Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామ నవమి.. అందరికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు


రామ నవమి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో హిందీలో, ఇంగ్లిషులో వేర్వేరు సందేశాలను ప్రధాని పొందుపరుస్తూ, ఆ సందేశాల్లో:

 

‘‘రామనవమి నాడు దేశ వాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. శ్రీ రామ ప్రభువు జన్మదినోత్సవ పావన, పునీత సందర్భం మీ అందరి జీవనంలో కొత్త చైతన్యాన్ని నింపాలని, సరికొత్త ఉత్సాహాన్ని ప్రసాదించాలని, సశక్త, సమృద్ధ, సమర్థ భారత్ సంకల్పానికి నిరంతరం నూతన శక్తిని అందిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.’’

 

‘‘ప్రతి ఒక్కరికీ రామ నవమి శుభాకాంక్షలు. శ్రీ రామ ప్రభువు దీవెనలు మనకు సదా ప్రాప్తిస్తూ ఉండాలని, మన ప్రయత్నాలన్నింటా మనకు మార్గదర్శనం చేస్తూ ఉండాలని నేను అభిలషిస్తున్నాను. ఈ రోజు రామేశ్వరానికి వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు

.

**