ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో త్రివిధ దళాల లైవ్ ఫైర్ అండ్ విన్యాస రూపంలో స్వదేశీ రక్షణ సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనను వీక్షించారు. ‘భారత్ శక్తి’ దేశం ఆత్మనిర్భరత చొరవపై ఆధారపడిన దేశ పరాక్రమానికి నిదర్శనంగా స్వదేశీ ఆయుధ వ్యవస్థలు, వేదికల శ్రేణిని ప్రదర్శిస్తుంది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈరోజు ప్రదర్శిస్తున్న శౌర్యం, నైపుణ్యాలు నవ భారత దేశానికి పిలుపు అని అన్నారు. “ఈ రోజు, పోఖ్రాన్ మరోసారి భారతదేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం దాని వైభవానికి సాక్షిగా మారింది” అని ఆయన అన్నారు. ఇదే పోఖ్రాన్ భారత్ అణుపరీక్షకు సాక్ష్యంగా నిలిచిందని, ఈ రోజు స్వదేశీకరణ ద్వారా శక్తిసామర్థ్యాలను చూస్తున్నామని” అన్నారు.
అధునాతన ఎం ఐ ఆర్ వి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన దీర్ఘశ్రేణి అగ్ని క్షిపణిని నిన్న పరీక్షించడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోని కొన్ని దేశాలకు మాత్రమే ఈ కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానం సామర్ధ్యం, ఉందని పునరుద్ఘాటించారు ఈ పరీక్ష రక్షణలో ఆత్మ నిర్భరతకు మరో మకుటం అని చెప్పారు.
“ఆత్మనిర్భర్ భారత్ లేకుండా వికసిత్ భారత్ ఆలోచన ఊహించలేనిది” అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు, ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సంకల్పానికి నేటి సందర్భం ఒక ముందడుగు అని పేర్కొన్న ప్రధాన మంత్రి, వంటనూనెల నుంచి యుద్ధ విమానాల వరకు ఆత్మనిర్భరతకు భారత్ పెద్దపీట వేస్తోందన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించిన విజయాన్ని భారతదేశ ట్యాంకులు, ఫిరంగులు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థలతో చూడవచ్చని, ఇవి భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. “ఆయుధాలు, మందుగుండు సామగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, సైబర్, అంతరిక్షంతో మేడిన్ ఇండియా ప్రయాణాన్ని అనుభవిస్తున్నాం. ఇది నిజంగా భారత్ శక్తి” అని ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజాస్ యుద్ధ విమానాలు, అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు, జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, విమాన వాహక నౌకలు, అధునాతన అర్జున్ ట్యాంకులు, ఫిరంగుల గురించి ప్రస్తావించారు.
రక్షణ రంగంలో భారత దేశం స్వావలంబన సాధించే అవకాశాలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, విధాన సంస్కరణలు, ప్రైవేటు రంగంలో చేయడం, ఈరంగంలో ఎంఎస్ఎంఇ స్టార్టప్ ల ప్రోత్సాహం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్ల గురించి, అందులో రూ.7000 కోట్ల పెట్టుబడుల గురించి వివరించారు. అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ఫ్యాక్టరీ భారత్ లో పనిచేయడం ప్రారంభించింది. దిగుమతి చేసుకోని వస్తువుల జాబితాలను రూపొందించి, భారత పర్యావరణ వ్యవస్థలకు మద్దతు ఇచ్చినందుకు త్రివిధ దళాల అధిపతులను ఆయన అభినందించారు. గడచిన పదేళ్లలో రూ.6 లక్షల కోట్ల విలువైన పరికరాలను భారత కంపెనీల నుంచి కొనుగోలు చేయడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ కాలంలో దేశ రక్షణ ఉత్పత్తి రెట్టింపై రూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది. గడచిన పదేళ్లలో 150కి పైగా డిఫెన్స్ స్టార్టప్ లు ప్రారంభించి రూ.1800 కోట్ల విలువైన ఆర్డర్లను రక్షణ దళాలు ఇచ్చాయి.
‘భారత రక్షణ అవసరాల కోసం ఆత్మనిర్భరత సాయుధ దళాల్లో ఆత్మవిశ్వాసానికి భరోసా ఇస్తుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. యుద్ధాల్లో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలను దేశీయంగా తయారు చేసినప్పుడు సాయుధ దళాల శక్తి అనేక రెట్లు పెరుగుతుందని ఆయన చెప్పారు. గడచిన 10 సంవత్సరాలలో భారతదేశం తన స్వంత యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకలు, సి 295 రవాణా విమానాలు , అధునాతన విమాన ఇంజిన్లను ఉత్పత్తి చేసిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. భారత్ లో 5వ తరం యుద్ధ విమానాల రూపకల్పన, అభివృద్ధి, తయారీకి ఇటీవల జరిగిన క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, రక్షణ రంగం వృద్ధిని, భవిష్యత్తులో సృష్టించబోయే అనేక ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను ప్రధాని వివరించారు. ప్రపంచంలో భారత దేశం అతిపెద్ద రక్షణ దిగుమతిదారుగా ఉన్న సమయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, రక్షణ ఎగుమతిదారుగా భారత దేశం ఆవిర్భవించడాన్ని ప్రముఖంగా వివరించారు. 2014తో పోలిస్తే దేశ రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.
2014కు ముందు రక్షణ కుంభకోణాలు, మందుగుండు సామగ్రి కొరత, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు క్షీణించిన వాతావరణాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 పెద్ద కంపెనీలుగా కార్పొరేటీకరణ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా హెచ్ ఎ ఎల్ ను దివాలా అంచుల నుంచి వెనక్కి రప్పించి రికార్డు లాభాలతో ఉన్న కంపెనీగా మార్చింది. సి డి ఎస్ ఏర్పాటు, వార్ మెమోరియల్ ఏర్పాటు, సరిహద్దు మౌలిక సదుపాయాల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.
“సాయుధ దళాలకు చెందిన సైనికుల కుటుంబాలు మోదీ హామీ అర్థాన్ని అనుభవించాయి” అని ప్రధాన మంత్రి గర్వంగా చెప్పారు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలును ప్రస్తావిస్తూ. రాజస్థాన్ కు చెందిన 1.75 లక్షల మంది రక్షణ సిబ్బందికి ఒఆర్ ఒ పి కింద రూ.5,000 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు.
దేశ ఆర్థిక శక్తికి అనుగుణంగా సాయుధ దళాల బలం పెరుగుతుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన తర్వాత రక్షణ రంగంలోనూ కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఈ ప్రక్రియలో రాజస్థాన్ పాత్రను గుర్తిస్తూ, “వికసిత్ రాజస్థాన్ వికసిత్ సేనకు బలాన్ని ఇస్తుంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ, కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, వైమానిక దళాధిపతి జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ చీఫ్ మార్షల్ వివ్కే రామ్ చౌదరి, నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
భూమి, వాయు, సముద్రం, సైబర్ , అంతరిక్ష డొమైన్లలో బెదిరింపులను ఎదుర్కోవటానికి భారత సాయుధ దళాల సమీకృత కార్యాచరణ సామర్థ్యాలను ప్రదర్శించే వాస్తవిక, సినర్జియస్, మల్టీ-డొమైన్ కార్యకలాపాలను భారత్ శక్తి ఆవిష్కరిస్తుంది. విన్యాసాలలో పాల్గొనే కీలక పరికరాలు, ఆయుధాల వ్యవస్థలలో T-90 (ఐఎం) ట్యాంకులు, ధనుష్, సారంగ్ గన్ సిస్టమ్స్, ఆకాష్ వెపన్స్ సిస్టమ్, లాజిస్టిక్స్ డ్రోన్స్, రోబోటిక్ మ్యూల్స్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎ ఎల్ హెచ్) , మానవరహిత వైమానిక వాహనాలు ఉన్నాయి. భారత సైన్యం నుండి అధునాతన గ్రౌండ్ వార్‌ఫేర్ వైమానిక నిఘా సామర్థ్యాలను ప్రదర్శించింది. భారత నావికాదళం నౌకాదళ యాంటీ షిప్ క్షిపణులు, అటానమస్ కార్గో క్యారీయింగ్ ఏరియల్ వెహికల్స్ , ఎక్స్పేండబుల్ ఏరియల్ లక్ష్యాలను ప్రదర్శించింది, ఇది సముద్ర బలం , సాంకేతిక అధునాతనను ఆవిష్కరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, అడ్వాన్స్ డ్ లైట్ హెలికాప్టర్లను భారత వైమానిక దళం మోహరించింది.
స్వదేశీ పరిష్కారాలతో సమకాలీన, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి , అధిగమించడానికి భారతదేశ సంసిద్ధతను స్పష్టమైన సూచనగా, భారత్ శక్తి ప్రపంచ వేదికపై భారతదేశ దేశీయ రక్షణ సామర్థ్యాల స్థితిస్థాపకత, ఆవిష్కరణ , బలాన్ని చాటి చెప్పింది. భారత సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను, కార్యాచరణ శక్తిని, స్వదేశీ రక్షణ పరిశ్రమ చాతుర్యాన్ని, నిబద్ధతను ప్రదర్శించడం ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా దేశం సాధించిన బలమైన పురోగతికి ఈ కార్యక్రమం నిదర్శనం.
***
Addressing 'Bharat Shakti' programme in Pokhran.https://t.co/weloaoXShb
— Narendra Modi (@narendramodi) March 12, 2024
यही पोखरण है, जो भारत की परमाणु शक्ति का साक्षी रहा है, और यहीं पर हम आज स्वदेशीकरण से सशक्तिकरण का दम देख रहे हैं: PM @narendramodi pic.twitter.com/b7bWC6e6bC
— PMO India (@PMOIndia) March 12, 2024
विकसित भारत की कल्पना, आत्मनिर्भर भारत के बिना संभव नहीं है।
— PMO India (@PMOIndia) March 12, 2024
भारत को विकसित होना है, तो हमें दूसरों पर अपनी निर्भरता को कम करना ही होगा: PM @narendramodi pic.twitter.com/pf3z58lvRO
भारत शक्ति। pic.twitter.com/lbSPXsaCP1
— PMO India (@PMOIndia) March 12, 2024
भारत की परमाणु शक्ति के साक्षी रहे राजस्थान के पोखरण में आज देश ने ‘स्वदेशीकरण से सशक्तिकरण’ का दम देखा। हमारे जांबाजों के शौर्य और पराक्रम की गूंज को पूरी दुनिया ने महसूस किया है। pic.twitter.com/SGnQvMA4C1
— Narendra Modi (@narendramodi) March 12, 2024
यही तो ‘भारत शक्ति’ है… pic.twitter.com/MIKCgzaJcC
— Narendra Modi (@narendramodi) March 12, 2024
रक्षा के क्षेत्र में आत्मनिर्भर होता भारत हमारी सेनाओं में आत्मविश्वास की भी गारंटी है। pic.twitter.com/DN58t0Aaoi
— Narendra Modi (@narendramodi) March 12, 2024
जिन्होंने दशकों तक शासन किया, वो देश की सुरक्षा को लेकर गंभीर नहीं रहे, लेकिन आज देखिए… pic.twitter.com/H2ga1DiRNQ
— Narendra Modi (@narendramodi) March 12, 2024