Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క ఎంపిక చేసిన ఉపన్యాసాల నాలుగో సంపుటిని విడుదల చేసిన ప్రధాన మంత్రి


రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క ఎంపిక చేసిన ఉపన్యాసాల నాలుగో సంపుటిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ వద్ద నుండి తాను అందుకొన్న మార్గదర్శకత్వం తనకు ఎంతగానో సహాయపడుతుందన్నారు. రాష్ట్రపతి తో కలసి పనిచేసిన వారంతా ఇదే విధంగా అనుకొంటారన్న నమ్మకం తనకు ఉందని ప్రధాన మంత్రి చెప్పారు.

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ విస్తృత‌మైన‌ విజ్ఞానం కలిగిన వారు మరియు అత్యంత నిరాడంబరులు అని శ్రీ మోదీ అభివర్ణించారు. రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ తో ఆధికారిక విషయాలను తాను చర్చించినపుడల్లా రాష్ట్రపతి తనకు మార్గదర్శనం చేసే వారని, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిస్పందనను అందించే వారంటూ ప్రధాన మంత్రి వివరించారు.

రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలో రాష్ట్రపతి భవన్ ఒక ‘లోక్ భవన్’గా రూపొందినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. శ్రీ ముఖర్జీ పదవీకాలంలో చరిత్రాత్మకమైన గ్రంథ రచనల ఖజానా రూపుదిద్దుకొందని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైన ప్రయత్నాన్ని చేసినందుకుగాను రాష్ట్రపతి యొక్క బృందాన్ని ఆయన అభినందించారు.

***