దినం నాడు మ‌ధ్య‌ ప్ర‌దేశ్ లో ఉండ‌డం తన‌కు సంతోషాన్ని ఇచ్చింద‌ని ఆయ‌న అన్నారు. గాంధీ మ‌హాత్ముడు ప‌ల్లెల ప్రాముఖ్యాన్ని గురించి, ‘గ్రామ స్వ‌రాజ్’ గురించి ఎప్పుడూ ప్రముఖంగా చెప్ప‌ే వార‌ని ఆయ‌న అన్నారు. మ‌న ప‌ల్లెల‌కు సేవ చేద్దాం అనే వ‌చ‌న‌బ‌ద్ధ‌త‌ ను పున‌రుద్ఘాటించాల‌ంటూ ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న పిలుపునిచ్చారు.

గ్రామీణాభివృద్ధి ని గురించి మాట్లాడేట‌ప్పుడు బ‌డ్జెట్ లు ముఖ్య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. అయితే, గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీనిని పాటించ‌డంలో ఒక మార్పు చోటుచేసుకొన్నద‌ని ఆయ‌న అన్నారు. ఒక ప్రోజెక్టు కు కేటాయించిన ధ‌నాన్ని వినియోగించేట‌ట్లుగా చూడ‌వ‌ల‌సిన అవ‌స‌రం గురించి ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం మాట్లాడుతున్నార‌ని, మ‌రి ఈ ప‌ని స‌కాలంలో, పార‌ద‌ర్శ‌క‌మైన ప‌ద్ధ‌తిలో జ‌రుగుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌జ‌లు వారి పిల్ల‌ల విద్య ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాల‌ని ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రి బాల‌ల భ‌విష్య‌త్తు కోసం ఇది అత్య‌వ‌స‌ర‌ం అని ఆయన చెప్పారు.

వ్య‌వ‌సాయ‌ రంగంలో స్వావ‌లంబ‌న దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. జ‌ల సంర‌క్ష‌ణ ప‌ట్ల పంచాయ‌తీ ప్ర‌తినిధులు శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని, అంతేకాకుండా ప్ర‌తి ఒక్క నీటి చుక్క‌ను సంర‌క్షించాల‌ని కోరారు.

అంద‌రికీ ఆర్థిక సేవ‌లు అందేందుకు జ‌న్ ధ‌న్ యోజ‌న; ఆదివాసీల సాధికారిత కోసం వ‌న్ ధ‌న్ యోజ‌న అమ‌లుకు; అలాగే వ్య‌వ‌సాయ‌దారులు మ‌రింత స్వావ‌లంబ‌న క‌లిగి ఉండేందుకు, ఇంకా వ్య‌ర్థాల నుండి శ‌క్తి ఉత్పాద‌న‌కు గోబ‌ర్‌-ధ‌న్ యోజ‌న కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాల‌ని శ్రీ న‌రేంద్ర మోదీ వివ‌రించారు.

గ్రామాలు ప‌రివ‌ర్త‌న చెందితే భార‌త‌దేశం ప‌రివ‌ర్త‌న‌కు మార్గం ఏర్ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొన్న చ‌ర్య‌లు మ‌హిళ‌ల భ‌ద్ర‌త కు తోడ్ప‌డ‌గ‌లుగుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.