Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్య సభ కు కొత్త గా నామినేట్ అయిన సభ్యుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


జీవనం లోని విభిన్న రంగాల కు చెందిన ప్రముఖులు రాజ్య సభ కు నామినేట్ అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి అభినందనల ను తెలియజేశారు.  క్రీడాకారిణి పి.టి. ఉష గారి నిసంగీత దర్శకుడు శ్రీ ఇళయరాజా నుపరోపకారి మరియు సామాజిక కార్యకర్త శ్రీ వీరేంద్ర హెగ్గడె ను,  చలనచిత్ర దర్శకుడు మరియు సినిమా కథ రచయిత శ్రీ వి. విజయేంద్ర ప్రసాద్ ను రాజ్య సభ కు నామినేట్ చేయడమైంది.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పి.టి. ఉష గారు భారతదేశం లో ప్రతి ఒక్కరికీ ప్రేరణ గా ఉన్నారు.  క్రీడల లో ఆమె కార్యసాధన లు అందరికే తెలిసినవే.  కానీగడచిన అనేక సంవత్సరాల లో వర్ధమాన క్రీడాకారిణుల కు/క్రీడాకారుల కు సలహాల ను, శిక్షణ ను ఇస్తూ వస్తున్న ఆమె కృషి సైతం అంతే ప్రశంసనీయం గా ఉన్నది.  ఆవిడ రాజ్య సభ కు నామినేట్ అవుతున్న సందర్భం లో ఇవే అభినందన లు.  @PTUshaOfficial’’

‘‘@ilaiyaraaja ఇళయరాజా గారి యొక్క సృజనాత్మక ప్రతిభ తరాల కు అతీతం గా వ్యక్తుల ను సమ్మోహపెట్టింది.  ఆయన స్వరకల్పన లు అనేక భావనల ను  సుందరం గా వ్యక్తపరుస్తూ ఉంటాయి.  ఆయన జీవన యాత్ర అంత ప్రేరణ దాయకం గానూ ఉంది; ఆయన ఒక సీదా సాదా నేపథ్యం నుంచి ఎదిగిమరి ఇన్ని ఘనమైనటువంటి కార్యాల ను సాధించారు.  రాజ్య సభ కు ఆయన నామినేట్ కావడం సంతోషాన్ని కలిగిస్తున్నది.’’

‘‘శ్రీ వీరేంద్ర హెగ్గడె గారు సాముదాయిక సేవ లో అందరి కంటే ముందు వరుస లో నిలబడ్డారు.  ధర్మస్థల ఆలయం లో జరిగిన ప్రార్థనల లో పాలుపంచుకొనే అవకాశం తో పాటు గా ఆరోగ్యంవిద్య మరియు సంస్కృతి రంగాల లో ఆయన ద్వారా జరుగుతున్న మహత్కార్యాల ను తిలకించే అవకాశం కూడా నాకు లభించింది.  ఆయన తప్పక పార్లమెంటరీ కార్యకలాపాల ను సుసంపన్నం చేయగలరు.’’

‘‘శ్రీ వి. విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాల తరబడి సృజనాత్మక ప్రపంచం తో జతపడి ఉన్నారు.  ఆయన రచన లు భారతదేశం యొక్క గౌరవశాలి సంస్కృతి కి అద్దం పడతాయి; అంతే కాదు, ఈ రచనల కు  ప్రపంచ స్థాయి లో ఖ్యాతి దక్కింది. ఆయన కు రాజ్య సభ కు నామినేట్ అయినందుకు ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.