ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజస్థాన్ లోని నాథ్ ద్వారా లో 5500 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారంభించడం మరియు వాటిని దేశ ప్రజల కు అంకితం ఇవ్వడం చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు లు మౌలిక సదుపాయాల ను వృద్ధి చెందింప చేయడం తో పాటుగా ఆ ప్రాంతం లో కనెక్టివిటీ పైన కూడాను దృష్టి ని సారించనున్నాయి. ఆ ప్రాంతం లో రైల్ వే మరియు రోడ్డు ప్రాజెక్టు లు సరకుల తో పాటు, సేవల అందజేత కు మార్గాన్ని సుగమం చేయనున్నాయి. తద్ద్వారా ఆ ప్రాంతం లో వ్యాపారాని కి మరియు వాణిజ్యానికి ఉత్తేజం లభించి మరి ప్రజల సామాజిక స్థితి, ఆర్థిక స్థితి మెరుగు పడనున్నాయి.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వైభవోపేతం అయినటువంటి భగవాన్ శ్రీనాథ్ విరాజిల్లుతున్నటువంటి ఈ మేవాడ్ గడ్డ ను సందర్శించే అవకాశం లభించినందుకు కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ముందుగా నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయం లో తాను దైవాన్ని దర్శించి, పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్న సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘ఆజాదీ కా అమృత్ కాల్’ లో ఒక ‘వికసిత భారత్’ తాలూకు లక్ష్యాల ను సాధించడం కోసం ఆశీస్సు లు అందజేయవలసింది గా దైవాన్ని వేడుకొన్నట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు.
ఈ రోజు న ఏయే ప్రాజెక్టుల కు అయితే శంకుస్థాపన మరియు వాటి ని దేశ ప్రజల కు అంకితమివ్వడం జరిగిందో ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆయా ప్రాజెక్టు లు రాజస్థాన్ లో కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేస్తాయన్నారు. ఉదయ్ పుర్ మరియు శ్యామలాజీ మధ్య జాతీయ రాజమార్గాన్ని ఆరు దోవల ను కలిగివుండే విధం గా తీర్చిదిద్దే కార్యంతో ఉదయ్ పుర్, డుంగర్ పుర్, బాంస్ వాడా ప్రాంతాల కు చాలా ప్రయోజనం కలుగుతుందని ఆయన వివరించారు. ఎన్ హెచ్-25 లోని బిలాడా-జోధ్ పుర్ సెక్శన్ నిర్మాణం తో జోధ్ పుర్ మరియు సరిహద్దు ప్రాంతం వరకు చేరుకోవడం చాలా సులభం అవుతుందన్నారు. జయ్ పుర్ నుండి జోధ్ పుర్ కు మధ్య ప్రయాణం సైతం మూడు గంటల మేరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా కుంభల్ గఢ్, ఇంకా హల్దీ ఘాటీ ల వంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాల కు చేరుకోవడం చాలా సులభం అయిపోతుందని ఆయన అన్నారు. ‘‘శ్రీ నాథ్ ద్వారా నుండి ఏర్పాటు చేసే క్రొత్త రైల్ వే లైను మేవాడ్ ను మార్ వాడ్ తో కలుపుతుంది, దీని ద్వారా చలువరాయి, గ్రానైటు వంటి రంగాల తో పాటు గనుల తవ్వకం పరిశ్రమ కు దన్ను లభిస్తుంది’’ అని ఆయన అన్నారు.
‘‘రాష్ట్రం యొక్క అభివృద్ధి తో దేశం యొక్క అభివృద్ధి సిద్ధిస్తుంది అనే సిద్ధాంతాన్ని భారతదేశం ప్రభుత్వం నమ్ముతున్నది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం లో అతి పెద్ద రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా రాజస్థాన్ ఉందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రం భారతదేశం యొక్క ధైర్యం, భారతదేశం యొక్క సాహసం, భారతదేశం యొక్క వారసత్వం, ఇంకా భారతదేశం యొక్క సంస్కృతి లకు ఆలవాలం గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. రాజస్థాన్ అభివృద్ధి తో దేశం యొక్క అభివృద్ధి ప్రత్యక్షం గా ముడిపడి ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రాష్ట్రం లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తోందని ఆయన చెప్పారు. ఆధునిక మౌలిక సదుపాయాలంటే అవి రైలుమార్గాల కు మరియు రోడ్డుమార్గాల కు పరిమితం కాదు, అవి పల్లెల కు మరియు నగరాల కు మధ్య కనెక్టివిటీ ని సైతం పెంచుతాయి; అంతేకాదు, సదుపాయాల కు దన్నుగా నిలచి సమాజాన్ని జోడిస్తాయి. డిజిటల్ కనెక్టివిటీ ని విస్తరించడం ప్రజల జీవన సౌలభ్యాని కి దోహదపడుతుందని ఆయన వివరించారు. ఆధునిక మౌలిక సదుపాయాలు సదరు ప్రాంత వారసత్వాన్ని ప్రోత్సహించడం ఒక్కటే కాకుండా అభివృద్ధి కి ఒక ఉత్తేజాన్ని కూడా ఇస్తాయి అని ఆయన తెలిపారు. ‘‘రాబోయే 25 సంవత్సరాల లో ఒక ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించాలన్న సంకల్పం వెనుక ఒక శక్తి గా ఆధునిక మౌలిక సదుపాయాలు కీలక పాత్ర ను పోషించనున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో సాధ్యం అయిన ప్రతి మౌలిక సదుపాయాల సంబంధి పథకాల లో ఇదివరకు ఎన్నడూ లేని స్థాయి లో పెట్టుబడుల ను పెట్టడం జరుగుతోంది. మరి అభివృద్ధి శరవేగం గా జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కు సంబంధించిన ప్రతి ఒక్క రంగం లో అది రైలుమార్గాలు కావచ్చు, వాయు మార్గాలు కావచ్చు, లేదా రాజ మార్గాలు కావచ్చు.. కేంద్ర ప్రభుత్వం వేల కొద్దీ కోట్ల రూపాయల ను పెట్టుబడి పెడుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కు ఈ సంవత్సరం బడ్జెటు లో పది లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, మౌలిక సదుపాయల కు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి ని పెట్టడం జరిగిందంటే అది సదరు ప్రాంతం లో అభివృద్ధి పైన మరియు ఉద్యోగ అవకాశాల పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. భారతదేశం ప్రభుత్వం యొక్క ఈ పథకాలు ఆర్థిక వ్యవస్థ కు ఒక క్రొత్త వేగాన్ని ఇచ్చాయని ఆయన అన్నారు.
దేశం లో నకారాత్మకత ను వ్యాప్తి చేయడం జరుగుతోంది, ఇది శోచనీయం అని ప్రధాన మంత్రి అన్నారు. ఆటా కు మరియు డాటా కు, సడక్ కు మరియు శాటిలైట్ కు ఇస్తున్న ప్రాధాన్యాల ను ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిదాని కి అడ్డు చెప్పే వర్గాలంటూ ఉన్నాయని ఆయన అన్నారు. కనీస సౌకర్యాల తో పాటు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన సమాన ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం అని ప్రధాన మంత్రి అన్నారు. వోట్ల దృష్టి తో కూడిన రాజకీయాలు దేశం యొక్క భవిష్యత్తు పరం గా అమలు చేయవలసిన ప్రణాళిక ను అసాధ్యమైనవి గా మార్చుతున్నాయని ఆయన అన్నారు. వృద్ధి చెందడాని కి అంతగా ఆస్కారం ఉండనటువంటి చిన్న ఆస్తుల ను ఏర్పాటు చేయడం అనేటటువంటి స్వల్పకాలిక ఆలోచన విధానం శర వేగం గా పెరుగుతున్న అవసరాల ను తీర్చజాలదని ఆయన అన్నారు. ఈ విధమైన ఆలోచన లు మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడాని కి దారితీశాయని, దానంతో దేశాని కి ఎంతో చేటు జరిగిందని ఆయన అన్నారు.
‘‘దేశం లో మౌలిక సదుపాయాల పరం గా రాబోయే కాలాని కి సంబంధించిన దృష్టి కోణం అంటూ ఒకటి లేకపోవడం వల్ల రాజస్థాన్ ఎంతగానో నష్టపోయింది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు ఎదుర్కొన్న యాతనలు ఒక చోటు నుండి మరొక చోటు కు ప్రయాణించడాని కి మాత్రమే పరిమితం కాలేదు, ఆ కష్టాలు వ్యవసాయాని కి, వ్యాపార సంస్థల కు మరియు పరిశ్రమల కు కూడా దాపురించాయి అని ఆయన అన్నారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన’ 2000 వ సంవత్సరం లో, పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ హయాం లో, ఆరంభమైన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, 2014 వ సంవత్సరం వరకు దాదాపు గా 3 లక్షల ఎనభై వేల కిలో మీటర్ ల పొడవైన గ్రామీణ రహదారుల ను నిర్మించడం జరిగింది. అదే ప్రస్తుత ప్రభుత్వం గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఇంచుమించు మూడున్నర లక్షల కిలో మీటర్ ల రహదారుల ను నిర్మించింది అని ఆయన పేర్కొన్నారు. మరి వీటి లో 70 వేల కిలో మీటర్ ల గ్రామీణ రహదారుల ను రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల లో నిర్మించడమైందని ఆయన తెలియ జేశారు. ‘‘ప్రస్తుతం దేశం లో చాలా వరకు పల్లెలు పక్కా రహదారుల తో జతపడ్డాయి’’ అని ఆయన అన్నారు.
భారతదేశం ప్రభుత్వం రహదారుల ను పల్లెల చెంత కు తీసుకొని పోవడం తో పాటు నగరాల లో ఆధునికమైన హైవేల ను కూడా ఏర్పాటు చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. 2014 వ సంవత్సరాని కి పూర్వపు రోజుల తో పోలిస్తే జాతీయ రాజమార్గాల ను రెట్టింపు వేగం తో నిర్మించడం జరుగుతోందని ఆయన అన్నారు. దిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వే లో భాగమైన ఒక సెక్శన్ ను ఇటీవల దౌసా లో దేశ ప్రజల కు అంకితమిచ్చిన ఘటన ను ఆయన గుర్తు కు తెచ్చారు.
‘‘నేటి భారతదేశం ఒక ఆకాంక్షయుక్త సమాజం గా ఉంది. మరి తక్కువ కాలం లో ఎక్కువ సదుపాయాల ను దక్కించుకోవాలని ప్రజలు కోరుకొంటున్నారు. భారతదేశం ప్రజల మరి రాజస్థాన్ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం మా బాధ్యత గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
సామాన్య పౌరుల జీవనం లో రైలు మార్గాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఆధునికమైన రైళ్లు, ఆధునికమైన రైల్ వే స్టేశన్ లు మరియు ఆధునికమైన రైలు పట్టాల వంటి బహుళ చర్య ల ద్వారా రైల్ వే స్ ను ఆధునికీకరించాలనే ప్రణాళిక లు ఉన్నాయని వివరించారు. రాజస్థాన్ ఇప్పటికే తన ఒకటో వందే భారత్ రైలు ను అందుకొందని ఆయన అన్నారు. మావ్ లీ- మార్ వాడ్ సెక్శన్ లో గేజింగ్ మార్పిడి మరియు అహమదాబాద్– ఉదయ్ పుర్ మధ్య పూర్తి మార్గాన్ని బ్రాడ్ గేజీ మార్గం గా తీర్చిదిద్దడం అనే కార్యాలు కూడా పూర్తి అయినట్లు ఆయన తెలియ జేశారు.
మనిషి కాపలా ఉండనటువంటి రేల్ వే గేట్ లను తొలగించిన తరువాత, దేశం లో యావత్తు రేల్ నెట్ వర్క్ యొక్క విద్యుతీకరణ పైన ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటోందని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఉదయ్ పుర్ రేల్ వే స్టేశన్ పునరభివృద్ధి జరుగుతోంది, అలాగే దేశం లోని వందల కొద్దీ రేల్ వే స్టేశన్ ల ఆధునికీకరణ చోటు చేసుకొంటోంది, ఆయా రేల్ వేస్టేశన్ లలో సందర్శకుల రద్దీ పెరిగిందా అంటే గనక ఆ రద్దీ ని తట్టుకోవడాని కి అనువైనటువంటి ఏర్పాటుల ను చేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. సరకు రవాణా రైళ్ళ విషయాని కి వస్తే ఒక ప్రత్యేకమైన రైలు మార్గాన్ని, ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ను నిర్మించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. 2014వ సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు ఈ సంవత్సరం లో రాజస్థాన్ యొక్క రేల్ వే బడ్జెటు పద్నాలుగు రెట్లు పెరిగిందనే విషయాన్ని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. రాజస్థాన్ లో 75 శాతం రేల్ నెట్ వర్కు ను ఈసరికే విద్యుతీకరించడం జరిగింది, దీని తాలూకు ప్రయోజనాల ను డుంగర్ పుర్, ఉదయ్ పుర్, చిత్తౌడ్, పాలీ, సిరోహి మరియు రాజ్ సమంద్ వంటి జిల్లా లు అందుకొన్నాయని ఆయన వివరించారు. ‘‘వంద శాతం రేల్ వే విద్యుతీకరణ ను కలిగివున్న రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా రాజస్థాన్ నిలచే రోజు ఎంతో దూరం లో లేదు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రాజ్ సమంద్ లో ధార్మిక స్థలాల కు మరియు పర్యటన స్థలాల కు కనెక్టివిటీ పెరగడం తో అందిన ప్రయోజనాల ను గురించి కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. మహారాణా ప్రతాప్ యొక్క పరాక్రమాన్ని, భామాశాహ్ యొక్క ఔదార్యాన్ని, వీరాంగన పన్నా దాయీ గాథ ను గురించి ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. నిన్నటి రోజు న దేశం మహారాణా ప్రతాప్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దేశం యొక్క వారసత్వాన్ని పరిరక్షించడం కోసం వేరు వేరు సర్క్యూట్ ల తాలూకు పనుల ను ప్రభుత్వం భుజాని కి ఎత్తుకొందని ప్రధాన మంత్రి అన్నారు. కృష్ణ భగవానుడి కి సంబంధించిన యాత్రా స్థలాల ను జోడించే పని జరుగుతోంది అని ఆయన అన్నారు. లో గోవింద్ దేవ్ జీ, ఖాటూ శ్యామ్ జీ మరియు శ్రీనాథ్ జీ ల దర్శనాన్ని సులభతరం గా మార్చడం కోసం కృష్ణ సర్క్యూట్ ను అభివృద్ధి పరచడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం సేవా భావం తో పని చేస్తోంది. దీనిని ఒక భక్తి భావం గా ఎంచుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘జనతా జనార్దన్ కు జీవన సౌలభ్యాన్ని కలుగజేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యాన్ని ఇస్తోంది’’ అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, పార్లమెంటు సభ్యులు, రాజస్థాన్ ప్రభుత్వం లో మంత్రులు మరియు తదితరులు ఉన్నారు.
పూర్వరంగం
రాజ్ సమంద్ లో మరియు ఉదయ్ పుర్ లో రెండు దోవ లు ఉండేటటువంటి రహదారి నిర్మాణ పథకాల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజల కు మరింత ఉన్నతమైనటువంటి సౌకర్యాల ను అందించడం కోసం తలపెట్టిన ఉదయ్ పుర్ రేల్ వే స్టేశన్ యొక్క పునరభివృద్ధి పనుల కు కూడాను ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. గేజ్ మార్పిడి పథకాని కి మరియు రాజ్ సమంద్ లోని నాథ్ ద్వారా నుండి నాథ్ ద్వారా పట్టణం వరకు ఒక క్రొత్త మార్గాన్ని వేసే పనుల కు సైతం ఆయన శంకుస్థాపన చేశారు.
దీనికి అదనంగా, ప్రధాన మంత్రి మూడు జాతీయ రాజమార్గ పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. వాటి లో ఎన్ హెచ్-48 లో భాగం అయినటువంటి ఉదయ్ పుర్ నుండి శ్యామలాజీ వరకు గల 114 కి.మీ. పొడవైనటువంటి ఆరు దోవ ల ప్రాజెక్టు, ఎన్ హెచ్-25 లోని బార్-బిలారా-జోధ్ పుర్ సెక్శన్ లో ద్విచక్ర వాహనాల కోసం రహదారి ని వెడల్పు చేసే (పేవ్ శోల్డర్) తో కూడిన 110 కి.మీ. పొడవైన రహదారి ని నాలుగు దోవల ను కలిగి ఉండేది గా విస్తరించేటటువంటి మరియు పటిష్ట పరచేటటువంటి ప్రాజెక్టు, ఇంకా ఎన్ హెచ్-58ఇ లో పేవ్డ్ శోల్డర్ సెక్శన్ సహా 47 కి.మీ. పొడవు ను కలిగిన రెండు లేన్ లతో కూడి ఉండేటటువంటి రహదారి నిర్మాణం ప్రాజెక్టు లు కూడా భాగం గా ఉన్నాయి.
Speaking at a programme during launch of multiple initiatives in Nathdwara, Rajasthan. https://t.co/3NljofQGWf
— Narendra Modi (@narendramodi) May 10, 2023
राज्य के विकास से देश का विकास। pic.twitter.com/K5hXwBED9n
— PMO India (@PMOIndia) May 10, 2023
Creating modern infrastructure for enhancing ‘Ease of Living.’ pic.twitter.com/8j4IWIq0VU
— PMO India (@PMOIndia) May 10, 2023
भारत सरकार आज गांवों तक सड़क पहुंचाने के साथ ही, शहरों को भी आधुनिक हाईवे से जोड़ने में जुटी है। pic.twitter.com/s0gKeJt8WT
— PMO India (@PMOIndia) May 10, 2023
आज भारत सरकार अपनी धरोहरों के विकास के लिए अलग-अलग सर्किट पर काम कर रही है। pic.twitter.com/jLwXfx6Gnk
— PMO India (@PMOIndia) May 10, 2023
***
DS/TS
Speaking at a programme during launch of multiple initiatives in Nathdwara, Rajasthan. https://t.co/3NljofQGWf
— Narendra Modi (@narendramodi) May 10, 2023
राज्य के विकास से देश का विकास। pic.twitter.com/K5hXwBED9n
— PMO India (@PMOIndia) May 10, 2023
Creating modern infrastructure for enhancing 'Ease of Living.' pic.twitter.com/8j4IWIq0VU
— PMO India (@PMOIndia) May 10, 2023
भारत सरकार आज गांवों तक सड़क पहुंचाने के साथ ही, शहरों को भी आधुनिक हाईवे से जोड़ने में जुटी है। pic.twitter.com/s0gKeJt8WT
— PMO India (@PMOIndia) May 10, 2023
आज भारत सरकार अपनी धरोहरों के विकास के लिए अलग-अलग सर्किट पर काम कर रही है। pic.twitter.com/jLwXfx6Gnk
— PMO India (@PMOIndia) May 10, 2023
भारत के शौर्य और इसकी विरासत का वाहक राजस्थान जितना विकसित होगा, देश के विकास को भी उतनी ही गति मिलेगी। इसलिए हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर सबसे अधिक बल दे रही है। pic.twitter.com/sof5LvygoQ
— Narendra Modi (@narendramodi) May 10, 2023
जनहित से जुड़ी हर चीज को वोट के तराजू से तौलने वाले कभी लोगों का भला नहीं कर सकते। यही वो सोच है, जिसने दशकों तक राजस्थान सहित देश के कई हिस्सों को विकास से दूर रखा। pic.twitter.com/53Chvb4zvY
— Narendra Modi (@narendramodi) May 10, 2023
देश के दशकों पुराने रेल नेटवर्क को हमारी सरकार जिस तेज गति से आधुनिक बना रही है, उसका बड़ा लाभ राजस्थान के हमारे भाई-बहनों को भी मिल रहा है। pic.twitter.com/6jbyrqTy0a
— Narendra Modi (@narendramodi) May 10, 2023