Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామ జన్మభూమి మందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


రామ జన్మభూమి మందిర ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారుమతపరమైన ఆచారాలుధార్మిక గ్రంధాల విషయంలో మహంత్ నిష్ణాతులనితన యావత్ జీవితాన్ని రాముల వారి సేవకే అంకితం చేశారని శ్రీ మోదీ కొనియాడారు.  

 ‘ఎక్స్’ వేదికపై రాస్తూ..

రామ జన్మభూమి మందిర ప్రధాన అర్చకులు మహంత్ సత్యేంద్ర దాస్ జీ మరణం నాకు తీవ్రమైన ఆవేదనను కలిగించిందిధార్మిక విధుల్లో నిష్ణాతులుశాస్త్ర పారంగతులైన మహంత్.. తన జీవితం మొత్తాన్నీ రాముల వారి సేవకే అంకితం చేశారుదేశ ఆధ్యాత్మికసామాజిక రంగానికి వారు చేసిన సేవలను ఎల్లప్పుడూ అత్యంత గౌరవంతో గుర్తు చేసుకుంటాంఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకూ అనుయాయులకు తగిన స్థైర్యాన్ని ప్రదానం చేయమని దేవుడిని వేడుకుంటున్నానుఓం శాంతి!” అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.