రాజ్యాంగ (జమ్ము & కశ్మీర్ కు అనువర్తించే ) సవరణ ఆదేశం, 2017 ద్వారా రాజ్యాంగ (జమ్ము అండ్ కశ్మీర్ కు అనువర్తించే) ఆదేశం, 1954 కు చేసిన సవరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
జమ్ము & కశ్మీర్ రాష్ట్రం లో వస్తువులు, సేవల పన్ను విధానం అమలు కావడానికి ఈ ఆమోదం దోహదం చేస్తుంది.
రాజ్యాంగ (జమ్ము & కశ్మీర్ కు అనువర్తించే ) సవరణ ఆదేశం, 2017 ఇప్పటికే భారతదేశ రాజపత్రం లో ప్రచురితమైంది. రాష్ట్రపతి సమ్మతి అనంతరం 2017 జులై 6 న దీనిపై అధిసూచన వెలువడింది.