Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ‌స్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న ప‌చ్ ప‌ద్ రా లో రాజ‌స్థాన్ రిఫైన‌రీ ప‌నుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని ప‌చ్ ప‌ద్ రా లో ఈ రోజు రాజ‌స్థాన్ రిఫైన‌రీ ప‌నుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీమత వసుంధర రాజే ను, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ను ఈ సందర్భంగా అభినందించిన ప్రధాన మంత్రి.. కొద్ది రోజుల కిందటే భారతదేశం మకర సంక్రాంతి ని సమధికోత్సాహంతో జరుపుకొన్నట్లు చెప్పారు. ఈ పండుగల కాలం సమృద్ధికి అగ్రగామిగా ఉంటుందని ఆయన అన్నారు. పండుగ సంబరాలు ముగిసిన వెంటనే ఎందరి జీవితాల లోనో సుఖ సమృద్ధులను తీసుకురాగల ఒక పథకం కోసమని రాజస్థాన్ కు చేరుకొన్నందుకుగాను తాను సంతోషిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.

ఇది ‘సంకల్ప్ సే సిద్ధి’ తరుణం. మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 75 సంవత్సరాలయ్యే 2022 కల్లా సాధించవలసిన లక్ష్యాలను గుర్తించి, ఆ లక్ష్య సాధన దిశగా కృషి చేయవలసివుందని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

పూర్వ ఉప రాష్ట్రపతి మరియు రాజస్థాన్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ భైరాన్ సింగ్ శెఖావత్ చేసిన సేవలను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు. ఆయన రాజస్థాన్ ను ఆధునికీకరించే దిశగా కృషి చేశారని శ్రీ మోదీ చెప్పారు. సీనియర్ నేత, పూర్వ కేంద్ర మంత్రి శ్రీ జశ్వంత్ సింగ్ మన దేశానికి అందించినటువంటి తోడ్పాటు కూడా గొప్పది అని ప్రధాన మంత్రి చెబుతూ, ఆయన శీఘ్రంగా కోలుకోవాలంటూ అందుకు ఆ ఈశ్వరుడిని ప్రార్థించారు.

అనావృష్టి పరిస్థితి దృష్ట్యా జాగ్రత్త చర్యలు తీసుకొని ఈ క్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కేటట్టు ప్రజలకు సహాయపడినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజే ను ప్రధాన మంత్రి అభినందించారు.

సాయుధ బలగాల కు వన్ ర్యాంక్, వన్ పెన్షన్ ను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిని ఆచరణ లోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.

జన్ ధన్ యోజన ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, బ్యాంకింగ్ సదుపాయాలను పేద ప్రజలు ఇప్పుడు అందుకోగలిగారని చెప్పారు. వంట గ్యాస్ కోసం ఉద్దేశించినటువంటి ఉజ్జ్వల యోజనను గురించి కూడా ఆయన మాట్లాడారు. విద్యుత్తు సౌకర్యానికి నోచుకోని 18,000 పల్లెలలో విద్యుత్తు సౌకర్యాన్ని సమకూర్చడంలో గణనీయ పురోగతిని సాధించినట్లు ఆయన వివరించారు.

రాజస్థాన్ పురోగతి కోసం మరియు రాజస్థాన్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధర రాజే నిబద్ధతను ప్రధాన మంత్రి ప్రశంసించారు.

***