Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్‌కోట్‌ లో మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


మహాత్మ గాంధీ మ్యూజియమ్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాజ్‌కోట్‌ లో నేడు ప్రారంభించారు. మ‌హాత్మ గాంధీ తొలి నాళ్ల లో ఒక ముఖ్య భూమిక ను పోషించినటువంటి ఆల్‌ఫ్రెడ్ హైస్కూల్ లో ఈ వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌నశాల‌ ను ఏర్పాటు చేశారు. ఇది గాంధేయ వాదాన్ని, గాంధేయ విలువలను, ఇంకా సంస్కృతి ని గురించిన చైత‌న్యాన్ని వ్యాప్తి చేయ‌డం లో స‌హాయ‌కారి గా ఉండగల‌దు.

ప్ర‌ధాన మంత్రి 624 గృహాల తో కూడిన ఒక ప్ర‌జా గృహ నిర్మాణ ప‌థ‌కం ప్రారంభ సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని కూడా ఆవిష్క‌రించారు. 240 మంది ల‌బ్దిదారు కుటుంబాల ‘ఇ-గృహ ప్ర‌వేశ్’ ను ఆయ‌న వీక్షించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మ‌హాత్మ గాంధీ నుండి నేర్చుకోవ‌ల‌సింది ఎంతో ఉంద‌న్నారు. గుజరాత్ బాపు గారితో అత్యంత స‌న్నిహిత సంబంధాన్ని కలిగివుండినటువంటి గ‌డ్డ అని, ఇది ఈ నేల చేసుకొన్న అదృష్టం అని ఆయ‌న చెప్పారు.

ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల బాపు ఎంతో త‌పించే వార‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. గాంధీ గారి నుండి ప్రేర‌ణ ను పొంది ఒక స్వ‌చ్ఛ‌మైన, పచ్చ‌ద‌నం తో కూడిన రేపటి కోసం మ‌నం కృషి చేయ‌వ‌ల‌సి వుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

వ‌రుస లో చిట్ట‌చివ‌రి వ్య‌క్తి ని గురించి.. అంటే పేద‌ల‌ లో కెల్లా పేద వారిని గురించి ఆలోచించాల‌ని, అనాద‌ర‌ణ‌కు గురైన వారికి సేవ చేయాల‌ని మ‌న‌కు బాపూ ఎల్ల‌ప్పుడూ బోధిస్తూ ఉండేవార‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ఈ ఆలోచ‌న నుండి స్ఫూర్తి ని పొంది పేద‌ల‌ కు మ‌నం సేవ చేస్తున్నామ‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు. మా కార్య‌క్ర‌మాల ద్వారా వారి జీవితాల‌ లో మార్పు ను తీసుకు రావాల‌ని మేం కోరుకుంటున్నాం; పేద‌ల కోసం ఇళ్ళ‌ను నిర్మించాల‌ని మేం ఆశిస్తున్నామంటూ ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

స్వాతంత్య్రం వ‌చ్చి 70 సంవ‌త్స‌రాలు అవుతోంద‌ని, అయిన‌ప్ప‌టికీ బాపు క‌ల‌గ‌న్న ఒక స్వ‌చ్ఛ భార‌తదేశం ఇప్ప‌టికీ నెర‌వేర‌కుండానే మిగిలిపోయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మ‌న‌మంతా క‌ల‌సి ఈ స్వ‌ప్నాన్ని సాకారం చేయవలసివుందని ప్ర‌జ‌ల‌ కు ప్ర‌ధాన మంత్రి ఉద్బోధించారు.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ‘స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్’ లో మ‌నం చెప్పుకోద‌గ్గ భూ భాగాన్ని ప‌రిశుభ్రంగా మార్చామ‌ని, అయితే మనం సాధించవలసింది మ‌రెంతో ఉందంటూ అందుకోసం మ‌నం మన ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఆ త‌రువాత మ‌హాత్మ గాంధీ మ్యూజియమ్ ను ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు.