Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ దినోత్సవంపై రాజ్య సభలో జరిగిన చర్చ సందర్శంగా డాక్టర్ అంబేద్కర్ మార్గదర్శక సేవలను గుర్తుకు తెచ్చుకొంటూ, ప్రధాని చేసిన ప్రకటన


భారతదేశ రాజ్యాంగంలో కేవలం శాసనాలే ఉన్నాయని కాదు, అది ఒక సామాజిక పత్రం; మనకు మార్గదర్శకత్వం, స్ఫూర్తి అవసరమనిపించినపుడల్లా రాజ్యాంగాన్ని చదవవచ్చని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125వ జయంతితో పాటు రాజ్యాంగ దినోత్సవాన్నికూడా సంస్మరించుకొనేందుకు ఏర్పాటైన చర్చలో ప్రధాని పాలుపంచుకొంటూ ప్రసంగించారు.
మనమందరం కలసి ముందంజ వేయడానికి మన రాజ్యాంగం మనకు శక్తిని ప్రసాదిస్తోందని ఆయన చెప్పారు. “రాజ్యాంగ సభ సభ్యులందరికీ శ్రద్ధాంజలి ఘటించవలసిన సందర్భమిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మార్గదర్శకమైన కృషిని ఈ దేశ ప్రజలు అలక్ష్యం చేయడం గాని, లేదా విస్మరించడం గాని చేయలేరు” అని శ్రీ మోదీ అన్నారు.

“ఒక్క భారత్.. శ్రేష్ఠ భారత్”ను గురించిన తన స్వప్నాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సర్దార్ పటేల్ జయంతి నాడు నిర్వహించిన ‘ఏకత కోసం పరుగు’ కార్యక్రమ వేళ ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ ను మొదటి సారిగా ప్రధాని ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి తన వ్యాఖ్యలలో భాగంగా డాక్టర్ అంబేద్కర్, శ్రీ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇంకా శ్రీ మ్యాక్స్ ముల్లర్ల మాటలను ప్రస్తావించి, వారు కన్న కలలకు సంబంధించిన వేరువేరు అంశాలను గురించి పేర్కొన్నారు.