యువర్ ఎక్స్లన్సి రాష్ట్రపతి గారు,
గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి గారు,
మాన్య స్పీకర్ సర్,
శ్రీ ప్రహ్లాద్ గారు మరియు ఆదరణీయ ప్రజాప్రతినిధులారా,
భూత కాలం తో మన సంబంధాన్ని పటిష్ట పరచడం తో పాటు, భవిష్యత్తు కాలం కోసం కృషి చేసేందుకు మనకు ప్రేరణ ను అందించేటటువంటి కొన్ని సందర్భాలంటూ ఉంటాయి. ఈ రోజు, నవంబర్ 26వ తేదీ, ఒక చరిత్రాత్మక దినం. 70 సంవత్సరాల క్రిందట మనం ఒక క్రొత్త దృక్పథం తో కూడిన రాజ్యాంగాన్ని స్వీకరించాము. అయితే, అదే కాలం లో- నవంబర్ 26వ తేదీ నాడే- భారతదేశం యొక్క ఘనమైన సంప్రదాయాన్ని, వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని, వసుధైవ కుటుంబకమ్ అనే ఆదర్శాన్ని, మన మనుగడ తాలూకు ఈ మహనీయతను బదాబదలు చేసేందుకు ఉగ్రవాదులు ముంబయి లో ప్రయత్నించారు. ఆ ఘటన లో విగత జీవులు అయిన అందరికి నేను ప్రణమిల్లుతున్నాను. 7 దశబ్ధాల క్రితం పవిత్రమైన గళాలు ఇదే సెంట్రల్ హాల్ లో ప్రతిధ్వనించాయి.. రాజ్యాంగం లోని ప్రతి ఒక్క అధికరణాన్ని గురించి సమగ్రంగా చర్చించడమైంది. వాదోపవాదాలు వెల్లువెత్తాయి; యధార్థాలు తెర ముందు కు వచ్చాయి. ఆలోచనల పై తర్జభర్జన లు జరిగాయి. నమ్మికల ను గురించి, స్వప్నాల ను గురించి, సంకల్పాల ను గురించి చర్చించడం జరిగింది. ఒక రకం గా, ఈ సభ జ్ఞానం తాలూకు ‘మహాకుంభ్’ వలె అగుపించింది. ఇక్కడ భారతదేశం లోని నలుమూల ల చెందిన కలల ను మాటల లోకి అనువదించేందుకు గొప్పదైనటువంటి కృషి సాగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ భీం రావ్ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ గారు, సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్, పండిత్ నెహ్రూ గారు, ఆచార్య శుక్రానీ గారు, మౌలానా ఆజాద్ గారు, పురుషోత్తం దాస్ టండన్ గారు, సుచేత కృపలానీ గారు, హంసా మెహతా గారు, ఎల్.డి. కృష్ణస్వామి అయ్యర్ గారు, ఎన్.కె. గోపాల స్వామి అయ్యంగార్ గారు, జాన్ మథాయి గారు.. ఈ విధం గా ఎందరో మహనీయులు ప్రత్యక్షం గా, అప్రత్యక్షం గా వారి యొక్క తోడ్పాటు ను అందించడం ద్వారా ఈ యొక్క విశిష్ట వారసత్వాన్ని మన కు అప్పజెప్పారు.
ఈ రోజు న, ఈ యొక్క సందర్భం లో, ఆ మహానుభావులు అందరి ని నేను స్మరించుకొంటూ, వారి కి సమ్మాన పూర్వక శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. ఈ రోజు న, రాజ్యాంగాన్ని స్వీకరించడాని కి ఒక రోజు ముందు గా- అంటే 1949 సంవత్సరం నవంబర్ 25వ తేదీ నాడు- బాబాసాహెబ్ గారు తన కడపటి ఉపన్యాసం లో ప్రవచించిన అన్ని అంశాల ను నేను ప్రస్తావించ దలచుకొన్నాను. భారతదేశం తొలుత 1947వ సంవత్సరం లో విముక్తం అయిందని, మరి 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నాడు ఒక గణతంత్రం గా ఆవిర్భవించిందని బాబాసాహెబ్ గారు దేశాని కి గుర్తు చేశారు; అయితే, అలా జరుగలేదు. భారతదేశం అంతకన్నా ముందుగానే స్వేచ్ఛాయుతం అయింది. మరి మనం ఇక్కడ ఎన్నో గణతంత్రాల ను చూశాము. వారు వారి యొక్క దుఃఖాన్ని వెలిబుచ్చుతూ, మనం మన యొక్క స్వీయ తప్పు ల కారణం గా గతం లో స్వేచ్ఛ ను కోల్పోయామని, అంతేకాక, అదే కారణం వల్ల గణతంత్ర స్వభావాన్ని కూడాను పోగొట్టుకొన్నామని పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల లో దేశం స్వాతంత్య్రాన్ని సముపార్జించుకొన్నప్పటికిని మనం సైతం ఒక గణతంత్రం గా అవతరించిన్పటికిని, దీని ని నిలబెట్టుకోగలగుతామా? అంటూ ఆయన హెచ్చరించారు. మనం గత కాలం నుండి నేర్చుకోగలమా? బాబాసాహెబ్ గారు ఈ రోజు న ఇక్కడ ఉన్నట్లయితే గనుక ఆయన వేసిన ప్రశ్నల కు భారతదేశం ఇన్ని సంవత్సరాల లో జవాబులు ఇవ్వడమొక్కటే కాకుండా స్వాతంత్య్రాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని మరింత గా సుసంపన్నం చేయడంతో పాటు సాధికారిత ను సంతరించినందున ఆయన కన్నా సంతోషించే వారు మరి ఒకరు ఉండే వారే కాదు. అందుకని ఈ నాటి ఈ సందర్భం లో నేను గడచిన ఏడు దశాబ్దుల లో రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ని పదిలం గా ఉంచిన కార్యనిర్వహణ, న్యాయపాలన మరియు శాసనిక యంత్రాంగాల యొక్క సభ్యులందరి ని గుర్తు కు తెచ్చుకొంటూ వందనమాచరిస్తున్నాను. ప్రత్యేకించి భారతదేశ స్వాతంత్య్రం పట్ల విశ్వాసాన్ని ఏ నాడూ క్షీణింప చేసుకోనటువంటి 130 కోట్ల మంది భారతీయుల కు నేను శిరస్సు ను వంచి మరీ నమస్కరిస్తున్నాను. మన రాజ్యాంగాన్ని సదా ఒక దారి ని చూపేటటువంటి దీపం గా మరియు ఒక పవిత్ర గ్రంథం గా పరిగణించడం జరుగుతోంది.
రాజ్యాంగం అమలు లోకి వచ్చిన 70 సంవత్సరాల కాలం మనకు సంతోషాన్ని, శ్రేష్ఠత్వాన్ని మరియు ముగింపు ను కలబోసినటువంటి ఒక మిశ్రమ భావాల ను ప్రసాదించింది. రాజ్యాంగ స్ఫూర్తి దృఢమైందిగాను, అచంచలంగాను ఉందన్న వాస్తవం పట్లనే ఈ హర్షం. అటువంటి ప్రయత్నాలు జరిగిన ప్రతి సారీ వాటి ని దేశ పౌరులు కలసికట్టు గా భగ్నం చేశారు. రాజ్యాంగాని కి హాని తలపెట్టేందుకు ఎన్నడూ అనుమతి ని ఇవ్వడం జరుగ లేదు. మనం మన రాజ్యాంగం యొక్క బలం రీత్యా శ్రేష్ఠత్వాన్ని నమోదు చేశామన్నది తథ్యం. మరి మనం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ దిశ గా కూడాను పయనించ గలుగుతున్నాము. మనం రాజ్యాంగం యొక్క పరిధి కి లోబడే అనేక సంస్కరణల ను మనం కొని తెచ్చుకొన్నాము. అంతిమం గా చెప్పుకోవలసింది ఈ బృహత్తరమైనటువంటి మరియు వైవిధ్యభరితమైనటువంటి భారతదేశం యొక్క పురోగతి కి, నూతన భవిష్యత్తు కు ‘న్యూ ఇండియా’ కోసం ఏకైక మార్గం రాజ్యాంగమే అన్న సంగతి ని గురించి. రాజ్యాంగ స్ఫూర్తి ని పరిరక్షించడాని కి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఇది. మన రాజ్యాంగం అత్యంత ఘనమైనటువంటిది. ఇది మనకు అత్యంత పావనమైన వచనం కూడాను. ఇది ఎటువంటి పుస్తకం అంటే ఇది మన జీవనం, మన సమాజం, మన సంప్రదాయాలు, మన విశ్వాసాలు, మన ప్రవర్తన మరియు మన సభ్యత.. వీటన్నిటి ని ఆవరించి ఉండేటటువంటిది. అనేక సవాళ్ళ కు పరిష్కార మార్గాలు సైతం ఉన్నాయి. మన రాజ్యాంగం ఎంతటి విశాలమైనది అంటే ఇది వెలుపలి కాంతి కోసం తన కిటికీల ను బార్లా తెరచి ఉంచుకొంది. పైపెచ్చు, లోపలి జ్యోతి కి మరింత కాంతివంతం గా జ్వలించేందుకు ఒక అవకాశాన్ని సైతం ఇవ్వడమైంది.
ఈ రోజు న, ఈ సందర్భం లో, నేను 2014వ సంవత్సరం లో ఎర్ర కోట బురుజుల మీది నుండి ఆడిన మాటల ను మరొక్క మారు చెప్పదలచుకొన్నాను. రాజ్యాంగాన్ని రెండు సులువైన మాటల లో నేను వర్ణించాలి అనుకొన్నప్పుడు, ఆ మాటలు ఏమిటంటే భారతదేశాని కి ఏకత మరియు భారతీయుల కు గౌరవం అనేవే. ఈ రెండు మంత్రాల ను మన రాజ్యాంగం నెరవేర్చింది. ఇది పౌరుల గౌరవాన్నియావత్తు భారతదేశం యొక్క ఏకత ను మరియు అఖండత ను సర్వోన్నతం గా నిలిపింది. మన రాజ్యాంగం ప్రపంచ ప్రజాస్వామ్యం యొక్క అంతిమ ఉదాహరణ గా ఉన్నది. ఇది మనకు మన హక్కుల ను గురించి మాత్రమే కాక మన విధుల ను గురించిన ఎరుక ను కూడా కలిగిస్తుంది. ఒక విధం గా చూసినప్పుడు, మన రాజ్యాంగం ప్రపంచం లో అత్యంత మత రహితమైంది గా నిలచింది. మనం ఏమి చేయాలో అనే దాని కి, మనం ఎంత పెద్ద కల ను కనవచ్చును అనే దానికి, మనం ఎక్కడ కు చేరుకోవచ్చు అనే దాని కి ఒక గిరి అంటూ గీచింది లేదు. రాజ్యాంగం తనంతట తానే హక్కుల ను గురించి మాట్లాడుతోంది. అదే మాదిరి గా రాజ్యంగం విధుల ను నిర్వర్తించడాని కి సంబంధించిన అంచనా ను తనలో ఇముడ్చుకొన్నది. మనం ఒక వ్యక్తి గా, ఒక కుటుంబం గా, ఒక సమాజం గా మన విధుల పట్ల, మన రాజ్యాంగం వలెనే అంత గంభీరం గాను ఉన్నామా? రాజేంద్ర బాబు గారు చెప్పినట్లు గా రాజ్యాంగం లో లిఖించి లేనటువంటి దాని ని మనం ఒక ఆనవాయితీ గా ప్రతిష్ఠించవలసి ఉన్నది. మరి ఇదే భారతదేశం యొక్క ప్రత్యేకత కూడాను. గడచిన దశాబ్దాల లో మనము మన యొక్క హక్కు ల పట్ల స్పష్టత ను వక్కాణించాము. మరి అది అత్యవసరమే కాకుండా, తప్పనిసరి కూడాను. ఎందుకంటే, సమాజం లో నెలకొన్న వ్యవస్థ ల కారణం గా ఒక పెద్ద వర్గాని కి వారి యొక్క హక్కుల ను తిరస్కరించడం జరిగింది. హక్కుల ను పరిచయం చేయకుండా ఈ పెద్ద వర్గం సమానత్వం యొక్క మరియు న్యాయం యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించడమనేది కుదిరే పని కాదు. కానీ, ఈ రోజు న తక్షణ అవసరం ఏమిటి అంటే పౌరులము గా మనము మన యొక్క కర్తవ్యాల ను, బాధ్యతల ను పాటించాలి. దీనితో పాటు మన హక్కుల ను కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే మనం మన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా మన హక్కుల ను కాపాడుకోలేము.
హక్కుల కు మరియు విధుల కు మధ్య ఒక ఛేదించలేనటువంటి సంబంధం అంటూ ఉంది. మరి ఈ సంబంధం గురించి గాంధీ మహాత్ముడు చాలా స్పష్టం గా వివరించి వున్నారు. ఈ రోజు న దేశం పూజ్య బాపు యొక్క 150వ జయంతి ని జరుపుకొంటున్న తరుణం లో వారి ని గురించిన ప్రస్తావన ఎంతయినా సముచితం గా ఉంటుంది. వారు అనే వారు.. హక్కు అనేది చక్కగా నిర్వర్తించినటువంటి విధి అని. వారు ఒక చోటు లో దీని ని గురించి వ్రాశారు. చదువరి కాకున్నా వివేచన కలిగిన మా తల్లి గారి వద్ద నుండి నేను నేర్చుకొన్నది ఏమిటంటే అన్ని హక్కులు మనము నిజాయతీ తో, సమర్పణ భావం తో నిర్వర్తించిన విధుల నుండే జనిస్తాయన్న విషయాన్ని. గడచిన శతాబ్ద కాలం లోని ఆరంభ దశాబ్దుల లో ఎప్పుడయితే ప్రపంచం హక్కుల ను గురించి మాట్లాడుతూ ఉండిందో, గాంధీ గారు ఒక అడుగు ముందుకు వేసి ఇలాగ అన్నారు.. మనం పౌరుల యొక్క విధుల ను గురించి మాట్లాడుకొందాము అని. 1947వ సంవత్సరం లో యునెస్కో డైరెక్టర్ జనరల్ డాక్టర్ జూలియన్ హక్స్ లే 60 మంది ప్రముఖుల కు ఒక లేఖ ను వ్రాస్తూ, వారి యొక్క మార్గదర్శకత్వాన్ని అందించవలసిందని కోరారు. మానవ హక్కుల తాలూకు ప్రపంచ నియమావళి కి ఏది ప్రాతిపదిక అయితే బాగుంటుందో సూచించండి అంటూ ఆయన తన లేఖ లో అడిగారు. మరి, ఈ లేఖ లో గాంధీ మహాత్ముడు సహా ప్రపంచంలోని ప్రసిద్ధుల అభిప్రాయాన్ని ఆయన తెలుసుకోగోరారు. అయితే, గాంధీ మహాత్ముని యొక్క ఆలోచన ప్రపంచం లోని ఇతరుల కన్నా కొంత విభిన్నం గా ఉండింది. మనం పౌరులము గా మన యొక్క విధుల ను సంపూర్ణం గా నెరవేర్చినప్పుడు మాత్రమే మన జీవితాల లో హక్కుల ను ఆర్జించుకోగలుగుతామని మహాత్ముడు అన్నారు. అంటే, ఒక రకం గా, విధుల నిర్వహణ ద్వారా హక్కుల ను పరిరక్షించుకోగలుగుతాము అన్న మాట. గాంధీ మహాత్ముడు ఆ నాడు సూచించింది ఇది. మనం గనుక విధుల ను గురించి మరియు కర్తవ్యాన్ని గురించి మాట్లాడుకొన్నప్పుడు ఇవి ఒక జాతి గా మనము నెరవేర్చవలసినటువంటి అతి సాధారణ బాధ్యత లు. మరి అలా చేసినప్పుడు సంకల్పాలు నిరూపణ అవుతాయి. కొన్నిసార్లు మనము సేవ ను విధి గా భావించడం పట్ల కూడా చాలా స్పష్టమైన శ్రద్ధ ను వహించవలసి ఉంటుంది. సేవ, విలువ లు మరియు సంప్రదాయాలు ప్రతి ఒక్క సమాజాని కి ఎంతో ముఖ్యమైనటువంటివి గా ఉన్నాయి. అయితే, విధి అనేది సేవ కన్నా ఒకింత మిన్న అయినటువంటిది. కొన్నిసార్లు అది మన శ్రద్ధ కు నోచుకోదు. మీరు రహదారి పైన సహాయం అవసరమైన వ్యక్తి కి తోడ్పడితే అది కూడా ఒక విధమైన సేవ వంటిదే. ఈ సేవా స్ఫూర్తి ఏ సమాజాన్ని మరియు మానవాళి ని అయినా చాలా బలం గా తీర్చిదిద్దుతుంది. అయితే, విధి అనేది కాస్తంత విభిన్నమైంది. రహదారి లో ఎవరికైనా సహాయం అందించడం ఒక చక్కని విషయం. కానీ, నేను ట్రాఫిక్ నియమాల ను పాటించి వుంటే, ఏ ఒక్కరి కి ఎటువంటి సమస్య లేకుండా చూసి వుంటే అది అటువంటి వ్యవస్థ లో ఒక భాగం కావడం నా యొక్క కర్తవ్యం అవుతుంది. మీరు గనుక మీకే ఒక ప్రశ్న ను వేసుకొన్నారా అంటే అది నేను చేస్తున్నదంతా దీని వల్ల నా దేశం బలోపేతం అవుతుందా లేక బలోపేతం అవదా? అనేదే. ఒక కుటుంబం లో సభ్యుని గా మనం మన పరివారం యొక్క శక్తి ని పెంచే ప్రతి పని ని చేస్తాము. అదే మాదిరి గా పౌరుల వలే మనము మన దేశాన్ని బలోపేతం చేసేందుకు కూడా అదే పని ని చేయాలి. తద్వారా మన దేశాన్ని శక్తివంతం చేయాలి.
ఎప్పుడయితే ఒక పౌరుడు తన పిల్లవాడి ని బడి కి పంపిస్తాడో, తల్లిదండ్రులు వారి విధి ని నెరవేర్చినట్లు లెక్క. అదే ఆ తల్లిదండ్రులు వారి యొక్క సంతానాన్ని మాతృభాష ను నేర్చుకోవలసింది గా కోరితే అప్పుడు కూడాను వారు ఒక పౌరుని గా వారి విధి ని నెరవేర్చుతున్నట్లే. వారు దేశం పట్ల వారి యొక్క సేవా విధి ని నిర్వర్తిస్తున్నట్లు. కావున, ఒక వ్యక్తి తన వంతు గా ప్రతి ఒక్క నీటి బిందువు ను ఆదా చేయడం వంటి చిన్న చిన్న పనులను చేసిన పక్షం లో అతడు తన పౌర విధి ని కూడా నిర్వర్తిస్తున్నట్లు అవుతుంది. ఎవరయినా ముందుకు పోయి టీకా మందు ఇప్పించడాన్ని పూర్తి చేసినప్పుడు.. ఆ పని ని చేయవలసింది గా అతడి కి ఎవ్వరూ గుర్తు చేయనప్పుడు.. అటువంటప్పుడు అతను తన విధి ని నిర్వర్తిస్తాడు. అతడు ఎవరో తనను ఒప్పించే అగత్యం లేకుండానే వోటు వేయడానికి వెళ్తే అటువంటప్పుడు అతడు తన విధి ని నిర్వర్తించినట్లు. అతడు తాను చెల్లించవలసిన పన్నుల ను సకాలం లో చెల్లిస్తే అతడు తన విధి ని నిర్వర్తించినట్లు. ఈ తరహా బాధ్యతలు అనేకం ఉన్నాయి. ఒక పౌరుని గా మనము అటువంటి వాటిని ఒక స్వాభావికమైన పని అనుకొని పూర్తి చేసినప్పుడు- దాని ని ఒక ధార్మిక అనుష్టానం గా ఎంచినప్పుడు- అటువంటప్పుడు మనం దేశాన్ని సులభం గా ముందుకు తీసుకు పోగలుగుతాము. ఈ ప్రశ్న లు మన దేశం లో ప్రతి ఒక్క పౌరుని అంతశ్చేన లో సర్వోపరి గా మారకపోతే, మన పౌర ధర్మం బలహీనం గా మిగిలి పోతుంది. అది ఏదో ఒక రూపం లో ఎవరో ఒకరి హక్కుల కు భంగం వాటిల్ల చేయవచ్చును. అందుకని, మనం ఇతరుల హక్కుల ను కాపాడే దృష్టి తో మన విధుల పై శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. మరి ప్రజల యొక్క ప్రతినిధులు గా మనకు మరిన్ని బాధ్యతలు ఉన్నాయి. రాజ్యాంగ విలువల ను బలవత్తరం చేయడం తో పాటు ఒక ఆదర్శం గా మనను మనం ఆవిష్కరించుకోవాలి. ఇది మన బాధ్యత గా మారిపోతుంది. సమాజం లో ఒక అర్థవంతమైన మార్పును తీసుకు రావడం కోసం మనం ఈ విధి ని నిర్వర్తించాలి. మనం ప్రతి ఒక్క కార్యక్రమం లోను, ప్రతి చర్చ లోను, ‘విధుల’ పై దృష్టి పెట్టాలి. మనం ప్రజల తో సంభాషించేటప్పుడు విధుల ను గురించిన చర్చ ను తీసుకు రావడాన్ని విస్మరించ కూడదు. మన రాజ్యాంగం ‘భారతదేశ ప్రజలమైన మేము’ అనే పదాల తో ఆరంభం అవుతుంది. భారతదేశ ప్రజలమైన మేము అనేది భారతదేశం యొక్క బలం గా ఉంది. మనం దీని యొక్క ప్రేరణ గా ఉన్నాము. మరి మనం దీని యొక్క ఉద్దేశ్యం కూడాను.
‘సమాజం కోసం మేము; దేశం కోసం మేము’- విధి కి సంబంధించినటువంటి ఈ అభివ్యక్తీకరణ మనకు ప్రేరణాత్మక వనరు గా ఉంది. భారతదేశం యొక్క బాధ్యతాయుతమైనటువంటి పౌరులు గా ఈ సంకల్పాన్ని తీసుకొని విధుల ను నెరవేర్చండి అంటూ మీ అందరి కీ మేము పిలుపు ను ఇస్తున్నాను. రండి, మన గణతంత్రాన్ని మనం అందరమూ మన మన విధుల లో నిమగ్నమై ఉండేటటువంటి ఒక క్రొత్త సంస్కృతి దిశ గా తీసుకుపోదాము. మనం అందరమూ దేశం యొక్క పవిత్ర పౌరులము గా మరియు క్రొత్త పౌరులు గా మారుదాము. రాజ్యాంగ దినం మన రాజ్యాంగం యొక్క లక్ష్యాల ను పరిరక్షిస్తుందని, జాతి నిర్మాణం దిశ గా తోడ్పాటు ను అందించేటట్టు మన వచన బద్ధత ను బలోపేతం చేస్తుందని, అలాగే, మన రాజ్యాంగ శిల్పులు స్వప్నించిన కల ను పండించేందుకు తగిన శక్తి ని మనకు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ ప్రదేశం ఎటువంటి పవిత్రమైన ప్రదేశం అంటే, ఇక్కడ సాగిన మేధోమథనం ఈ నాటి కి కూడాను ఇక్కడ మారుమ్రోగుతున్నది. ఈ ప్రతిధ్వని తప్పక మనలను దీవిస్తుంది. మనకు ప్రేరణ ను అందిస్తుంది. అలాగే, మనలను శక్తివంతులను గా చేస్తుంది. ఈ ప్రతిధ్వని మనకు ఒక దిశ ను సూచించడం తథ్యం. ఈ భావన తో నేను మరొక్కమారు పూజనీయులైన బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ గారి కి ఈ పవిత్ర సందర్భం అయినటువంటి నేటి రోజు న.. రాజ్యాంగ దినం నాడు.. నమస్కరిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాతల కు శిరస్సు ను వంచి ప్రణమిల్లుతున్నాను. నా దేశ ప్రజలు అందరి కీ ఇవే నా శుభాకాంక్షలు.
మీకు ధన్యవాదాలు.
https://youtu.be/IJGJW-2UQyY
**
Speaking in Parliament on #ConstitutionDay. Watch https://t.co/snTemTIFze
— Narendra Modi (@narendramodi) November 26, 2019
The dreams of the members of the Constituent Assembly took shape in the form of the words and values enshrined in our Constitution: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
आज अगर बाबा साहब होते तो उनसे अधिक प्रसन्नता शायद ही किसी को होती, क्योंकि भारत ने इतने वर्षों में न केवल उनके सवालों का उत्तर दिया है बल्कि अपनी आज़ादी को, लोकतंत्र को और समृद्ध और सशक्त किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
मैं विशेषतौर पर 130 करोड़ भारतवासियों के सामने भी नतमस्तक हूं, जिन्होंने भारत के लोकतंत्र के प्रति अपनी आस्था को कभी कम नहीं होने दिया। हमारे संविधान को हमेशा एक पवित्र ग्रंथ माना, गाइडिंग लाइट माना: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
हर्ष ये कि संविधान की भावना अटल और अडिग रही है। अगर कभी कुछ इस तरह के प्रयास हुए भी हैं, तो देशवासियों ने मिलकर उनको असफल किया है, संविधान पर आंच नहीं आने दी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
उत्कर्ष ये कि हम हमारे संविधान की मजबूती के कारण ही एक भारत, श्रेष्ठ भारत की तरफ आगे बढ़े हैं। हमने तमाम सुधार मिल-जुलकर संविधान के दायरे में रहकर किए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
निष्कर्ष ये कि विशाल और विविध भारत की प्रगति के लिए, सुनहरे भविष्य के लिए, नए भारत के लिए, भी हमारे सामने सिर्फ और सिर्फ यही रास्ता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
हमारा संविधान, हमारे लिए सबसे बड़ा और पवित्र ग्रंथ है। एक ऐसा ग्रंथ जिसमें हमारे जीवन की, हमारे समाज की, हमारी परंपराओं और मान्यताओं का समावेश है और नई चुनौतियों का समाधान भी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
संविधान को अगर मुझे सरल भाषा में कहना है तो, Dignity For Indian and Unity for India. इन्हीं दो मंत्रों को हमारे संविधान ने साकार किया है। नागरिक की Dignity को सर्वोच्च रखा है और संपूर्ण भारत की एकता और अखंडता को अक्षुण्ण रखा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
हमारा संविधान वैश्विक लोकतंत्र की सर्वोत्कृष्ट उपलब्धि है। यह न केवल अधिकारों के प्रति सजग रखता है बल्कि हमारे कर्तव्यों के प्रति जागरूक भी बनाता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
The Constitution of India highlights both rights and duties of citizens. This is a special aspect of our Constitution: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
Let us think about how we can fulfil the duties enshrined in our Constitution: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
अधिकारों और कर्तव्यों के बीच के इस रिश्ते और इस संतुलन को राष्ट्रपिता महात्मा गांधी ने बखूबी समझा था: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
As proud citizens of India, let us think about how our actions will make our nation even stronger: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
हमारी कोशिश होनी चाहिए कि अपने हर कार्यक्रम में, हर बातचीत में Duties पर ज़रूर फोकस हो: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019
हमारा संविधान 'हम भारत के लोग' से शुरू होता है। हम भारत के लोग ही इसकी ताकत है, हम ही इसकी प्रेरणा है और हम ही इसका उद्देश्य है: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 26, 2019