Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం


పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో వికసిత్ భారత్తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.

 

ఇదివరకటి కాలాల కు భిన్నం గా ‘‘మా ప్రభుత్వం ధ్యేయం పౌరుల కు శాశ్వత పరిష్కారాల ను అందించడమూ, మరి వారి కి సాధికారిత ను కల్పిలంచడమూను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల సమస్యల కు పరిష్కారాల ను చూపించడం మునుపటి కాలాల లో అధికారం లో ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత గా ఉండగా, వారికి భిన్నమైనటువంటి ప్రాధాన్యాలు మరియు ఉద్దేశ్యాలు ఉండేవి అని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం మేం సమస్యల కు శాశ్వత పరిష్కారాల ను కనుగొనే దిశ లో సాగుతున్నాం’’ అని ఆయన అన్నారు. నీటి కి సంబంధించిన అంశాన్ని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి ప్రస్తావించి, ఏవో కొన్ని వర్గాల ను తృప్తి పరచడాని కి బదులు జల సంబంధి మౌలిక సదుపాయాల ను కల్పించడం, వాటర్ గవర్నెన్స్, నాణ్యత నియంత్రణ, జలాన్ని పొదుపు గా వాడుకోవడం, ఇంకా సేద్యం లో నూతన ఆవిష్కరణ లను ప్రవేశపెట్టడం వంటి ఒక సమగ్ర విధానం తో ముందుకు పోతున్నాం అన్నారు. అన్ని వర్గాల వారికీ ఆర్థిక సేవల ను అందించడం, జన్ ధన్-ఆధార్-మొబైల్ ల మాధ్యం ద్వారా ప్రత్యక్ష ప్రయోజనం బదలాయింపు (డిబిటి), మౌలిక సదుపాయాల కల్పన సంబంధి ప్రణాళిక రచన, ఇంకా పిఎమ్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా ఆయా ప్రణాళికల ను అమలు పరచడం వంటి చర్య లు శాశ్వత పరిష్కారాల ను అందించాయి అని ఆయన వివరించారు. ‘‘మేం మౌలిక సదుపాయాల కల్పన, విస్తృతి, ఇంకా వేగం అనేటటువంటి వాటి కి ఒక ఆధునిక భారతదేశం నిర్మాణం లో ఉన్న ప్రాముఖ్యాన్ని గ్రహించాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ద్వారా దేశం లోని శ్రమ సంస్కృతి లో మార్పు ను తీసుకురావడమైంది; మరి ప్రభుత్వం వేగాన్ని మరియు విస్తృతి ని పెంచడం పైన శ్రద్ధ వహించింది అని ఆయన స్పష్టం చేశారు.

 

‘‘ శ్రేయం’ (మెరిట్) మరియు ప్రియం’ (డియర్) అనే మాటల ను మహాత్మ గాంధీ చెబుతూ ఉండే వారు. వాటి లో నుండి శ్రేయంఅనే దారి ని మేం ఎంచుకొన్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యం ఉన్న మార్గాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకోలేదు, దానికి భిన్నం గా సామాన్యుల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం రేయింబవళ్లు అలుపెరుగక పాటుపడే మార్గాన్ని మేం ఎంచుకొన్నాం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఆజాదీ కా అమృత్ కాల్ లో పథకాల ఫలితాలు అందరికీ అందేటట్టు చూసే దిశ లో ప్రభుత్వం ముఖ్యమైన చర్య ను తీసుకొంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ప్రయోజనాలు దేశం లో ప్రతి ఒక్క లబ్ధిదారు కు చేరుకొనే విధం గా ప్రభుత్వం యొక్క ప్రయాసలు ఉంటున్నాయి అని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘వాస్తవిక మతాతీవాదం అంటే ఇది. వివక్ష ను మరియు అవినీతి ని ఇది నిర్మూలిస్తుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘ఆదివాసి సముదాయాల అభివృద్ధి దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం బారి న పడ్డది. వారి సంక్షేమాని కి మేం పెద్ద పీట ను వేశాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీ సంక్షేమాని కి అంటూ ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ను అటల్ బిహారీ వాజ్ పేయీ గారు ప్రధాన మంత్రి గా ఉన్న కాలం లో ఏర్పాటు చేయడం జరిగింది; మరి ఆదివాసీ సంక్షేమం కోసం ఏకోన్ముఖమైన ప్రయత్నాలు సాగాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

‘‘భారతదేశ వ్యవసాయ రంగాని కి వెన్నెముక చిన్న రైతు లు. వారి ని బలపరచేందుకు మేం కృషి చేస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. చిన్న రైతుల ను చాలా కాలం పాటు చిన్నచూపు చూస్తూ రావడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి అవసరాల పై శ్రద్ధ వహిస్తున్నది. చిన్న రైతుల కు తోడు చిన్న వ్యాపారాలను చేసుకొనే వర్గాల వారి కోసం మరియు చేతివృత్తుల వారి కోసం అనేకమైన అవకాశాల ను కల్పించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళల కు సశక్తీకరణ కోసం, భారతదేశం లో ప్రతి ఒక్క మహిళ యొక్క జీవనం తాలూకు ప్రతి దశ లో జీవన సౌలభ్యాన్ని ఏర్పరచడం కోసం మరియు మహిళల కు గౌరవం దక్కేటట్లుగా చూడడం కోసం తీసుకొన్నటువంటి చర్యల ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.

 

భారతదేశం యొక్క శాస్త్రజ్ఞులు, నూతన ఆవిష్కర్త లు మరియు టీకామందు తయారీదారుల ను నిరుత్సాహ పరిచేందుకు కొంత మంది ప్రయత్నించిన దాని తాలూకు దురదృష్టకర ఘటనల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘మన శాస్త్రవేత్త లు మరియు నూతన ఆవిష్కర్త ల ప్రావీణ్యం తాలూకు అండదండల తో ప్రపంచాని కి ఒక ఫార్మా హబ్ గా రూపొందుతోంది’’ అని వ్యాఖ్యానించారు. అటల్ ఇనొవేశన్ మిశన్ మరియు టింకరింగ్ ల్యాబ్స్ ల వంటి చర్యల ద్వారా విజ్ఞాన శాస్త్రపరమైన అభిరుచి ని పెంపొందింపచేయడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొంటున్నందుకు మరియు ప్రయివేటు ఉపగ్రహాల ను ప్రయోగిస్తున్నందుకు శాస్త్రవేత్తల ను మరియు యువతీ యువకుల ను ఆయన అభినందించారు. ‘‘మనం సఫలం అయ్యాం మరి సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్య పౌరుల సశక్తీకరణ కు ఉపయోగించుకొంటున్నాం’’ అని ఆయన అన్నారు.

 

‘‘దేశం ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల లో ప్రపంచానికి నాయకత్వం వహించే స్థానానికి చేరుకొంది. డిజిటల్ ఇండియా యొక్క సాఫల్యం ఇవాళ యావత్తు ప్రపంచం దృష్టి ని ఆకట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం మొబైల్ ఫోన్ లను దిగుమతి చేసుకొన్నటువంటి కాలం అంటూ ఒకటి ఉండేది అని ఆయన గుర్తు చేస్తూ, మొబైల్ ఫోన్ లు ఇతర దేశాల కు ఎగుమతి అవుతున్నందుకు మనం ఇప్పుడు గర్విస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘‘భారతదేశం 2047వ సంవత్సరం కల్లా వికసిత భారత్గా రూపొందాలి అనేది మన సంకల్పం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మనం ఎదురుచూస్తూ ఉన్నటువంటి అవకాశాల ను అందిపుచ్చుకోవడాని కి ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యల ను తీసుకొంది అని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘భారతదేశం ఒక పెద్ద ముందడుగు ను వేయడాని కి సిద్ధం గా ఉంది, ఇక వెనుదిరిగి చూడటం అన్నది లేనే లేదు’’ అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

***

DS/TS