Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని భరత్ పుర్ లో రోడ్డు దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


రాజస్థాన్ లోని భరత్ పుర్ లో ఒక రోడ్డు దుర్ఘటన జరిగి ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిది (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున, గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘రాజస్థాన్ లోని భరత్ పుర్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం గా ఉంది. గుజరాత్ నుండి ధార్మిక యాత్ర కు వెళ్ళిన భక్తులు ఈ దుర్ఘటన లో వారి ప్రాణాల ను కోల్పోయారు, వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా సంతాపం. దీనితో పాటు ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారందరు త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను.’’

‘‘భరత్ పుర్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలియ జేశారు. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని తెలిపింది.

 

***

DS/TS