Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యోత్స‌వ్ మేళా మైదానంలో ఛత్తీస్‌ గఢ్ రాజ్యోత్స‌వ్- 2016 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగ పాఠం

రాజ్యోత్స‌వ్ మేళా మైదానంలో ఛత్తీస్‌ గఢ్ రాజ్యోత్స‌వ్- 2016 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగ పాఠం

రాజ్యోత్స‌వ్ మేళా మైదానంలో ఛత్తీస్‌ గఢ్ రాజ్యోత్స‌వ్- 2016 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగ పాఠం


ఛత్తీస్‌ గఢ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌మాన్ బ‌ల‌రామ్‌ దాస్ జీ టండ‌న్‌, ఛత్తీస్‌ గఢ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ ర‌మ‌ణ్‌ సింగ్‌ గారు, కేంద్ర‌ మంత్రివర్గంలో నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు శ్రీ‌మాన్ విష్ణుదేవ్ గారు, ఛత్తీస్‌ గఢ్ విధాన‌ స‌భ స్పీక‌ర్ శ్రీ‌మాన్ గౌరీ శంక‌ర్ అగ‌ర్వాల్‌ గారు, ఛత్తీస్‌ గఢ్ ప్ర‌భుత్వానికి చెందిన మంత్రులంద‌రికీ, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ ర‌మేష్‌ గారు, వేదిక‌ మీద ఆసీనులైన ప్ర‌ముఖులు, పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డ‌కు త‌ర‌లి వ‌చ్చిన ఛత్తీస్‌ గఢ్ కు చెందిన ప్రియ‌మైన నా సోద‌రులు మరియు సోద‌రీ మ‌ణులారా,

దేశ‌మంతా ప్ర‌స్తుతం దీపావ‌ళి పండుగ సంబ‌రాల‌లో మునిగిపోయి ఉంది. దీపావ‌ళి సంబ‌రాల సంద‌ర్భంగా ఛత్తీస్‌ గఢ్ ను సంద‌ర్శించే అవ‌కాశం నాకు ల‌భించింది. ప‌విత్ర‌మైన ఈ సంద‌ర్భంలో నేను మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. త‌ల్లులు, సోద‌రీమ‌ణుల ఆశీస్సులు పుష్క‌లంగా ఉన్న వ్య‌క్తికి ప‌నిచేసే సామ‌ర్ధ్యం, అత‌ని ప‌నితీరు ఎన్నో రెట్లు రెట్టింపు అవుతాయి. ఆ ర‌కంగా నేను ఈ రోజు ఎంతో అదృష్ట‌వంతుడిని. ఈ రోజు భాయ్ ధూజ్ సంద‌ర్భంగా వేలాది సోద‌రీమ‌ణులు, ప్ర‌త్యేకించి ఛత్తీస్‌ గఢ్ న‌లుమూల‌ల నుండి త‌ర‌లివ‌చ్చిన ఆదివాసీ సోద‌రీమ‌ణులు న‌న్ను ఈ రోజు ఆశీర్వ‌దించారు. వారికి నేను శిర‌స్సును వంచి, ప్ర‌ణామం చేస్తున్నాను. భ‌ర‌త‌ మాత సంక్షేమానికి, ఈ దేశ 125 కోట్ల మంది ప్ర‌జ‌ల సంక్షేమానికి పాటు ప‌డుతున్న ఇటువంటి మీ సోద‌రుడు మ‌రెక్క‌డా ఉండ‌డ‌ని నేను మీకు హామీ ఇస్తున్నాను.

మ‌న సీనియ‌ర్ నాయ‌కుడు , గ‌వ‌ర్న‌ర్ శ్రీ మాన్ బ‌ల‌రామ్ దాస్‌ గారి పుట్టిన రోజు ఈ రోజు. వారికి నా శుభాకాంక్ష‌లు. మ‌న పూర్వ ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్‌పేయి గారి జ‌న్మ‌దినం కూడా ఈ రోజే. వారికి మ‌నం ఎంత‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలిపినా అది త‌క్కువే అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఛత్తీస్‌ గఢ్, మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, బిహార్‌, ఝార్ ఖండ్ ల ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫున మ‌నం వాజ్‌పేయి గారికి గౌర‌వాభినందనలు తెలియ‌జేసుకొందాం. ఛత్తీస్‌ గఢ్‌ను ఏర్పాటు చేసినందుకు వారికి అభినంద‌న‌లు తెలియ‌జేద్దాం. ప్ర‌తి ఒక్క‌రినీ త‌న వెంట తీసుకు వెళ్తూ, ప్ర‌జాస్వామిక స‌మున్న‌త సంప్ర‌దాయాల‌న్నింటినీ పాటిస్తూ, శాంతియుత ప‌ద్ధ‌తిలో ఛత్తీస్‌ గఢ్‌, ఝార్ ఖండ్‌, ఉత్త‌రాఖండ్‌ ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా వాజ్‌పేయి గారు ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలచారు. ఇది భావి త‌రాల‌లో ప్రేమ‌ను, సోద‌ర భావాన్ని మ‌రింత బ‌ల‌ప‌ర‌చ‌డానికి ఉప‌క‌రిస్తుంది.

రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి మ‌న దేశంలో ఎటువంటి విద్వేషాలు త‌లెత్తేవో, ఎటువంటి విభేదాలను అది సృష్టించేదో మ‌నంద‌రికీ తెలుసు. రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అభివృద్ధి కుంటుబ‌డితే మ‌నం విద్వేషాల‌తోనే కొట్టుమిట్టాడాల్సి వ‌స్తుంది. వాజ్‌పేయి గారు వంటి గొప్ప నాయ‌కుడు మ‌న‌కు ఛత్తీస్‌ గఢ్‌ను ఇవ్వడం మ‌న అదృష్టం. 16 సంవ‌త్స‌రాల క్రితం ఛత్తీస్‌ గఢ్ ఏర్ప‌డిన‌పుడు గిరిజ‌న‌ప్రాంతాలు ఎక్కువ‌గా క‌లిగిన, న‌క్స‌లైట్ల ప్ర‌భావం ఎక్కువ‌గా క‌లిగిన ఈ రాష్ట్రం దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల‌తో పోటీప‌డ‌గ‌ల‌దా ? అభివృద్ధిలో ముందుకు దూసుకుపోగ‌ల‌దా ? అన్న అనుమానాలు ఉండేవి. గ‌త 13 సంవ‌త్స‌రాలుగా రాష్ట్రానికి సేవ‌చేసే అవ‌కాశం డాక్ట‌ర్‌ ర‌మ‌ణ్‌ సింగ్‌ గారికి ల‌భించింది. మాకు ఒక ఫార్ములా ఉంది. అదే అభివృద్ధి ఫార్ములా. ఈ దేశం లోని స‌మ‌స్య‌ల‌న్నింటినీ ఒకే ఒక దానితో ప‌రిష్క‌రించ‌వ‌చ్చు. అదే అభివృద్ధి ప‌థం.

కేంద్ర‌ ప్ర‌భుత్వంలో కాని, మాకు అవ‌కాశం వ‌చ్చిన రాష్ట్రాల‌లో కాని మేం పూర్తి అంకిత‌ భావంతో అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగిపోవ‌డానికి చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాం. ఈ రోజు పండిత్ దీన్‌ ద‌యాళ్‌గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి జాతికి అంకితం చేసే మ‌హ‌ద‌వ‌కాశం నాకు ద‌క్క‌డం మ‌హ‌ద్భాగ్యంగా భావిస్తున్నాను. దీన్‌ ద‌యాళ్‌ గారు ఒక మార్గ‌ద‌ర్శి. వారి ఆలోచ‌న‌ల పునాదిగా మేం మా విధానాల‌ను, వ్యూహాల‌ను ప‌విత్ర‌ భావ‌న‌తో రూపొందిస్తాం. స‌మాజం లోని అట్ట‌డుగు స్థాయి వ్య‌క్తికి కూడా సంక్షేమ‌ ఫ‌లాలను అందించేందుకు మేం ప‌విత్ర క‌ర్త‌వ్య‌ భావన‌తో మ‌మ్మ‌ల్ని మేం అంకితం చేసుకోవ‌డాన్ని కొన‌సాగిస్తాం. మాకు స్పూర్తిదాయ‌క‌మైన మ‌హ‌నీయులు పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌ గారి శ‌త‌ జ‌యంతి సంవ‌త్స‌రం ఇది. మ‌నం దీన్‌ద‌యాళ్‌ గారి శ‌త‌ జ‌యంతి సంవ‌త్స‌రాన్ని పేద‌ ప్ర‌జ‌ల సంక్షేమ సంవ‌త్సరంగా జ‌రుపుకొంటున్నాం. దీనితో ప్ర‌భుత్వాలు, స‌మాజం, స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు, ప్ర‌జా సంక్షేమంపై మ‌రిత దృష్టిపెట్ట‌డానికి వీలు క‌లుగుతుంది.

జన్ ప‌థ్ నుండి రాజ్‌ ప‌థ్‌కు, అలాగే ఆత్మ‌ప‌థంలో ఎవ‌రైనా పండిత్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేయ‌ద‌ల‌చుకుంటే అందుకు ఉన్న ఒకే ఒక పదం ఏకాత్మ‌త‌. మాన‌వ‌త్వం ఒక్క‌టే. అంటే ఒకే ఆత్మ (మాన‌వ‌తా మార్గం ఒక్క‌టే) అన్న ప‌థాన్ని నిర్మించ‌డ‌మే. నేను ఈ రోజు ఉద‌యం ఇక్క‌డకు చేరిన‌ప్ప‌టి నుండి వివిధ ప్రాంతాలను సంద‌ర్శిస్తూ అక్క‌డి ప‌థ‌కాల‌ను గ‌మ‌నిస్తూ వ‌స్తున్నాను. గొప్ప ప్ర‌భావం చూపే విధంగా వివిధ ప‌థ‌కాల‌కు జాగ్ర‌త్త‌గా రూప‌క‌ల్ప‌న చేశారు. నిర్మాణ ప‌నులు బాగున్నాయి. ఇవాళ మాత్ర‌మే కాదు, 50 సంవ‌త్స‌రాల త‌రువాత ఎవ‌రైనా ఛత్తీస్‌ గఢ్‌కు వ‌చ్చి వారు నయా రాయ్‌ పూర్‌ ను చూస్తే వారికి ఏకాత్మ‌ ప‌థం క‌నిపిస్తుంది. ఆ పైన వారు దేశం లోని చిన్న రాష్ట్రాలు సైతం ఎంత‌టి మ‌హాద్భుతాల‌ను సాధించ‌గ‌ల‌వో గ్ర‌హించ‌గ‌లుగుతారు. గిరిజ‌న ప్రాంతాలు కూడా ఎంత‌ గొప్ప ప్రాభ‌వాన్ని సంత‌రించుకొంటున్నాయో. ఈ రోజు ఈ సందేశాన్ని తెలియ‌జేయ‌డానికే ఇక్క‌డ పునాది వేయ‌డం జరుగుతోంది. ఇది 21వ శ‌తాబ్దం. ఛత్తీస్‌ గఢ్‌ లో ఈ రోజు వేస్తున్న పునాది, ఈ రోజు ప్ర‌మోట్ చేస్తున్న ప‌థ‌కాల విష‌యంలో స‌మాజం లోని అత్యంత నిరుపేద‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవ‌డం జ‌రిగింది. ఛత్తీస్‌ గఢ్ ప్ర‌జ‌లు, ఛత్తీస్‌ గఢ్ ప్ర‌భుత్వం, డాక్ట‌ర్ ర‌మ‌ణ్‌ సింగ్ బృందం ఇక్క‌డ ‘మేక్ ఇన్ ఇండియా’ ప‌థ‌కం ద్వారా ఈ ప్రాంతానికి చెందిన సహ‌జ‌వ‌ న‌రుల‌కు విలువ‌ను జోడిస్తూ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్నారు. ఈ పునాది ఎంత గట్టిదంటే దీని ప్ర‌భావం శ‌తాబ్దం అంతా ఉంటుంది. ఇది ఛత్తీస్‌ గఢ్ అదృష్టాన్ని మార్చ‌నుంది. అది ఒక్క‌టే కాదు, ఇది దేశ అదృష్టాన్ని మార్చ‌డంలో కీల‌క పాత్రను పోషించ‌నుంది.

ఈ రోజు డాక్ట‌ర్ ర‌మ‌ణ్ సింగ్ త‌మ‌కు ప్రియ‌మైన జంగిల్ స‌ఫారీ ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు న‌న్ను తీసుకు వెళ్లారు. ఆయ‌న‌కు పులులను గురించి బాగా తెలుసు. పులి ఆయ‌న క‌ళ్ల‌లో క‌ళ్ళు పెట్టి చూడ‌డానికి ముందుకు వ‌చ్చిన‌ట్ట‌ు అనిపించింది. ప‌ర్యాట‌కాన్ని దృష్టిలో పెట్టుకొని స‌హ‌జ‌ సిద్ధ‌మైన వాతావ‌ర‌ణాన్నిక‌ల్పించ‌డంతో ఛత్తీస్‌ గఢ్ ప్ర‌జ‌లు మాత్ర‌మే కాక‌, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ప్ర‌జ‌లు ఈ జంగిల్ స‌ఫారీ సంద‌ర్శ‌న‌కు త‌ర‌లి వ‌స్తార‌న్న విశ్వాసం నాకు ఉంది. ప‌ర్యాట‌క రంగ అభివృద్దికి ఎంతో అవ‌కాశం ఉంది. ప‌ర్యాట‌క రంగ అభివృద్ధికి ఛత్తీస్‌ గఢ్‌ కు అంంత‌ర్గ‌తంగా ఎంతో బ‌లం ఉంది. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించ‌డానికి ఈ ప్రాంత హ‌స్త‌క‌ళ‌లు ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ఈ ప్రాంత అడ‌వులు, స‌హజ ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌తకు నిల‌యాలు. ప్ర‌స్తుతం ప‌ర్యాట‌కులు మూలాల్లోకి వెళ్లాల‌నే ధోర‌ణి క‌లిగి ఉన్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌ర్యాట‌కానికి వారిని ఆహ్వానించిన‌ట్ట‌యితే ఛత్తీస్‌ గఢ్ అడ‌వుల‌లో ప‌ర్యావ‌ర‌ణ హిత ప‌ర్యాట‌కానికి ఎంతో బ‌ల‌మైన అవ‌కాశాలు ఉన్నాయి. క‌నీస పెట్టుబ‌డితో గ‌రిష్ఠ‌ స్థాయిలో ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌గ‌ల రంగం ప‌ర్యాట‌క రంగం. ఒక కర్మాగారాన్ని నెల‌కొల్ప‌డానికి అయ్యే ఖ‌ర్చు, అది క‌ల్పించే ఉపాధి అవ‌కాశాల‌ను లెక్క‌ లోకి తీసుకొన్న‌ప్పుడు కర్మాగారాన్ని నెల‌కొల్ప‌డానికి పెట్టే ఖ‌ర్చులో ప‌దో వంతు ఖ‌ర్చుతో మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలను క‌ల్పించ‌వ‌చ్చు. అత్యంత నిరుపేద‌లు రాబ‌డి పొంద‌గ‌ల రంగం ప‌ర్యాట‌క రంగం. ఆటోవాలా మొదలు బొమ్మ‌లను అమ్మే వారు , పండ్లను, పూలను విక్రయించే వారు, చాకొలెట్ లు, బిస్కెట్‌ లు అమ్మే వారు, చాయ్ అమ్మే వారు.. ఇలా అంద‌రూ ల‌బ్ధి పొంద‌వ‌చ్చు. అందుకే న‌యా రాయ‌పూర్‌ నుండి జంగ‌ల్ స‌ఫారీకి మార్గ‌ం అంటే అది నిజ‌మైన అభివృద్ధికి ర‌హ‌దారిగా చెప్పుకోవ‌చ్చు. భ‌విష్య‌త్తులో ఇది ప‌ర్యాట‌క గ‌మ్య‌స్థానం కానుంది. ఇవ‌న్నీ నాకు డాక్ట‌ర్ ర‌మ‌ణ్‌ సింగ్ గారు విపులంగా వివ‌రించారు. వారు క‌న్న‌ క‌ల‌లు అన్నీ త్వ‌ర‌లోనే సాకారం అవుతాయ‌న్న గ‌ట్టి విశ్వాసం నాకు ఉంది. ర‌మ‌ణ్‌ సింగ్‌ గారి నాయ‌క‌త్వంలో ఇవ‌న్నీ సాకారం అవుతుండ‌డం గొప్ప సంతృప్తిని ఇచ్చే విష‌యం.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త‌ జ‌యంతిని గురించి మాట్లాడుతూ ఒక విష‌యం చెప్పాను. దేశంలో పేద‌రికాన్ని తొల‌గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నుండి రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు, పంచాయతీలు లేదా పురపాలక సంఘాలు.. ఇలా అన్ని స్థాయిల‌లో పాల‌న వ్య‌వ‌స్థ‌లు భుజం భుజం క‌లిపి వాటి శ‌క్తియుక్తుల‌న్నీ కేంద్రీక‌రించి పేద‌రికాన్ని నిర్మూలించేందుకు కృషి చేయ‌వ‌ల‌సి ఉంది. పేదరికం నుండి విముక్తిని క‌ల్పించ‌డ‌ం అంటే, పేద‌రికంలో మ‌గ్గిపోతున్న వారికి తాయిలాలను అందించ‌డం కాదు. వారికి త‌గిన సామర్థ్యాన్ని క‌ల్పించ‌డం ద్వారా పేద‌రికం నుండి వారికి విముక్తిని క‌ల్పించాలి. చ‌దువుకొన్న వారైతే వారికి త‌గిన శిక్ష‌ణను క‌ల్పించాలి. వారికి త‌గిన ప‌రిక‌రాలు, ప‌నిచేయ‌డానికి త‌గిన అవ‌కాశాలను క‌ల్పిస్తే అత‌ను త‌న కుటుంబాన్ని పేద‌రికం వలయం నుండి బ‌య‌ట‌కు తీసుకు రాగ‌ల‌గుతాడు. అంతేకాదు అత‌ను ఇరుగుపొరుగున ఉన్న మ‌రో రెండు మూడు కుటుంబాల‌ను కూడా పేద‌రికం నుండి బ‌య‌టకు తీసుకు రాగ‌లుగుతాడు. అందుకే మేం పేద‌ల సాధికారితకు ఎంతో ప్రాధాన్య‌మిస్తున్నాం.

పేద‌ల పిల్ల‌లకు టీకాలు వేయించే కార్య‌క్ర‌మాన్నిప్ర‌భుత్వం చేప‌డుతున్న విష‌యం మ‌నంద‌రికీ తెలుసు. ఇది వారి ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు సంబంధించింది. ఈ కుటుంబాల‌ లోని త‌ల్లులు చ‌దువుకొని ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే దీనిని గురించి తెలిసిన స్థానికులు ఈ టీకాల కార్య‌క్ర‌మంలో చురుకుగా పాల్గొని పేదల పిల్ల‌ల‌కు టీకాలు వేయిస్తే ఆ ప్రాంతాల‌ లోని నిరుపేద‌ల పిల్ల‌ల‌కు కూడా ఆరోగ్య ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. మ‌న దేశంలో నిర‌క్ష‌రాస్య‌త కార‌ణంగా పేద త‌ల్లులకు పిల్ల‌ల‌కు వేయించాల్సిన టీకా ల ప్రాధాన్య‌ం గురించి తెలియ‌దు. ప్ర‌భుత్వం టీకాల కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ప్ప‌టికీ ల‌క్ష‌లాది చిన్నారులు టీకాలు వేయించుకోలేక‌పోతున్నారు. వారికి బ‌డ్జెటు ఉన్నా ఇలా జ‌రుగుతోంది. అందుకే మ‌నం ఇంద్ర‌ధ‌నుష్ పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసుకొంటున్నాం. ఈ ప‌థ‌కం కింద ఇమ్యునైజేష‌న్ కార్య‌క్ర‌మం సాదాసీదాగా జ‌ర‌గ‌దు. ఈ ప‌థ‌కం కింద గ్రామ గ్రామానికి వెళ్లి చిన్న పిల్ల‌ల వివ‌రాల‌ను సేక‌రించి వీధి వీధికీ తిరిగి పేద‌ల ఇళ్ల‌కు వెళ్లి ఇమ్యునైజేష‌న్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తారు. ఇందుకు ఎంతో శ్ర‌మ అవ‌స‌రపడుతుంది. కానీ మ‌న స‌హ‌చ‌రులు ఎంతో శ్ర‌మ‌కోర్చి అంకిత‌భావంతో ఇందుకు కృషి చేస్తున్నారు. నిరుపేద‌ల‌కు చెందిన ఇటువంటి ల‌క్ష‌లాది పిల్ల‌ల‌ను గుర్తించి వారికి టీకాలు వేయించ‌డం ద్వారా వారికి ఆరోగ్య‌వంతమైన జీవితానికి అవ‌కాశం క‌ల్పించాం. ఇందుకు మేం విజ‌య‌వంతంగా ప్ర‌చారాన్ని నిర్వ‌హించాం. కేవ‌లం గ‌ణాంకాలు స‌మ‌ర్పించే విధంగా కాకుండా దాని ఫ‌లితాన్ని అంచనా వేసే విధంగా ఈ కార్య‌క్ర‌మాన్ని రూపొందించాం.

ఒక‌ప్పుడు పార్ల‌మెంటు స‌భ్యుడికి గ్యాస్ క‌నెక్ష‌న్ ల మంజూరుకు సంబంధించి 25 కూప‌న్ లు ఇచ్చే వారు. ఈ కూప‌న్ లు ద‌క్కించుకోవ‌డానికి పెద్ద పెద్ద వారు కూడా పార్ల‌మెంటు స‌భ్యుల చుట్టూ తిరిగే వారు. ద‌య‌తో మాకు గ్యాస్‌ క‌నెక్ష‌న్ మంజూరు కు కూప‌న్ ను ఇవ్వండి, మా ఇంట్లో గ్యాస్ క‌నెక్ష‌న్ కావాలి అంటూ ప్రాథేయ‌ ప‌డే వారు. కొన్ని సంద‌ర్భాల‌లో కొంద‌రు ఎంపీలు వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారంటూ ప‌త్రిక‌ల‌లో చ‌దివే వాళ్లం. ఇటువంటి వార్త‌లు వ‌స్తుండేవి. అప్ప‌ట్లో గ్యాస్ కనెక్ష‌న్ ను పొంద‌డ‌ం అనేది ఎంత క‌ష్టంగా ఉండేదో. ఇదేదో ఎంతో కాలం కింద‌టిదేం కాదు, ప‌ది ప‌దిహేను
సంవ‌త్స‌రాల కింద‌టి ప‌రిస్థితి.

సోద‌రులు మరియు సోద‌రీ మ‌ణులారా, క‌ట్టెల పొయ్యిమీద వంట చేస్తూ జీవిత ప‌ర్యంతం ఇబ్బందులు ప‌డుతున్న నా పేద త‌ల్లుల స‌మ‌స్య‌ను నేను స్వ‌యంగా చేప‌ట్టాను. ఇలా క‌ట్టెల పొయ్యి మీద వంట చేయ‌డ‌ం అంటే ప్ర‌తి రోజూ 400 సిగ‌రెట్ల పొగ‌కు స‌మాన‌మైన పొగ‌ను పీల్చిన‌ట్టు లెక్క‌. మీరు గ‌మ‌నించండి, పేద త‌ల్లులు ప్ర‌తి రోజూ నాలుగు వంద‌ల సిగ‌రెట్ల పొగ‌కు స‌మాన‌మైన పొగ‌ను వంట చేసేట‌పుడు పీల్చ‌వ‌ల‌సి వ‌స్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆలోచించండి. వారి బిడ్డ‌ల ప‌రిస్థితి ఏమిటి ఆలోచించండి. ఈ దేశ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో గ‌మ‌నించండి. నిరుపేద త‌ల్లులు ఇటువంటి జీవితాన్నే గ‌డ‌పాల‌ని మ‌నం అనుకోగ‌ల‌మా ? ఇది వారి విధి అని వ‌దిలేయ‌గ‌ల‌మా ? కానీ, మేం ఈ అంశాన్ని మా అంత‌ట మేంగా చేప‌ట్టి ప్ర‌ధాన మంత్రి ఉజ్జ్వల ప‌థ‌కం లో భాగంగా 5 కోట్ల మంది పేద త‌ల్లుల‌కు రానున్న మూడు సంవ‌త్స‌రాల‌లో వంట గ్యాస్ క‌నెక్ష‌న్‌ను మంజూరు చేయ‌డం ద్వారా వారికి క‌ట్టెల పొయ్యి పొగ నుండి విముక్తిని క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకొన్నాం. ఆ ర‌కంగా మ‌నం ఈ త‌ల్లుల ఆరోగ్యాన్ని ర‌క్షించ‌గ‌లం. అలాగే అడ‌వికి వెళ్లి క‌ట్టెలు కొట్టుకు రావ‌డం వంటి క‌ష్ట‌మైన ప‌నులు చేయ‌కుండా చూడగ‌లం. ఫ‌లితంగా వారు వారి బిడ్డ‌ల ఆల‌న పాల‌న చ‌క్క‌గా చూసుకోగ‌లుగుతారు. సంపూర్ణ ఉత్సాహంతో మేం ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్ర‌చారం చేస్తున్నాం.

సోద‌రులు మరియు సోదరీమ‌ణులారా, దీనివెల‌నుక గ‌ల మౌలిక భావ‌న‌, దేశం నుంచి పేద‌రికాన్ని నిర్మూలించ‌డం. సోద‌ర సోద‌రీమ‌ణులారా, మ‌నం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మాన్ని ఎందుకు నిర్వ‌హిస్తున్నాం ? మ‌న దేశంలో యువ‌ జ‌నాభా సంఖ్య ఎక్కువ‌. వారికి క‌ష్టించి ప‌నిచేసే త‌త్వం ఉం ది. వారికి గొప్ప ఆలోచ‌న‌లు ఉన్నాయి. మంచి మ‌న‌సు ఉంది. వారికి అవ‌కాశం క‌ల్పిస్తే ప్ర‌పంచంలోకెల్లా అత్యుత్త‌మ ఫ‌లితాలను సాధించ‌గ‌ల స‌త్తా వారికి ఉంది. వారికి శిక్ష‌ణ‌నిస్తే నేర్చుకోవ‌డానికి, నైపుణ్యాలు స‌మ‌కూర్చుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నారు. వారికి నైపుణ్యాలు క‌ల్పిస్తే స్వావ‌లంబ‌నను సాధించ‌గ‌ల శ‌క్తి వారికి స‌మ‌కూరుతుంది. మా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అనంతరం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మేం ఒక ప్ర‌త్యేక మంత్రిత్వ‌శాఖ‌ను ఏర్పాటు చేశాం. ఇందుకోసం మేం ఒక ప్ర‌త్యేక మంత్రిని నియ‌మించాం. ప్ర‌త్యేక బ‌డ్జెటును కేటాయించాం. దేశ వ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప‌బ్లిక్‌, ప్రైవేట్ భాగ‌స్వామ్యంలో, ప‌రిశ్ర‌మ‌ వ‌ర్గాల స‌హ‌కారంతో మేం పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలను ప్రారంభించాం. ఏ న‌మూనా అవ‌స‌ర‌మైతే ఆ న‌మూనాను అందిపుచ్చుకొని నైపుణ్యాభివృద్ధి కార్య‌క్రమాలను చేప‌ట్టాం. సంప‌న్నుల పిల్ల‌లు మంచి కళాశాలల్లో సీట్లను పొంద‌గ‌లుగుతున్నారు. కొంత‌ మంది విదేశాల‌కూ వెళ్తున్నారు. పేద‌ కుటుంబాల‌కు చెందిన వారి పిల్ల‌లు మూడో త‌ర‌గ‌తో, ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కో చ‌దివి మానేసే ప‌రిస్థితి. వారు ఆ త‌రువాత వారి జీవిత‌మంతా నైపుణ్యం లేని కార్మికులుగా జీవితాల‌ను వెళ్ల‌దీయాల్సిన ప‌రిస్థితి. ఇటువంటి పిల్ల‌ల‌ను వెతికి వారిని నైపుణ్య‌ శిక్ష‌ణ‌ వైపు తీసుకువ‌స్తున్నాం. ఇందువ‌ల్ల స‌మాజంలోని అత్యంత నిరుపేద‌ల పిల్ల‌లు త‌మ చేతిలో ఉన్న నైపుణ్యం ద్వారా మంచి భ‌విష్య‌త్తును పొంద‌డానికి వీలు క‌లుగుతుంది. మేం ఆ దిశ‌గా ప‌నిచేస్తున్నాం. ఎందుకంటే మేం దేశాన్ని పేద‌రికం నుండి విముక్తం చేయాల‌నుకుంటున్నాం. ఇది ఎంత క‌ష్ట‌మైన ప‌ని అయినా కానివ్వండి, పేద‌రికాన్ని వ‌దిలించుకోవ‌డంలోనే దేశ సంక్షేమం ఆధార‌ప‌డి ఉంది. మ‌నం పేద‌రికాన్ని నిర్మూలించ‌కుండా వంద‌ ప‌నులు చేసినప్పటికీ, అది దేశ భ‌విష్య‌త్తును ఎంత‌ మాత్రం మార్చ‌బోదు. అందుకే మా శ‌క్తియుక్తుల‌న్నింటినీ పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే వినియోగిస్తున్నాం. మ‌న రైతు కుటుంబాలు పెరుగుతున్నాయి. మ‌రో వైపు వ్య‌వ‌సాయ భూమి కుంచించుకుపోతున్న‌ది. ఒక త‌రం నుంచి మ‌రో త‌రానికి వ్య‌వ‌సాయ క‌మ‌తాలు చిన్న‌వి అయిపోతున్నాయి. అందువ‌ల్ల కుటుంబాన్ని న‌డ‌ప‌డం క‌ష్టంగా మారుతోంది. చిన్న క‌మ‌తాల వ‌ల్ల కుటుంబ పోష‌ణ క‌ష్ట‌మౌతోంది. ఎవ‌రైనా రైతుకు ముగ్గురు కుమారులుంటే, అత‌ను ఒక కుమారుడిని వ్య‌వ‌సాయ ప‌నుల‌కు ఉంచుకొని మిగిలిన ఇద్ద‌రినీ జీవ‌నోపాధి కోసం న‌గ‌రానికి పంపుతానంటాడు. క‌నుక మ‌నం మ‌న వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా తీర్చిదిద్దాలి. చిన్న క‌మ‌తాల‌ లోనూ ఎక్కువ దిగుబ‌డిని సాధించాలి. ఉత్ప‌త్తి మంచి విలువ‌క‌లిగిందిగా ఉండాలి. మ‌నం అటువంటి ఆర్థిక‌ వ్య‌వ‌స్థను కోరుకొంటున్నాం. ఇటువంటి వ్య‌వ‌స్థ ప్ర‌కృతి వైప‌రీత్యాల స‌మ‌యంలోనూ రైతుకు అండ‌గా ఉండ‌గ‌ల‌దు. రైతు ఏది పండించినా అది జాతీయ మార్కెటులో విక్ర‌యించేందుకు వీలుగా ఉండాలి. ఉత్ప‌త్తిని మార్కెటు కు తీసుకువెళ్ల‌డానికి అత‌నికి గ‌ల ప‌రిమితుల‌ను ఆస‌రాగా చేసుకొని స‌మీపంలోని బ్రోక‌ర్లు , కొద్దిమంది వ్యాపారులు మాత్ర‌మే ల‌బ్దిని పొందే ప‌ద్ధ‌తి ఉండ‌కుండా చూడాలి. ఇందుకు మేం జాతీయ‌ స్థాయిలో ఆన్‌లైన్ నెట్‌వ‌ర్క్‌తో మండీల‌ను ఇ-నామ్ (e-NAM) ద్వారా ఏర్పాటు చేశాం. రైతు తను పండించిన పంట‌కు మంచి ధ‌ర‌ను త‌న మొబైల్ ఫోన్ ద్వారా పొంద‌గ‌లిగే వ్య‌వ‌స్థ‌ను మేం ఏర్పాటు చేశాం.

ఈ రోజు నేను ఇక్క‌డ వ్య‌వ‌సాయ స్టోర్‌ను సంద‌ర్శించాను. ఇ-నామ్ ను గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఛత్తీస్‌ గఢ్ ఏర్పాట్లు చేసింది. రైతులు దేశ‌వ్యాప్తంగా ఏకీకృత మార్కెటు తో అనుసంధానం కావ‌డానికి వీలు ఉంటుంది. రైతు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ధ‌ర‌ పొందే విధంగా మేం చ‌ర్య‌లు తీసుకున్నాం. ఈ రోజుల్లో రైతులు ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా దెబ్బ‌ తింటున్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో విప‌రీత‌మైన వ‌ర్షాలు పంట‌ల‌ను దెబ్బ‌తీస్తుంటే, మ‌రి కొన్ని సంద‌ర్భాల‌లో క‌ర‌వు ప‌రిస్థితులు ఉంటున్నాయి. ఇంకొన్ని సంద‌ర్భాల‌లో పంట చేతికి వ‌చ్చే ద‌శ‌లో వ‌ర్షాలు దెబ్బ‌తీస్తున్నాయి. దేశంలో మొద‌టి సారిగా రైతుల‌కు ప్ర‌ధాన‌ మంత్రి పంట‌ల బీమా ప‌థ‌కం కింద ర‌క్ష‌ణ‌కు భ‌రోసా ఇవ్వ‌బ‌డుతోంది. ఈ బీమా ప‌థ‌కానికి స్వ‌ల్ప మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. బీమాలో ఎక్కువ మొత్తం భార‌త ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. మ‌నం జూన్‌లో విత్త‌నాలు నాటాలి. కానీ జూలై వ‌ర‌కు వ‌ర్షాలు లేవు. అందువ‌ల్ల అత‌ను విత్త‌నాలు నాట‌లేని ప‌రిస్థితి. అందువ‌ల్ల అత‌ని పంట న‌ష్ట‌పోలేదు. క‌నుక అత‌ను పంట బీమా ప‌థ‌కం కింద మామూలుగా అయితే ప్ర‌యోజ‌నం పొంద‌డానికి లేదు. అయితే మేం ప్ర‌ధాన‌ మంత్రి పంట బీమా ప‌థ‌కాన్ని ఎలా రూపొందించామంటే, రైతు విత్త‌నాలు నాట‌క‌పోయినా అంగుళం భూమిలో విత్త‌నాలు నాట‌క‌పోయినా మేం అత‌ని రాబ‌డిని ఆ సంవత్స‌రానికి అంచ‌నా వేసి ప‌రిహారం ఇప్పిస్తాం. ఇటువంటి విధానాన్ని అమ‌లు చేయ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే తొలి సారి.

పంట‌ సిద్ధ‌మైంది. పంట చేతికి వ‌చ్చే ద‌శ‌ వ‌ర‌కు అంతా బాగాను ఉంది, పంట బ్ర‌హ్మాండంగా పండింది. పంట కోత‌లు పూర్త‌ి అయ్యాయి. ఇక దానిని ట్రాక్ట‌ర్‌కు త‌ర‌లించాల‌నుకుంటున్న స‌మ‌యంలో అనుకోకుండా వ‌ర్షం ప‌డి, మొత్తం పంట దెబ్బ‌తింది. ఇంత‌కుముందు బీమా కంపెనీల వారు, పంట కోత‌కు ముందు న‌ష్టం జ‌ర‌గ‌లేదు క‌నుక మీకు న‌ష్ట ప‌రిహారం రాద‌ని చెప్పే వారు. కానీ మేం ఇటువంటి ప‌రిస్థితికి ప‌రిహారాన్ని చెల్లించే విధంగా ప్ర‌ధాన‌ మంత్రి పంట బీమా ప‌థ‌కంలో చేర్చాం. పంట కోసిన త‌రువాత పంట పొలంలోనే ఉంటే ప‌దిహేను రోజుల‌ లోగా ఏదైనా వైప‌రీత్యం వ‌చ్చి ప‌డి పంట న‌ష్ట‌పోతే ప్ర‌ధాన‌ మంత్రి ఫ‌స‌ల్‌ బీమా యోజ‌న కింద న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించే ఏర్పాటు చేశాం. మేం ఆ ద‌శ వ‌ర‌కు బీమా స‌దుపాయం క‌ల్పించాం. మ‌నం మ‌న దేశ రైతుల‌ను ర‌క్షించుకోవాలి. దానితో పాటు వారి ఉత్ప‌త్తుల‌కు అద‌న‌పు విలువను జోడించాలి. రైతులు ఏది పండించినా, మనం వాటికి విలువ‌ను జోడించాలి. రైతు మామిడికాయ‌ల‌ను పండించి ఊర‌గాయ‌ను త‌యారు చేస్తే అత‌ను ఎక్కువ‌గా అమ్ముకోగ‌లుగుతాడు.

అత‌ను టోమాటోలు పండిస్తే కెచ‌ప్ త‌యారు చేస్తే అది ఎక్కువ‌ మందికి అమ్ముకోవ‌డానికి వీలు ఉంటుంది. పాలు ఉత్ప‌త్తి చేస్తే అత‌ను త‌క్కువ‌ మందికి అమ్ముకోవ‌ల‌సి వ‌స్తుంది. దానితో మిఠాయిలు త‌యారు చేసి అమ్మితే ఎక్కువ‌ మందికి విక్రయించి ఎక్కువ డ‌బ్బును సంపాదించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇలా విలువ‌ను జోడించ‌డం ఉండాలి. రైతుల ఉత్ప‌త్తుల‌కు విలువ‌ను జోడించే ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నేను ఛత్తీస్‌ గఢ్‌లో చూశాను. చెర‌కును పండించే రైతు చెర‌కును అమ్ముతూ పోతే అత‌ను ఎక్కువ లాభాన్ని పొంద‌లేడు. చ‌క్కెరను త‌యారు చేసి అమ్మితే అప్పుడు రైతు లాభం పొంద‌గ‌లుగుతాడు. అందువ‌ల్ల ఒక‌దాని త‌రువాత మరొక‌టిగా మ‌న దేశం లోని గ్రామాలను శ‌క్తివంతం చేయ‌డానికి, పేద‌లు, రైతులు, రైతు కూలీలు, యువ‌కుల‌ శ‌క్తిని బ‌లోపేతం చేసే చ‌ర్య‌లు చేప‌ట్టి దేశ అభివృద్దిని ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకు పోయేందుకు చ‌ర్య‌లు తీసుకొన్నాం. స‌హ‌కార స‌మాఖ్య విధానంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టి ముందుకు పోతున్న‌ది అలాగే పోటీ స‌హ‌కార ఫెడ‌రలిజంపై దృష్టి పెడుతోంది. రాష్ట్రాల మ‌ధ్య పోటీ ఉండాల‌ని, ఆ పోటీ అభివృద్ధి కోసం పోటీగా ఉండాల‌ని మేం కోరుకొంటున్నాం. ఒక రాష్ట్రం బ‌హిరంగ మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న ర‌హిత రాష్ట్రంగా రూపుదిద్దుకొంటే, ఇత‌ర రాష్ట్రాలు కూడా ఒక ప‌ట్టుద‌ల‌గా మారి తాము వెనుక‌బ‌డి పోకూడ‌ద‌న్న పోటీత‌త్వం ఏర్ప‌డాలి. మేం కూడా ఇది సాధించ‌గ‌లం అన్న ప‌ట్టుద‌ల ఏర్ప‌డాలి. ఏదైనా రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి ఒక ప్ర‌త్యేక విధానాన్ని అనుస‌రిస్తే ఇత‌ర రాష్ట్రాలు ఆ రాష్ట్రం కంటే మ‌రింత ముందుకు వెళ్ల‌డానికి అంత‌కంటే మెరుగైన విధానాన్ని ముందుకు తీసుకురావాలి. అభివృద్ధి కోసం రాష్ట్రాల మ‌ధ్య పోటీని మేం కోరుకొంటున్నాం. స్పర్థ అనేది అభివృద్ధి కోసం ఉండాలి. అభివృద్ధి ప్ర‌యాణంలో త్వ‌రిత‌ గ‌తిన ప్ర‌యాణించాల‌నుకొనే అన్ని రాష్ట్రాల‌కు అన్ని వేళల మ‌ద్ద‌తు ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ఛత్తీస్‌ గఢ్ ప్ర‌భుత్వం రూపొందించే ప‌థ‌కాలు గాని, లేదా ఇప్ప‌టికే ఛత్తీస్‌ గఢ్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో గాని కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రంతో భుజం భుజం క‌లిపి అండ‌గా నిల‌బ‌డుతుంది. ఇక ముందు కూడా ఈ మ‌ద్ద‌తు కొన‌సాగుతుంది. ఛత్తీస్‌ గఢ్ ను ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకు పోయే విష‌యంలో మేం ఎంత‌మాత్రం వెన‌క‌డుగు వేయం. ఛత్తీస్‌ గఢ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినం- రాజ్యోత్స‌వ్ సంద‌ర్భంగా ఛత్తీస్‌ గఢ్ ప్ర‌జ‌ల‌కు నా శుభాకాంక్ష‌లు. ఛత్తీస్‌ గఢ్ ఉజ్జ్వల భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మైన పూర్తి మ‌ద్ద‌తు భార‌త ప్ర‌భుత్వం నుండి ల‌భిస్తుంద‌ని నేను మీకు హామీ ఇస్తున్నాను. మ‌నంద‌రం క‌ల‌సి క‌ట్టుగా ఛత్తీస్‌ గఢ్‌ను అభివృద్ధిలో ఉన్న‌త‌ శిఖ‌రాల‌కు తీసుకు పోయేందుకు కృషి చేద్దాం. ఈ ఒక్క ఆకాంక్ష‌తో నాతో పాటు అంద‌రూ ఒక్క‌సారిగా ‘‘భార‌త్ మాతా కీ జయ్’’ అంటూ నిన‌దిద్దాం.

మ‌రింత బాగా వినిపించేటట్టు ఈ నినాదాన్ని గొంతెత్తి బిగ్గరగా పలుకుదాం..

‘‘భార‌త్ మాతా కీ జయ్

భార‌త్ మాతాకీ జయ్

భార‌త్ మాతాకీ జయ్.’’

మీకు అనేక ధ‌న్య‌వాదాలు.

 

***