Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాష్ట్రపతి ప్రసంగం ప్రేరణాత్మకం.. ఎన్నో అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.. మన రాజ్యాంగానికున్న గొప్పదనాన్ని చెప్పడంతో పాటు దేశాన్ని ప్రగతిపథంలో నిలపడానికి పని చేయాలని స్పష్టం చేశారు: ప్రధానమంత్రి


గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రేరణదాయకంగా ప్రసంగించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారని, మన రాజ్యంగం గొప్పదనాన్ని చాటిచెప్పడంతో పాటు, దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారని ఆయన అన్నారు.

భారత రాష్ట్రపతి హ్యాండిల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘రాష్ట్రపతి గారు ప్రేరణదాయక ప్రసంగాన్నిచ్చారు. ఆమె తన ప్రసంగంలో అనేక విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు. మన రాజ్యాంగం గొప్పదనాన్ని చెబుతూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడపడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు.’’

 

 

***

MJPS/SR