Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్యాంగ (జమ్ము & కాశ్మీర్ కు వర్తింపు) సవరణ ఉత్తర్వు, 2019 ఆమోదించిన మంత్రి మండలి


జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించిన సవరణ ఉత్తర్వు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదించింది. జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాని కి జరిపిన 103వ సవరణ వల్ల కలిగిన అన్ని ప్రయోజనాలు జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాని కి చెందిన వారికి వర్తించే విధంగా రాష్ట్రపతి ఆర్డినెన్సు జారీ చేస్తారు.

ప్రభావం

ఈ ఉత్తర్వు జారీ తరువాత జమ్ము & కాశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా, జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల లో ఇప్పుడున్న రిజర్వేషన్ల కు అదనంగా “ఆర్థికం గా వెనుకబడిన వర్గాలకు” 10% రిజర్వేషన్ వర్తింపజేయడం జరుగుతుంది.

పూర్వరంగం: సమదృష్టి & కూడిక

• జమ్ము & కాశ్మీర్ రాష్ట్రం లో కూడా ఆర్థికం గా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ వర్తింపు. దీనివల్ల కులం, మతం విచక్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల లో జమ్ము & కాశ్మీర్ యువత కు 10% రిజర్వేషన్లు కల్పించే సౌకర్యం ఏర్పడుతుంది. ఈ ఏడాది జనవరి నెలలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తం గా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ప్రతిపాదిత ఆర్డినెన్సు ద్వారా జమ్ము & కాశ్మీర్ యువత కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కు తోడు గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల లో కూడా రిజర్వేషన్ లభిస్తుంది.

• ప్రభుత్వ సర్వీసుల లో పదోన్నతులు కల్పించేటప్పుడు జమ్ము & కాశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల కు రిజర్వేషన్ వర్తింపజేసే ఉత్తర్వును కేబినెట్ ఆమోదించింది. 1995లో చేసిన 77వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల లో ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. సుదీర్ఘ కాలం 24 సంవత్సరాల ఎదురుచూపుల తరువాత ఇప్పుడు జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాని కి కూడా వర్తింప జేశారు.

• జమ్ము & కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల లో రిజర్వేషన్ కల్పించడం లో వాస్తవాధీన రేఖ దగ్గర లో నివసించే వారి తో సమానంగా అంతర్జాతీయ సరిహద్దు లో నివసించే వారిని కూడా చూసేందుకు వీలు కల్పించే జమ్ము & కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం, 2004 సవరణ ఆర్డినెన్సు కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇంతకు ముందు జమ్ము & కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ కు 6 కిలో మీటర్ల లోపల నివసించే యువత కు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల లో 3% రిజర్వేషన్ లభించేది. ఇప్పుడు ఈ సౌకర్యం అంతర్జాతీయ సరిహద్దు లో నివసించే ప్రజల కు కూడా వర్తిస్తుంది. సరిహద్దు ఆవల నుంచి జరిగే దాడి తీవ్రత ను ఎదుర్కుంటున్న తమకు కూడా రిజర్వేషన్ వర్తింప జేయాలని అంతర్జాతీయ సరిహద్దు లో నివసించే వారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

భారత రాజ్యాంగం లోని 16వ అధికరణం 4వ క్లాజు తరువాత 4ఎ క్లాజు చేర్చడం ద్వారా 77వ రాజ్యం గా సవరణ చేశారు. ప్రభుత్వ సర్వీసు లలో పదోన్నతులు జరిపేటప్పుడు ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు కల్పించాలని 16 (4ఎ) క్లాజు నిర్దేశిస్తుంది. రాజ్యాంగానికి 103వ సవరణ చేసినప్పుడు దానిని జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాని కి వర్తింప జేయలేదు. ఇప్పుడు చట్టం జమ్ము & కాశ్మీర్ రాష్ట్రాని కి కూడా వర్తించే విధంగా ఆర్డినెన్సు జారీ చేయడం వల్ల రాష్ట్రాని కి చెందిన ఆర్ధికం గా వెనుకబడిన వర్గాలు కూడా రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందవచ్చు.