Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్ లోని జెత్ సర్ లో సెంట్రల్ స్టేట్ ఫామ్ వద్ద 200 ఎమ్ డబ్ల్యు లేదా అంత కన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ప్లాంటు స్థాపన


రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా జెత్ సర్ లో నెలకొన్న ద సెంట్రల్ స్టేట్ ఫామ్ (సి ఎస్ ఎఫ్) వద్ద ఉన్న వ్యవసాయ యోగ్యంగా లేని 400 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాన్ని 200 ఎమ్ డబ్ల్యుకు మించిన సామర్థ్యం ఉండే ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వినియోగించుకొనేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ భూమి ప్రస్తుతం వ్యవసాయం, వ్యవసాయదారుల సంక్షేమం మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణ లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సి పి ఎస్ ఇ) అయిన నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ సి) ఆధిపత్యంలో ఉంది. సోలార్ పవర్ ప్లాంటు ను ఒక సి పి ఎస్ ఇ ద్వారా స్థాపిస్తారు. ఈ సి పి ఎస్ ఇ ని సంప్రదింపుల ద్వారా ఎంపిక చేయనున్నారు.

ఎన్ ఎస్ సి తన ఆధిపత్యంలో ఉన్న 5394 హెక్టార్ల లో నుంచి 400 హెక్టార్ల వ్యవసాయ యోగ్యంగా లేని భూమిని, గుర్తించిన ఒక సి పి ఎస్ ఇ కి సమకూర్చుతుంది. సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అయ్యే ఖర్చులను ఆ సి పి ఎస్ ఇ భరిస్తుంది. ఎంపికైన సి పి ఎస్ ఇ.. ఈ ప్రాజెక్టుకు టారిఫ్ ఆధారిత స్పర్ధాత్మక బిడ్ ను సమర్పించాలి. దీనికి సోలార్ పవర్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు భూమిని 25 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవడానికి కాంట్రాక్టు ఇస్తారు. ఈ కాంట్రాక్టును పరస్పరం అంగీకారం కుదిరే నియమ నిబంధనల మేరకు పొడిగించుకొనేందుకు కూడా వీలు ఉంటుంది. ఆ తరువాత యావత్తు ప్లాంటును ఎక్కడ ఉన్నది అట్లాగే ప్రాతిపదికన ఎన్ ఎస్ సి కి అప్పగించవలసివుంటుంది. వ్యవసాయ యోగ్యంగా లేని భూమిని సోలార్ పవర్ ప్లాంటు కోసం ఉపయోగించుకొనే ఈ ప్రాజెక్టు, ఎన్ ఎస్ సి కి ఆదాయాన్ని సంపాదించిపెడుతుంది. అంతే కాకుండా దేశం కోసం శుద్ధమైన శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది.

***