Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ హైవేపై రోడ్డు ప్రమాదం: విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నష్ట పరిహారం ప్రకటన


రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ హైవేపై ప్రమాదం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విచారాన్ని వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను, ఇదే ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నట్లు కూడా శ్రీ మోదీ ప్రకటించారు.

 

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్ఓ) ఇలా తెలిపింది:

‘‘రాజస్థాన్‌లో జైపూర్-అజ్మీర్ హైవేలో జరిగిన ప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం తీవ్ర విచారాన్ని కలిగించింది.  ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.  ఈ దుర్ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్ధిస్తున్నాను.  బాధితులకు స్థానిక పాలన యంత్రాంగం సహాయాన్ని అందిస్తోంది.  మృతుల కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను అందిస్తారు.  గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఇస్తారు.  ప్రధానమంత్రి @narendramodi’’

 *****

MJPS/SR/SKS