Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని దౌసాలో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ను ‘గాడ్ భరై’ వేడుకగా జరుపుకున్న కొత్త చొరవను ప్రశంసించిన ప్రధాన మంత్రి


రాజస్థాన్ లోని దౌసాలో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ ను ‘గాడ్ భరై భ రాయి’ వేడుక గా జరుపుకునే కొత్త

కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

రాజస్థాన్ లోని దౌసా పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి జస్కౌర్ మీనా ఒక ట్వీట్ థ్రెడ్ లో, రాజస్థాన్ లోని దౌసాలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాన్ని తాము ‘గాడ్ భరై’ వేడుకగా జరుపుకుంటామని, అక్కడ గర్భిణీ స్త్రీలందరినీ సమావేశపరిచి వారి బిడ్డల ఆరోగ్యం కోసం తాము ‘పోషణ కిట్’ ఇస్తామని తెలియజేశారు.

ఈ పథకం ద్వారా ఒక్క రాజస్థాన్ లోనే 2022-23లో 3.5 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని ఆమె తెలిపారు.

దౌసా  ఎంపీ శ్రీమతి జస్కౌర్ మీనాచేసిన ట్వీట్ థ్రెడ్ పై ప్రధాని స్పందిస్తూ..

 

“దౌసా యొక్క ఈ ప్రత్యేక చొరవ ప్రధాన మంత్రి మాతృ వందన యోజనకు కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఇది తల్లులు, శిశువుల ఆరోగ్య భద్రతకు భరోసా ఇస్తుంది. ” అని ట్వీట్ చేశారు.

*******

DS/ST