Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం: శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు

రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం:  శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు


రామాయణాన్ని, మహాభారతాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించినందుకు శ్రీ అబ్దుల్లా అల్బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్నసేఫ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘రామాయణ, మహాభారతాల అరబ్బీ భాషా అనువాదాలను చూసి సంతోషం కలిగింది. వాటి అనువాదాలను సిద్ధం చేసి ప్రచురించడానికి శ్రీ అబ్దుల్లా అల్బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్నసేఫ్‌లు చేసిన కృషిని నేను మెచ్చుకొంటున్నాను. వారి ఈ ప్రయత్నం భారతీయ సంస్కృతికున్న ప్రజాదరణను ప్రపంచ స్థాయిలో ప్రధానంగా చాటిచెబుతోంది.’’

 

***