ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వాటి వివరాలు ఇలా వున్నాయి. 1. రాజ్యాంగ (నూట ఇరవై మూడవ సవరణ) బిల్లు, 2017 ను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి; 2. వెనుకబడిన తరగతుల (రద్దు) బిల్లు, 2017 ను పార్లమెంటులో వేశపెట్టడానికి మరియు 3. ఇప్పుడున్న వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం అధీనంలో ఉన్న పదవులు/సిబ్బందిని ప్రతిపాదిత నూతన వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం కోసం కొనసాగించడానికి వీలుగా మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది.
రాజ్యాంగ (నూట ఇరవై మూడవ సవరణ)బిల్లు, 2017 పేరిట ఒక రాజ్యాంగ సవరణను తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రతిపాదనకు ఈ ఆమోదం వర్తిస్తుంది. ఈ ఆమోదం ఎందుకంటే..
1. ఎ. రాజ్యాంగంలోని అధికరణం 338బి కింద సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం వెనకబడిన తరగతుల జాతీయ సంఘం ఏర్పాటు;
బి. సవరించిన నిర్వచనం ప్రకారం అధికరణం 366 కింద క్లాజ్ (26సి)ను పొందుపరచాలి. సవరించిన నిర్వచనమంటే.. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, అంటే అధికరణం 342ఎ కింద గల తరగతులు అని అర్థం చేసుకోవాలి.. ఈ ఉద్దేశం కోసమే రాజ్యాంగంలో ఇది ఉంది.
ఇంకా
2. బిల్లును ప్రవేశపెట్టడానికి గల కారణాలు :
ఎ. వెనుకబడిన తరగతుల కోసం ఏర్పాటు చేసిన జాతీయ సంఘ చట్టం, 1993 రద్దు. వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం (రద్దు) బిల్లు, 2017 కోసం సేవింగ్స్ క్లాజుతో పాటు ఉపసంహరణ వుంటుంది.
బి. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తేదీ ప్రకారం వెనుకబడిన తరగతుల జాతీయ సంఘాన్ని తొలగించడం. దీనికి సంబంధించిన చట్టంలో సెక్షన్ 3 సబ్ సెక్షన్ 1కింద ఏర్పాటైన వెనుకబడిన తరగతుల జాతీయ సంఘాన్ని రద్దు చేయడం జరుగుతుంది.
3. (ఎ) ప్రస్తుతమున్న వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం కోసం పని చేస్తున్న సిబ్బందితో పాటు, ఈ సంఘం కోసం కేటాయించిన 52 పోస్టులను ప్రతిపాదిత నూతన వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం కోసం పని చేయగలిగేలా చూడడం జరుగుతుంది. ఈ నూతన సంఘాన్ని అధికరణం 338బి కింద ఏర్పాటు చేస్తారు;
(బి) ప్రస్తుతమున్న వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం త్రికూట్ -1, భికాయిజి కామా ప్లేస్, న్యూఢిల్లీ-110066 కార్యాలయం నుండి పని చేస్తోంది. ఇదే కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేసే జాతీయ సంఘం కోసం వినియోగిస్తారు.
పైన తీసుకున్న నిర్ణయాల కారణంగా సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల సమగ్ర సంక్షేమం సాధ్యమవుతుంది.
రాజ్యాంగంలో అధికరణం 338బి ని పొందుపరచడం ద్వారా వెనుకబడిన తరగతుల జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికిగాను ప్రతిపాదిత ఉపసంహరణ చట్టం చాలా ముఖ్యం.
అధికరణం 338బిలో భాగంగా వెనుకబడిన తరగతుల జాతీయ సంఘం విధుల నిరంతరాయ కొనసాగింపునకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది.