Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని లోక్ సభలో సమాధానం


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈరోజు లోక్ సభలో సమాధానమిచ్చారు. గౌరవ రాష్ట్రపతి తన దార్శనిక ప్రసంగంతో దేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. ఆమె ప్రసంగం నారీశక్తికి స్ఫూర్తిదాయకమైందని, భారతదేశ గిరిజన సమూహానికి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి వాళ్ళలో గర్వాన్ని నింపిందన్నారు.  సంకల్ప సే సిద్ధి నినాదానికి ఒక బయట చూపారని ప్రధాని అభిప్రాయపడ్డారు.

సవాళ్ళు ఎదురైనా సరే, 140 కోట్ల భారతీయుల పట్టుదలతో దేశం ఎలాంటి అవరోధాలనైనా ఎదుర్కోగలుగు తుందన్నారు. శతాబ్దానికొకసారి ఎదురయ్యే విపత్తును, యుద్ధాన్ని భారతదేశం  ధైర్యంగా ఎదుర్కున్నదన్నారు. అలాంటి సంక్షోభ సమయంలో కూడా భారతదేశం ప్రపణచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైందని గుర్తు చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పట్ల సానుకూల, ఆశావహ దృక్పథం నెలకొన్నాడాని ప్రధాని వ్యాఖ్యానించారు.  ఈ రకమైన సకారాత్మక ధోరణికి, స్థిరత్వానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, కొత్తగా వస్తున్న అవకాశాలు, సామర్థ్యం అందుకు నిదర్శనమన్నారు.  దేశంలో ఒకరకమైన నమ్మకం ఏర్పడిందని స్థిరమైన, నిర్ణయాత్మక  ప్రభుత్వం ఉండటం కూడా అందుకొక కారణమని ప్రధాని వ్యాఖ్యానించారు. సంస్కరణలు బలవంతంగా కాకుండా, అంకితభావంతో అమలు చేస్తున్నామని చెప్పారు. భారతదేశ సుసంపన్నతలోనే ప్రపంచం కూడా సుసంపన్నతను చూడగలుగుతోందన్నారు.

2014 కు ముందున్న దశాబ్ద కాలాన్ని ప్రధాని గుర్తు చేశారు. 2004-14 మధ్య కాలం కుంభకోణాలతో నలిగిపోయిందని , అదే సమయంలో తీవ్రవాద దాడులు దేశం నలుమూలలా జరిగాయని అన్నారు.  భారత ఆర్థిక వ్యవస్థ ఈ దశక్యంలోనే బాగా దిగజారిందని  అన్నారు.  అందుకే, అంతర్జాతీయంగా  భారత స్వరం కూడా బాగా తగ్గిందని అన్నారు. ఈ రోజు దేశం పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఉందని, కళలను సాకారం చేసుకుంటోందని  చెబుతూ, యావత్ ప్రపంచం ఇప్పుడు భారతదేశం పట్ల ఎంతో నమ్మకంతో చూస్తోందని, స్థిరత్వం, ఎదుగుదల అవకాశాలే అందుకు కారణమని  అన్నారు. యూపీఏ హయాంలో భారతదేశాన్ని “కోల్పోయిన శతాబ్దం” అనేవారని,  నేడు ప్రజలు ‘ఇది భారత శతాబ్దం’ అంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.  “

భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని చెబుతూ,  ప్రజాస్వామ్యానికి నిర్మాణాత్మక విమర్శ చాలా ముఖ్యమైనది అన్నారు .  గడిచిన 9 ఏళ్ళలో చాలామంది నిరాధారమైన ఆరోపణలే చేశారని, అయితే అలాంటి ఆరోపణల వల్ల జరిగేదేలేదని అన్నారు . భారత నారీ శక్తి గురించి మాట్లాడుతూ ప్రభుత్వం నారీ శక్తిని పెంపొందించటానికి కృషి చేస్తున్న దన్నారు.  

 

***