Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి స్మృత్యంజలి


ధీరవనిత రాణీ వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు స్మృత్యంజలి ఘటించారుఅసాధారణ ధైర్య సాహసాలతో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రాణి యుద్ధ వ్యూహా రచనలో కూడా దిట్టగా పేరుగాంచారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో రాస్తూ

రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భంగా ఆ ధీర వనితను స్మరించుకుందాం. అసాధారణ ధైర్య సాహసాలతో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆమెయుద్ధ వ్యూహ రచనలో గొప్ప ప్రజ్ఞ చూపేవారుపీడనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడే ఎన్నో తరాలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారుమహిళల సాధికారత కోసం ఆమె ఇతోధికంగా చేసిన కృషిని నేటికీ గుర్తు చేసుకుంటాం” అని ప్రధాని పేర్కొన్నారు.