ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, రాబడిపై పన్నులకు సంబంధించి ఆర్థిక ఎగవేతలకు పాల్పడకుండా నిరోధించేందుకు , ద్వంద్వ పన్నులను తప్పించేందుకు ఇండియా, ఖతార్‌ల మధ్య ఒప్పందాన్ని సవరించేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమలులో ఉన్న ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పందంపై (డిటిఎఎ) 1999 ఏప్రిల్ 7న ఖతార్‌తో సంతకాలు జరిగాయి. ఇది 2000 సంవత్సరం జనవరి 15 నుంచి అమలులోకి వచ్చింది. సవరించిన డిటిఎఎ నిబంధనలు తాజా ప్రమాణాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, ట్రీటీ షాపింగ్‌ను నియంత్రించేందుకు ప్రయోజనాల ప్రొవిజన్‌ను పరిమితం చేయడం, భారత దేశపు ఇతర ఒప్పందాలకు అనుగుణంగా నిబంధనల సవరింపు వంటి వాటికి సంబంధించినవి.సవరించిన డిటిఎఎ నిబంధనలు సెక్షన్ 6 కింద ఒప్పంద దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కనీస ప్రమాణాలకు తగిన విధంగా ఉంది. అలాగే జి-20 ఒఇసిడి యాక్షన్ 14 కింద ఒఇసిడి బేస్ ఎరోసన్, ప్రాఫిట్ షిఫ్టింగ్(బిఇపిఎస్) ప్రాజెక్టుకు సంబంధించి పరస్పర ఒప్పంద ప్రక్రియ ప్రమాణాలకు అనుగుణంగా కూడా ఉంది. బిఇపిఎస్ ప్రాజెక్టులో ఇండియా సమాన స్థాయిలో పాల్గొనింది.
Cabinet clears India-Qatar double taxation avoidance treaty. https://t.co/LEbGoculuA
— PMO India (@PMOIndia) March 22, 2018
via NMApp pic.twitter.com/yKQwzCllpk